భారతదేశంలో సివిల్ సర్వీసెస్ పరీక్ష అత్యంత కఠినమైన పరీక్ష.. అత్యంత పోటీ పరీక్షలలో ఒకటిగా సివిల్స్ పరీక్షను పరిగణిస్తారు. సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించడానికి. అభ్యర్థి కఠినమైన శిక్షణ పొందుతాడు. రాత్రనక పగలననక కృషి, పట్టుదలతో చదువుకుంటాడు. IPS లేదా IAS అధికారి అయిన తర్వాత.. ఆ వ్యక్తి ప్రభుత్వంలో అత్యంత ప్రసిద్ధ అధికారులలో ఒకరిగా పరిగణింపబడతారు. ఐఏస్ , లేదా ఐపీఎస్ అధికారిగా మారడం కోసం ఉన్నత పదవులను, లక్షలు జీతం వచ్చే ఉద్యోగాలను కూడా విడిచి పెట్టి కష్టపడి చదువుకునేవారు ఉన్నారు. అదే విధంగా ఓ మహిళ ఐపీఎస్ అధికారి కావాలని కల గన్నది. తన కలను నెరవేర్చుకోవడానికి కష్టపడింది..ఆ కల నేరవేర్చుకుని ఐపీఎస్ అధికారిగా విధులను నిర్వహించారు. తన నీతి నిజాయితీతో ఎంతో ఖ్యతిగంచారు. అయితే ఐపీఎస్ అధికారిగా వస్తు సంపాదన, పేరు ప్రఖ్యాతలతో తృప్తి చెందకుండా.. ప్రాపంచిక అనుబంధాలను త్యజించి ఆధ్యాత్మికతకు అంకితమై మానసిక ప్రశాంతతను పొందడం కోసం సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఒక మహిళా IPS అధికారి శ్రీకృష్ణుని పట్ల భక్తితో తన జీవితాన్ని భగవంతుడిని సేవకి అంకితం చేయడానికి చేస్తున్న ఐపీఎస్ ఉద్యోగానికి రాజీనామా ఇచ్చేశారు. ఆమె భారతి అరోరా.
భారతీ అరోరా హర్యానా కేడర్‌కు చెందిన మాజీ IPS అధికారి. 1998 బ్యాచ్‌కి చెందిన ఐపీఎస్ భారతి అరోరా హర్యానాలోని అనేక జిల్లాల్లో సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (SP)గా అలాగే కర్నాల్ శ్రేణికి ఇన్‌స్పెక్టర్ జనరల్ (IG) గా పనిచేశారు. ఐపీఎస్ భారతి అరోరా కెరీర్ మొత్తంలో బాంబు పేలుళ్లు , ఇతర ఉన్నత స్థాయి విషయాలతో సహా అనేక ముఖ్యమైన కేసులను పరిశోధించి చేధించారు.
నీతి నిజాయతీ గల పోలీసు అధికారిణిగా పేరున్న భారతి ఎస్పీగా తన ముక్కుసూటి విధానాన్ని ప్రదర్శిస్తూ ఒక ప్రముఖ రాజకీయ నాయకుడిని సైతం ఒకసారి అరెస్టు చేశారు. తన కెరీర్ లో ఎన్నో సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్న చరిత్రను సొంతం చేసుకున్నారు. నేరాల అదుపునకు కఠిన చర్యలు తీసుకోవడానికి భారతి వెనుకాడలేదు. ఆదర్శప్రాయమైన పని కారణంగా ప్రభుత్వం నుంచి అనేక సత్కారాలను సన్మానాలను అందుకున్నారు.
భారతి శ్రీకృష్ణు పట్ల భక్తిని పెంచుకున్నారు. 2004లో బృందావనం సందర్శించిన తర్వాత కృష్ణుడు అంటే విపరీతమైన ప్రేమ కలిగింది. కృష్ణుడి పట్ల ఆమెకు ఎంతగా భక్తి పెరిగిందంటే తనను తాను పూర్తిగా కృష్ణుడికి అంకితం చేయాలని నిర్ణయించుకున్నారు. తన సర్వీస్ ఇంకా పదేళ్ళు ఉండగానే వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు. కృష్ణుడి భక్తురాలైన మీరా బాయి వలెనే తన జీవితాన్ని కృష్ణుడు సేవలో అంకితం చేయాలనీ నిర్ణయించుకున్నారు. కృష్ణుని భక్తిలో తరించాలనే కోరికను వ్యక్తం చేస్తున్నారు భారతి అరోరా.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..