Viral News: హనీమూన్‌‌లో ఊహించని ట్విస్ట్.. భర్త చేసిన పనికి భార్య ఫ్యూజులు ఔట్!

పెళ్ళైన జంటలు హనీమూన్ వెకేషన్ అంటూ ఫారిన్ కంట్రీలకు వెళ్లడం ఆనవాయితీగా మారింది. విదేశాల్లో అయితే ఇది సర్వసాధారణం...

Viral News: హనీమూన్‌‌లో ఊహించని ట్విస్ట్.. భర్త చేసిన పనికి భార్య ఫ్యూజులు ఔట్!
Marriage
Follow us
Ravi Kiran

|

Updated on: Dec 18, 2021 | 4:59 PM

ఒకప్పుడు ఇండియాలో పెళ్లిళ్ల తర్వాత హనీమూన్ ట్రిప్స్ అనే పద్దతి లేదు. కానీ ఇప్పుడు గ్రామాల నుంచి నగరాల వరకు పెళ్ళైన జంటలు హనీమూన్ వెకేషన్ అంటూ ఫారిన్ కంట్రీలకు వెళ్లడం ఆనవాయితీగా మారింది. విదేశాల్లో అయితే ఇది సర్వసాధారణం. నిజానికి ఈ హనీమూన్‌లో కొత్త జంట ఏకాంతంగా ఉండటమే కాదు.. ఒకరినొకరు అర్ధం చేసుకోవడం కూడా జరుగుతుంది. అసలు ఎందుకు ఇదంతా చెబుతున్నానని అనుకుంటున్నారా.! ఇక్కడొక వ్యక్తి తన భార్యతో కలిసి హనీమూన్ ట్రిప్ ప్లాన్ చేశాడు. కానీ అందులోనూ ఓ చిన్న ట్విస్ట్ ఉండండి. అది విన్నాక ఆ భార్యకు ఫ్యూజులు ఔట్ అయ్యాయి. అసలు ఆ కథేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

తన పెళ్లికి ఇంకా 7 నెలలు సమయం ఉండనగా.. ఓ వ్యక్తి తనకు కాబోయే భార్యతో హనీమూన్‌కు ఎక్కడికి వెళ్లాలో ఆలోచించడం మొదలుపెట్టాడు. వారిద్దరూ పలుసార్లు తర్జనభర్జనలు పడ్డ తర్వాత ఓ మంచి ప్రదేశాన్ని తమ హనీమూన్ స్పాట్‌గా ఎంచుకున్నారు. పెళ్లి కాగానే అక్కడికి వెళ్లాలని నిర్ణయించారు. ఇంతవరకు బాగానే ఉంది. ఇక ఆ తర్వాతే కథలో అసలు ట్విస్ట్ వచ్చింది. ఆ వ్యక్తి తమ హనీమూన్ ట్రిప్ గురించి తన స్నేహితులతో పంచుకున్నాడు.

ఇక వాళ్లు కూడా ఎప్పటినుంచో ఆ చోటుకు వెళ్లాలని ప్లాన్ చేస్తున్నట్లుగా చెప్పుకొచ్చారు. అయితే అక్కడికి వెళ్లేందుకు వారికి సరైన ఛాన్స్ దొరకలేదట. ‘ఇప్పుడు నీతో కలిసి వెళ్తే మనం బాగా ఎంజాయ్ చేయొచ్చు’ అంటూ ఆ స్నేహితులు అతడికి చెప్పగా.. స్నేహితుల కోరికను కాదనలేకపోయిన ఆ వ్యక్తి.. ఈ విషయాన్ని తనకు కాబోయే భార్యకు చెప్పాడు. అంతే ఇంకేముంది.. ఆమె ఆగ్రహించడమే కాకుండా.. అతన్ని ‘ఇడియట్’ అంటూ సంబోధించింది. ఆ ఐడియా వచ్చినందుకు అతడ్ని తిట్టిపోసింది. అయినా కూడా ఆ వ్యక్తి ఆమెను ఒప్పించడానికి ఎంతగానో ప్రయత్నించాడు. కానీ చివరికి కుదరలేదు. కాగా, ఈ సంఘటనను రెడ్డిట్ ద్వారా సదరు వ్యక్తి నెటిజన్లకు పంచుకోగా.. వారంతా అతడ్ని ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. అతడి పోస్ట్‌పై ఫన్నీ, వ్యంగమైన కామెంట్స్‌తో హోరెత్తించారు.

Also Read: గుడ్డులోని పసుపు భాగాన్ని ఎంతమంది తినరు.? ఈ విషయాలు తెలిస్తే షాకవుతారు.!