Viral News: రాత్రి తెల్ల జుట్టుకు రంగు వేసుకుని నిద్ర పోయాడు.. తెల్లారిన తర్వాత విలన్ గా మారిపోయాడు..

|

Aug 09, 2024 | 11:37 AM

తలపై తెల్ల జుట్టు కనిపించడానికి చాలా కారణాలు ఉండవచ్చు. అదే సమయంలో ప్రస్తుతం హెయిర్ డై, హెయిర్ కలర్స్ అందుబాటులో ఉన్నాయి. దీంతో తెల్ల జుట్టుకు సింపుల్ పరిష్కారాలుగా నిలుస్తున్నాయి. అయితే వీటిల్లోని రసాయనాల కారణంగా జుట్టుకు మరింత హాని కలిగిస్తాయి. ప్రస్తుతం అలాంటి ఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది. ఒక వ్యక్తి తెల్ల జుట్టుకు రంగు వేసుకుని అష్టకష్టాలు పాలయ్యాడు.

Viral News: రాత్రి తెల్ల జుట్టుకు రంగు వేసుకుని నిద్ర పోయాడు.. తెల్లారిన తర్వాత విలన్ గా మారిపోయాడు..
Viral News
Follow us on

ముఖ సౌందర్యంలో జుట్టు పెద్ద పాత్ర పోషిస్తుంది. ఇప్పుడు మగవారైనా, ఆడవారైనా అందరూ ఒత్తైన పొడవాటి జుట్టు కోరుకుంటున్నారు. అయితే ప్రస్తుతం వయసుతో సంబంధం లేకుండా జుట్టు నెరవడం సర్వసాధారణమైపోయింది. చాలా మంది యువత ఈ సమస్యతో బాధపడుతున్నారు. తలపై తెల్ల జుట్టు కనిపించడానికి చాలా కారణాలు ఉండవచ్చు. అదే సమయంలో ప్రస్తుతం హెయిర్ డై, హెయిర్ కలర్స్ అందుబాటులో ఉన్నాయి. దీంతో తెల్ల జుట్టుకు సింపుల్ పరిష్కారాలుగా నిలుస్తున్నాయి. అయితే వీటిల్లోని రసాయనాల కారణంగా జుట్టుకు మరింత హాని కలిగిస్తాయి. ప్రస్తుతం అలాంటి ఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది. ఒక వ్యక్తి తెల్ల జుట్టుకు రంగు వేసుకుని అష్టకష్టాలు పాలయ్యాడు.

ఇంగ్లిష్ వెబ్‌సైట్ డైలీ స్టార్‌లో ప్రచురించిన నివేదిక ప్రకారం ఈ ఘటన ఇంగ్లాండ్‌లో చోటు చేసుకుంది. ఓ వ్యక్తి తన తెల్ల వెంట్రుకలను నల్లగా మార్చుకోవడానికి రంగు వేసుకున్నాడు. ఇలా డై వేసుకుంటే జుట్టు నల్లబడుతుంది అనుకున్నాడు. అయితే తలచినది ఒకటి అయితే జరిగింది ఒకటి.. అతని నుదుటిపై వేరే లెవెల్లో సైడ్ ఎఫెక్ట్ బారిన పడింది. ముఖం చూసుకున్న అతను తన ఫేస్ బర్గర్ లా వాచిపోయిందని అనుకున్నాడు. ఏకంగా హాస్పిటల్ లో చేరి చికిత్స తీసుకున్నాడు.

ఆ రంగులో ఏముంది?

ఇవి కూడా చదవండి

డైలీ స్టార్ న్యూస్ వెబ్‌సైట్ నివేదిక ప్రకారం లాంక్షైర్‌లోని బ్లాక్‌బర్న్‌లో నివసిస్తున్న ర్యాన్ బ్రిగ్స్‌ జులై 27న తల్లి వద్దకు వెళ్లినప్పుడు జుట్టుకు రంగు రాసుకుని నిద్రపోయాడు. అయితే రంగు వేసుకున్న తర్వాత తలపై మంటలు రావడం ప్రారంభించింది. మొదట్లో మామూలుగా అనిపించింది.. మర్నాడు ఉదయం లేచి చూసేసరికి ముఖం పూర్తిగా వాచిపోయి ఉండడంతో ఒక్కసారిగా షాక్ అయ్యాడు. అనంతరం ఆస్పత్రికి వెళ్లాడు. అక్కడ అతను ఉపయోగించిన రంగులో పారాఫెనిలెనిడియమైన్ అనే రసాయనం ఉన్నట్లు గుర్తించారు.

ఆసుపత్రికి వెళ్లే ముందు నిద్రలేవగానే వాపు పోతుందని భావించినప్పటికీ.. ఈ రసాయనం కారణంగా రియాక్షన్ బాగా పెరిగి 13 గంటలు ఆసుపత్రిలో గడపాల్సి వచ్చింది. గొంతు నొప్పి నుండి బయటపడటానికి అతనికి 5 రోజుల పాటు ప్రతిరోజూ 25 మాత్రలు తీసుకున్నాడు. చికిత్స తీసుకున్న తర్వాత అతని ముఖం ఇప్పుడు పూర్తిగా నార్మల్ అయిపోయింది. అయితే ఇక జీవితంలో ఎప్ప టికీ రంగు వేసుకొను అంటూ చెబుతున్నాడు ర్యాన్ బ్రిగ్స్‌.

 

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..