ఇదేం సిటీరా బాబోయ్! 1BHK అద్దె రూ.70 వేలా? రెంట్ కట్టాలంటే ఆస్తులు అమ్ముకోవాలేమో!

|

Jun 11, 2024 | 5:58 PM

దేశ రాజధాని ఢిల్లీ వంటి నగరంలో అన్ని వర్గాల ప్రజలు నివసిస్తున్నప్పటికీ.. దేశ ఆర్ధిక రాజధాని ముంబై వంటి నగరంలో ప్రజలు నివసించడం అంటే సామాన్యులకు కొంచెం కష్టంగా మారింది. ఈ నగరంలో ఇల్లు కొనడం అన్న ఆలోచన పక్కన పెడితే.. లక్షల జీతం వచ్చే వారి పరిస్థితి కూడా అద్దెకు రూం తీసుకోవాలంటే బాబోయ్ అనే పరిస్థితి దాపురించింది. ముంబై నగరంలో అద్దె ఇళ్లకోసం పడుతున్న కష్టాలను తెలియజేస్తూ ఒక పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇదేం సిటీరా బాబోయ్! 1BHK అద్దె రూ.70 వేలా? రెంట్ కట్టాలంటే ఆస్తులు అమ్ముకోవాలేమో!
High Rentals In Mumbai
Follow us on

రోజు రోజుకీ పెరుగుతున్న జనాభా.. ప్రజల అవసరాలకు తగినట్లు పెరగని భూమి… ప్రస్తుతం ఇల్లు లేదా భూమిని కొనడం అంటే సామాన్యులకు తీరని కలగా మారుతోంది. రోజు రోజుకీ ఆస్తుల ధరలు చుక్కలను తాకుతున్నాయి. సొంత ఇళ్లను కొనలేని వారు అద్దె ఇంట్లో నివసిస్తున్నారు. బ్యాచలర్స్ లేదా తక్కువ ఆదాయం ఉన్న వారు తమ బడ్జెట్ కు తగినట్లు అద్దె గది దొరికినా చాలు అని ఆలోచిస్తున్నారు. అవును అద్దె గదుల్లో జీవిస్తున్న ప్రజల పరిస్థితి మరీ దారుణంగా మారింది. దేశ రాజధాని ఢిల్లీ వంటి నగరంలో అన్ని వర్గాల ప్రజలు నివసిస్తున్నప్పటికీ.. దేశ ఆర్ధిక రాజధాని ముంబై వంటి నగరంలో ప్రజలు నివసించడం అంటే సామాన్యులకు కొంచెం కష్టంగా మారింది. ఈ నగరంలో ఇల్లు కొనడం అన్న ఆలోచన పక్కన పెడితే.. లక్షల జీతం వచ్చే వారి పరిస్థితి కూడా అద్దెకు రూం తీసుకోవాలంటే బాబోయ్ అనే పరిస్థితి దాపురించింది. ముంబై నగరంలో అద్దె ఇళ్లకోసం పడుతున్న కష్టాలను తెలియజేస్తూ ఒక పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో ముంబైలోని సింగింల్ బెడ్ రూమ్ ఫ్లాట్‌ను అద్దెకు తీసుకోవడం సామాన్యుడికి ఎంత కష్టమో ఒక అమ్మాయి తెలియజేసింది.

ముంబైలో సింగిల్ బిహెచ్‌కె ఫ్లాట్‌ను అద్దెకు తీసుకోవాలంటే.. రూ. 50 నుండి 70 వేలు ఖర్చు చేయాల్సి ఉంటుందని.. ఆ యువతి వెల్లడించింది. ఈ రేంజ్ లో అద్దె చెల్లించడం అంటే ఈ ముంబై మహా నగరంలో నివసించడం ఎంత ఖరీదైనదో ఇప్పుడు మీరే ఆలోచించండని వెల్లడించింది. సాధారణ ప్రజల నెలవారీ జీతం కూడా ఒక బిహెచ్‌కె ఫ్లాట్‌ రెంట్ అంత ఉండదు.. మరి అలాంటి సమయంలో సామాన్యులు ఇంత మొత్తంలో అద్దె ఎలా చెల్లిస్తారు అని ప్రశ్నించింది.

ఇవి కూడా చదవండి

వైరల్ పోస్ట్ చూడండి

 

ఈ పోస్ట్‌ను షేర్ చేసిన అమ్మాయి తనను తాను లాయర్ అని పరిచయం చేసుకుంది. ‘ముంబైలో ఒక బిహెచ్‌కె తీసుకోవాలంటే నెలకు రూ. 50-70 వేలు ఖర్చు చేయాల్సిందే.. కనుక నేటి యువత సొంతంగా జీవించాలని అనే ఆలోచనకు గుడ్ బై చెప్పేసి.. హ్యాపీగా తల్లిదండ్రుల సోదరుడితో సన్నిహితంగా .. కలిసి మెలసి ఉండండి అని క్యాప్షన్ జత చేసింది.

@kebabandcoke పేరుతో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌లో షేర్ చేసిన ఈ పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. నెటిజన్లు వివిధ రకాలైన రియాక్షన్‌లు ఇస్తున్నారు. ఒకరు నిజంగా ద్రవ్యోల్బణం చాలా వేగంగా పెరిగిపోతూ.. జీతాన్ని మించిపోతోందని కామెంట్ చేయగా.. మరొకరు అప్పు చేయకుండా ఇల్లు, మంచి వైద్యం, నాణ్యమైన విద్య పొందడం చాలా మందికి అసాధ్యమైన కలలా కనిపిస్తుంది’ అని వ్యాఖ్యానించారు. ఒన్ బీ హెచ్ కే అద్దె 70 వేల రూపాయలా..! EMI లో చెల్లించే సదుపాయం ఉందా అని కామెంట్ చేయగా.. అంధేరిలో 3BHK ఫ్లాట్ కోసం తన స్నేహితుడు లక్ష అద్దె చెల్లిస్తున్నాడని ఇంకొకరు కామెంట్ చేశారు.

 

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..