Viral News: అఖండ భారత దేశాన్ని బ్రిటిష్ పాలకులు భారతదేశం, పాకిస్దాన్ గా విడగొట్టి స్వాతంత్య్రం ఇచ్చారు. అప్పటి నుంచి ఈ రెండు దేశాల్లో నివసించే ప్రజలు భిన్నాభిప్రాయాలను కలిగి ఉంటారు. కోపం, ద్వేషం, ప్రేమ, మానవత్వం ఇవన్నీ సమ్మిళితంతో నివసిస్తుంటారు. ఈ రెండు దేశాల గురించిన భావోద్వేగాలు ప్రజల్లో భిన్నంగా ఉంటాయి. ఈ రోజు రెండు దేశాలకు చెందిన ఇద్దరు అమ్మాయిల జీవితానికి సంబంధించిన కథ గురించి తెలుసుకుందాం. నిజానికి భారత్, పాక్ దేశాల మధ్య రాజకీయ సంబంధాలు అంత బాగా లేవు. ఇంత జరిగినా ఇరుదేశాలకు చెందిన ఇద్దరు అమ్మాలు ప్రేమలో పడ్డారు. ఒకరి ప్రేమలో ఒకరు మునిగి తేలి.. పెళ్లి పీటలు ఎక్కారు.
భారత్‌కు చెందిన బియాంకా మిలీ, పాకిస్థాన్‌కు చెందిన సైమా అహ్మదీల ప్రేమకథ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బియాంకా, సైమా 2019లో అమెరికాలో పెళ్లి చేసుకున్నారు. దేశమే కాదు ఇద్దరి అమ్మాయిల మతాలు కూడా వేర్వేరు. భారత అమ్మాయి బియాంకా క్రిస్టియన్, పాకిస్థాన్ అమ్మాయి సైమా ముస్లిం.
ఐదేళ్లు డేటింగ్:
నిజనికి ఈ ప్రేమ పెళ్లి 2014 సంవత్సరం నుంచి 2019 మధ్యలో జరిగింది. అమెరికా వేదికగా ఇద్దరమ్మాయిలు ఘనంగా పెళ్లి చేసుకున్నారు. బియాంకా సైమాల పరిచయం అమెరికా వేదికగా 2014 సంవత్సరం లో జరిగింది. ఒకరినొకరు ఇష్టపడడంతో.. వీరిద్దరూ 2014 లో డేటింగ్ ప్రారంభించారు. ఐదేళ్లపాటు ఒకరితో ఒకరు డేటింగ్ చేసి.. తర్వాత 2019లో కాలిఫోర్నియాలో పెళ్లి చేసుకున్నారు. బియాంకా, సైమా వివాహం చేసుకున్నప్పుడు.. వీరి గురించి పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇద్దరి డ్రెస్సింగ్ పై ప్రశంసల వర్షం కురిసింది. బియాంకా లేత గోధుమ రంగులో భారీ ఎంబ్రాయిడరీ చేసిన చీర కట్టుకుని.. ముస్లిం వధువు మాదిరి నగలు ధరించి అందంగా రెడీ అయింది. సైమా నలుపు రంగు షేర్వాణీ ధరించింది. పెళ్లి వేడుక వాయిద్యాలతో అంగరంగ వైభంగా జరిగింది. ఇరువురి కుటుంబీకుల అంగీకారంతో ఈ వివాహం జరిగింది. అమ్మాయిల తల్లిదండ్రులు ఒకరినొకరు కలుసుకుని ఈ పెళ్లిని అత్యంత ఘనంగా జరిపించారు. బియాంకా, సైమా ఒకరికొకరు ఉంగరాలు ధరించి, జీవితాంతం కలిసి ఉంటామని ప్రకటించారు. గత కొన్ని రోజులుగా మళ్ళీ లెబ్సియన్ ప్రేమ, పెళ్లి పై వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం వీరి పెళ్లి ఫోటోలు మళ్ళీ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..