ఆధునికంగా ఎంత అభివృద్ధి చెందినా నేటికీ మన ప్రపంచ లో ఎన్నో అంతు చిక్కని రహస్యాలున్నాయి. ఇలాంటివి మన ముందుకు వచ్చినప్పుడల్లా ఆశ్చర్యానికి గురి అవుతూనే ఉన్నాం. ఈ క్రమంలో శాస్త్రవేత్తలు 4000 సంవత్సరాల నాటి పురాతన రాయిని కనుగొన్నామని.. ఆ రాయి రహస్యాన్ని పరిష్కరించడానికి ప్రయత్నాలు చేస్తున్నామని వెల్లడించారు. ఈ ఆవిష్కరణకు సంబంధించి శాస్త్రవేత్తలు మాట్లాడుతూ.. ఈ రాయిపై చేసిన మర్మమైన గుర్తులు వాస్తవానికి రహస్య నిధికి చెందిన మ్యాప్ అని అనుమానిస్తున్నట్లు వెల్లడించారు.
మీడియా నివేదికల ప్రకారం ఈ రాయి కాంస్య యుగం నాటిది. ఇది 2001 సంవత్సరంలో ఐరోపాలోని పురాతన మ్యాప్‌గా ప్రకటించబడింది. అప్పటి నుంచి శాస్త్రవేత్తలు ఈ చిత్రంలో చెక్కిన మ్యాప్ రహస్యాన్ని డీకోడ్ చేయడం ప్రారంభించారు. ఈ మ్యాప్‌కు సంబంధించి వెస్ట్రన్ బ్రిటనీ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ వైవాన్ పల్లెర్ మాట్లాడుతూ పురావస్తు ప్రదేశాలను కనుగొనడానికి ఈ మ్యాప్‌ను ఉత్తమ మార్గంలో ఉపయోగించవచ్చని చెప్పారు. సెయింట్-బెలెక్ స్లాబ్ అనేది 2150- 1600 BC మధ్య నాటి పశ్చిమ బ్రిటనీలోని ఒక కాంస్య యుగపు రాతి వస్తువు. ఈ రాయి 1900లో కనుగొన్నారు.. మళ్ళీ 2014లో మిస్ అయింది. మళ్ళీ ఈ రాయి తిరిగి ఒక సెల్లార్‌లో దొరికింది. అప్పటి నుంచి దీనిపై పరిశోధనలు చేస్తూనే ఉన్నారు శాస్త్రవేత్తలు.
The Saint-Bélec slab is a stone object found in a Bronze Age cist in western Brittany, dated to between 2150–1600 BC. It was found in 1900 and then lost until 2014, where it was rediscovered in a cellar.
Analysis since then has proven that the engravings on the slab form a… pic.twitter.com/MmcdjWAzUd
— Stone Age Herbalist (@Paracelsus1092) October 19, 2023
శాస్త్రవేత్తలు దీన్ని పూర్తిగా పరిష్కరించారని ఎవరైనా భావిస్తే తప్పుగా ఆలోచించినట్లే.. ఎందుకంటే పరిశోధకులు ఈ మ్యాప్‌ను పూర్తిగా అర్థం చేసుకోవడానికి దాదాపు 15 సంవత్సరాలు పట్టవచ్చని తెలుస్తోంది. అయితే, పరిస్థితులు మారుతున్నాయి.. మరోవైపు సాంకేతికత అభివృద్ధి చెందుతున్నందున.. అన్ని ఏళ్లు పట్టకుండా త్వరలోనే రాయి మీద ఉన్న మ్యాప్ ని పరిష్కరిస్తామని శాస్త్రవేత్తలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఈ రాయిమీద ఉన్న మ్యాప్ ను కనుక కరెక్ట్ గా పరిష్కరిస్తే అతి విలువైన భారీ నిధిని సొంతం చేసుకోవచ్చని, ఇప్పటికీ అపరిష్కృతంగా ఉన్న అనేక చరిత్ర కథల గురించి కూడా తెలుస్తుందని శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు.
మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..