Viral News: అక్కడ మోస్ట్ వాంటెడ్ లిస్ట్‌లో గ్రీన్ మాంబా.. కనిపిస్తే ఆచూకీ ఇవ్వమని నగరం అంతా పోస్టర్లు..

|

Nov 23, 2023 | 11:22 AM

నెదర్లాండ్స్‌లోని టిల్‌బర్గ్ నగరంలో ఒక విషపూరిత పాము స్థానిక మునిసిపాలిటీ సిబ్బందిని, పోలీసులను ఇబ్బంది పెడుతోంది. ఈ పాము చాలా ప్రమాదకరమైనది. దీనిని పట్టుకోవడానికి పోలీసులు ఎక్కడికక్కడ పోస్టర్లు అతికించారు. ది గార్డియన్ నివేదిక ప్రకారం ఇటీవల నగరంలోని ఒక ఇంట్లో గ్రీన్ మాంబా పాముని కనుగొన్నారు. ఇది ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన, విషపూరితమైన పాములలో ఒకటిగా పరిగణించబడుతుంది.

Viral News: అక్కడ మోస్ట్ వాంటెడ్ లిస్ట్‌లో గ్రీన్ మాంబా.. కనిపిస్తే ఆచూకీ ఇవ్వమని నగరం అంతా పోస్టర్లు..
Green Mamba
Follow us on

ప్రపంచ వ్యాప్తంగా వివిధ రకాల నేరాలు జరుగుతూనే ఉంటాయి. ఇలాంటి నేరాలకు పాల్పడిన నేరస్థులను కూడా పోలీసులు పట్టుకుంటారు. కొన్నిసార్లు కొంతమంది నేరస్థులు పోలీసులకు పట్టుబడకుండా  తప్పించుకుంటారు. అంతేకాదు పెద్ద పెద్ద నేరాలు చేసిన నేరస్థులను పోలీసులు పట్టుబడకుండా తప్పించుకుంటూ ఉంటే వారిని పట్టుకోవడానికి పోలీసులు  రాత్రి పగలు అనే తేడా లేకుండా కష్టపడతారు. ఒకొక్కసారి ఆ నేరస్థుడి చిత్రంతో కూడిన పోస్టర్లు ప్రధాన ప్రాంతాల్లో అతికిస్తారు. తద్వారా సాధారణ ప్రజలు కూడా ఆ నేరస్థుడిని పట్టుకోవడంలో సహాయపడతారు అని భావిస్తారు. అయితే పామును పట్టుకోవడానికి పోలీసులు చాలా చోట్ల పోస్టర్లు అతికించిన ఘటన గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? అవును ఇది చాలా విచిత్రమైన విషయం.. అయితే ఇది పూర్తిగా నిజం. ఈ వింత ఘటన నెదర్లాండ్స్‌లో చోటు చేసుకుంది. ప్రస్తుతం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

వాస్తవానికి నెదర్లాండ్స్‌లోని టిల్‌బర్గ్ నగరంలో ఒక విషపూరిత పాము స్థానిక మునిసిపాలిటీ సిబ్బందిని, పోలీసులను ఇబ్బంది పెడుతోంది. ఈ పాము చాలా ప్రమాదకరమైనది. దీనిని పట్టుకోవడానికి పోలీసులు ఎక్కడికక్కడ పోస్టర్లు అతికించారు. ది గార్డియన్ నివేదిక ప్రకారం ఇటీవల నగరంలోని ఒక ఇంట్లో గ్రీన్ మాంబా పాముని కనుగొన్నారు. ఇది ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన, విషపూరితమైన పాములలో ఒకటిగా పరిగణించబడుతుంది. అయితే ఈ గ్రీన్ మాంబా పాము పట్టుకోలేకపోయారు. ఆ ఇంట్లోంచి ఎలా పారిపోయిందో ఎవరికీ కనిపించకుండా పారిపోయింది. ఈ గ్రీన్ మాంబా వలన ఎవరికైనా ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని పోలీసులు, మున్సిపల్ ఉద్యోగులు ఆందోళన చెందారు. దీంతో పోలీసులు పరిష్కారం ఆలోచించారు.

‘వాంటెడ్’ లిస్ట్ లో గ్రీన్ మాంబా

పోలీసులు గ్రీన్ మాంబాను మోస్ట్ ‘వాంటెడ్ పోస్టర్’ను విడుదల చేసింది. ఆ పోస్టర్లను నగరం అంతటా అతికించారు. ఈ గ్రీన్ మాంబా పామును ఎవరైనా చూసినట్లయితే..  దానిని పట్టుకోవడానికి ఒంటరిగా ప్రయత్నించకండి.. అది చాలా విషపూరితమైనది. కనుక దీని దగ్గరకు కూడా వెళ్లవద్దని పోలీసులు హెచ్చరించారు. అయితే ఈ గ్రీన్ మాంబా ఎవరికంట పడినా వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని, తద్వారా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడవచ్చని పోలీసులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

పాము కోసం వెతుకుతున్న స్నిఫర్ డాగ్స్

నివేదికల ప్రకారం గ్రాన్ మాంబాను పట్టుకోవడానికి స్నిఫర్ డాగ్‌లను కూడా నియమించారు. అంతే కాదు దీని వలన ప్రమాదం దృష్ట్యా ఆ ప్రాంతంలో వైద్య సిబ్బందిని నియమించారు. ఈ పాము ఎవరినైనా కాటేస్తే, వెంటనే చికిత్స అందించవచ్చు. ఎందుకంటే సకాలంలో చికిత్స అందించకపోతే ఆ వ్యక్తి చనిపోయే అవకాశం ఉంది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..