ఇటీవల కాలంలో, డబ్బును బ్యాంకుల్లో ఉంచే బదులు ఆస్తిలో పెట్టుబడి పెట్టడం మంచిది. ఎందుకంటే భూములపై పెట్టిన పెట్టుబడి బ్యాంకులు ఎప్పుడూ ఇచ్చే దానికంటే తక్కువ సమయంలో ఎక్కువ రాబడిని ఇస్తుంది. చాలా చోట్ల ఆస్తి రేట్లు కేవలం 2-3 సంవత్సరాలలో నాలుగు-ఐదు రెట్లు పెరుగుతాయి. అయితే భూములు మిగలని చోట్ల చాలా ఉన్నాయి. ప్రతిచోటా ఇళ్లు, దుకాణాలు, మాల్స్ మొదలైనవి నిర్మించబడ్డాయి. అలాంటి చోట్ల భూములు, ఇళ్ల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. కేవలం ఒక గది లేదా రెండు గదుల ఫ్లాట్ ధర కోట్లలో ఉంటుంది, అయితే కొన్ని ప్రాంతంలో టాయిలెట్ ధర కోట్లలో ఉంటే ఎలా ఉంటుంది? అవును ప్రస్తుతం అలాంటి ఒక స్థలం గురించి ఎక్కువగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అక్కడ ఒక పబ్లిక్ టాయిలెట్ రూ. 2 కోట్లకు అమ్ముడవుతోంది.
ఆసక్తికరమైన విషయమేమిటంటే.. ఎవరైనా ఈ టాయిలెట్ కొనుగోలు చేస్తే.. దాని ధర తక్కువ సమయంలోనే నాలుగైదు రెట్లు పెరుగుతుంది. దీంతో టాయిలెట్ ను కొనుగోలు చేసేందుకు కొనుగోలు దారులు బారులు తీరుతున్నారు. మరుగుదొడ్డికి కోట్లు ఎందుకు ఖర్చవుతుంది, దాని ప్రత్యేకత ఏమిటి? ఈ స్థలం ఎక్కడ ఉంది అని ఆశ్చర్యపోతున్నారా.. ఆ సంగతి తెలుసుకుందాం.. వాస్తవానికి, ఈ టాయిలెట్ బ్రిటన్‌లోని కార్న్‌వాల్ ప్రాంతంలోని సాల్టాష్ టౌన్‌లో ఉంది. ఇది నాగరిక ప్రాంతంగా పరిగణించబడుతుంది. ఈ ప్రాంతం సముద్ర తీరంలో .. చాలా అందంగా ఉంటుంది. అందుకే ఇక్కడ ప్రాపర్టీ ధరలు చాలా ఎక్కువగా ఉంటాయి.
ఆస్తుల ధరలు ఎందుకు పెరిగాయి?
డైలీ మెయిల్ నివేదిక ప్రకారం.. సాల్టాష్ టౌన్‌లో నిర్మాణ పనులను ప్రభుత్వం గతంలో నిషేధించింది. అయితే ఇప్పుడు ఈ నిషేధాన్ని ఎత్తివేశారు. అందుకే ఇక్కడ ప్రాపర్టీ ధరలు ఆకాశాన్నంటాయి. ఇక్కడ సౌకర్యాన్ని బట్టి నాలుగు గదుల ఇల్లు కట్టుకోవచ్చని, దీని ఖరీదు దాదాపు రూ.10 కోట్లు ఉంటుందని ప్రభుత్వం చెబుతోంది. ఇప్పుడు రూ.2కోట్లకు అమ్ముతున్న మరుగుదొడ్డిలో కూడా ఎవరికైనా కావాలంటే నాలుగు పడక గదుల ఇల్లు కట్టుకుని ఇల్లు కట్టిన వెంటనే దాని ధర ఐదు రెట్లు పెరుగుతుంది.
నివేదికల ప్రకారం ఈ టాయిలెట్ అటువంటి ప్రదేశంలో ఉంది. ఇక్కడ నుండి దుకాణాలు లేదా ఇతర సౌకర్యాలు తక్కువ దూరంలో ఉన్నాయి. ఇక్కడ మూడు అంతస్తుల వరకు ఇల్లు నిర్మించుకోవచ్చు అని ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇక్కడ రెండు కార్లు పార్కింగ్ కూడా ఉంది. చాలా ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇక్కడ చుట్టూ పచ్చదనం ఉంటుంది.
మరిన్నిట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..