భగవంతుడు ఎవరికీ ఎవరో జంటగా దీవిలోని నిర్ణయించి భువికి పంపిస్తాడని.. ఆ జంట పెళ్లితో దంపతులవుతారని నమ్మకం. కొంతమందికి తమ జీవిత భాగస్వామి తొందరగా దొరికితే.. మరికొందరికి పెళ్లి విషయంలో అనేక అడ్డకుంలు ఏర్పడుతూనే ఉంటాయి. అయితే కొందరు అదృష్టవశాత్తూ తమకు అన్నివిధాలా తగిన జీవిత భాగస్వామిని పొందుతారు. మరికొందరు అలా పొందలేరు. ఎత్తు ఎక్కువ లేదా తక్కువ వంటి సమస్యలు ఎదురైతూ ఉంటాయి. ఎవరైనా 6 అడుగుల కంటే ఎక్కువ ఎత్తు ఉంటే.. అలాంటి వారు తాము కోరుకున్న భాగస్వామిని పొందడంలో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎత్తు తక్కువగా ఉంటే అప్పుడు మరో సమస్య ఎదురవుతుంది. అయితే ముందో, వెనుకో భాగస్వామి దొరుకుతుంది. బీహార్‌లోని ఛప్రా జిల్లాలో ఇలాంటిదే ఒకటి ఘటన చోటు చేసుకుంది. ఈ విషయం తెలుసుకున్న ప్రజలు ఆశ్చర్యపోతున్నారు.
ఛప్రా జిల్లాలోని మధౌరాలో ఉన్న లెరువా గ్రామంలో ఓ మరగుజ్జు జంటకు పెళ్లి జరిగింది. ఇక్కడ మూడున్నర అడుగుల అబ్బాయికి నాలుగడుగుల అమ్మాయితో పెళ్లి చేశారు. ఈ వివాహం మొత్తం స్థానికంగానే కాదు మొత్తం బీహార్ లో చర్చనీయాంశంగా మారింది. మీడియా కథనాల ప్రకారం వధువు, వరుడు తక్కువ ఎత్తులో ఉండటం వల్ల చాలా సమస్యలను ఎదుర్కొన్నామని వధూవరులిద్దరూ అంటున్నారు. ఎత్తు తక్కువగా ఉంటే పెళ్లి జరగదని తరచుగా వ్యాఖ్యానించేవారని.. అయితే ఇప్పుడు తాము చాలా సంతోషంగా ఉన్నామని ఇరు కుటుంబాలు చెబుతున్నాయి.
ఇద్దరి కుటుంబాలు తమ పిల్లలకు పెళ్లి చేయడానికి ఇష్టపడ్డారు. వరుడి పేరు రోహిత్ కాగా, వధువు పేరు నేహా. రోహిత్ ఎత్తు 3.5 అడుగులు కాగా, నేహా ఎత్తు 4 అడుగులు అంటే భర్త కంటే అర అడుగు పెద్ద.
రోహిత్ తండ్రి సతేంద్ర సింగ్ మాట్లాడుతూ.. తన కొడుక్కి పెళ్లి చేయాలని అనుకున్నానని, అయితే అతని ఎత్తుకు తగిన వధువు దొరకలేదని చెప్పారు. నేహా గురించి తెలిసిన వెంటనే కొడుకు పెళ్లికి ఓకే చెప్పేశానని అన్నాడు. అనంతరం నేహా, రోహిత్ ల అంగరంగ వైభవంగా పెళ్లి జరిపారు. గ్రామస్తులు కూడా భారీ సంఖ్యలో పాల్గొని వధూవరులను ఆశీర్వదించారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..