Viral News: సలామ్ రైతన్న.. చేతులు వాడకుండానే పేడను ఎత్తాడు.. ఏం టెక్నాలజీ గురూ..!
Viral News: ట్యాలెంట్ ఏ ఒక్కరి సొత్తు కాదని అంటుంటారు. నిజమే బుర్రకు కాస్త పని చెప్పాలే గానీ.. అద్భుత ఆవిష్కరణలకు
Viral News: ట్యాలెంట్ ఏ ఒక్కరి సొత్తు కాదని అంటుంటారు. నిజమే బుర్రకు కాస్త పని చెప్పాలే గానీ.. అద్భుత ఆవిష్కరణలకు కొదవే ఉండదు. చదువుకకున్న జ్ఞాని అయినా.. చదువుకోని ఆలోచనా పరులైనా.. సంచలనాలు ఆవిష్కృతం అవడం ఖాయం అని చెప్పాలి. కొన్నేళ్లుగా వ్యవసాయరంగంలో అనేక ఆవిష్కరణలు వచ్చాయి. పంటల సాగుకు సంబంధించి అనేక సాంకేతిక పరికరాలు అందుబాటులోకి వచ్చాయి. వాటిని వినియోగించి రైతులు తక్కువ సమయంలోనే ఎక్కువ పంటలను సాగు చేస్తూ అధిక దిగుబడిని సాధిస్తున్నారు. అయితే, వ్యవసాయ రంగంలో ఆవిష్కరణల పరంపరం కొనసాగుతూనే ఉంది. పెద్ద పెద్ద టెక్ కంపెనీలు కాదే.. సామాన్య రైతులు, గ్రామీణ ప్రాంతాల ప్రజలు సైతం తమదైన శైలిలో వినూత్న పరికరాలను తయారు చేస్తున్నారు. తాజాగా అలాంటి వీడియోనే ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. వినూత్న రీతిలో రూపొందించిన ఆ పరికరాన్ని చూసి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. దానిని రూపొందించిన రైతులకు సలాం కొడుతున్నారు.
ఇంతకీ ఆ రైతు ఏం చేశాడు.. అంతలా ఆకట్టుకునే పరికరం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. సాధారణంగా రైతులు ఆవుల పేడను చేతులతో తీస్తారు. అలా చేత్తో తీసి ఒక చోట వేస్తారు. కానీ, ఇక్కడ ఓ రైతు మాత్రం చాలా విభిన్నంగా ఆలోచించాడు. చేతికి ఏమాత్రం అంటకుండా.. సరికొత్త పరికరాన్ని కనుగొన్నాడు. దాని సాయంతో పేడను ఎత్తి మరో చోట వేశాడు. రైతు తయారు చేసిన ఆ పరికరంతో ఆవు పేడ తీస్తుండగా మరొకరు వీడియో తీశారు. అనంతరం దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అదికాస్తా వైరల్‌గా మారింది. వాకర్‌లా ఉన్న ఆ పరికరం విచిత్రంగా పని చేస్తుండటం అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ పరికరానికి సంబంధించిన వీడియోను ఇన్‌స్టాగ్రమ్ అకౌంట్ లైఫ్ హ్యాక్ అనే అకౌంట్‌లో షేర్ చేయగా.. అది కాస్తా నెట్టింట్లో రచ్చ చేస్తోంది. ఆ వీడియోను చూసిన నెటిజన్లు ‘ఔరా’ అంటూ ఆశ్చర్యపోతున్నారు. దానిని రూపొందించి రైతన్నకు సెల్యూట్ చేస్తున్నారు. ఆవిష్కరణలకు పెద్ద పెద్ద చదువులే అవసరం లేదు.. కొంచె బుర్ర పెడితే సరిపోతుందని ఈ రైతు నిరూపించాడంటూ కొనియాడుతున్నారు నెటిజన్లు. మరెందుకు ఆలస్యం.. ఈ అద్భుత ఆవిష్కరణను మీరూ చూసేయండి.
Viral Video:
View this post on Instagram
Also read:
Delhi News: ఢిల్లీలో ఘోర ప్రమాదం.. ఆటోరిక్షాపై బోల్తాపడిన కంటైనర్.. నలుగురు మృతి, పరారీలో డ్రైవర్
MLA RK Roja Comments: రాజధాని రైతుల సభపై ఎమ్మెల్యే ఆర్కే రోజా సంచలన వ్యాఖ్యలు