Inspirational Story: లక్ష్మణ్ మనసు దోచుకున్న దోశ స్టాల్ యువతి.. నర్తకి కాబోయి కాలు కోల్పోయిన వీణ స్ఫూర్తిదాయక స్టోరీ

|

May 24, 2024 | 5:57 PM

పని చేయాలనే తపన, జీవితంలో ఏదైనా సాధించాలనే కోరిక మాత్రమే. అలా ఓ యువతి ప్రస్తుతం వార్తల్లో నిలిచింది. చిన్న హోటల్ వ్యాపారంలోకి అడుగుపెట్టిన ఓ యువతి. విజయవంతంగా తన జీవితాన్ని తాను మలచుకుంది. ఒక కాలు లేకుండా పని చేస్తూ చలాకీగా ఉత్సాహంగా జీవితాన్ని గడుపుతున్న ఈ యువతి నిజంగా స్ఫూర్తిదాయకమని క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ తన ఎక్స్ ఖాతాలో ఆమె కథనాన్ని షేర్ చేశారు.

Inspirational Story: లక్ష్మణ్ మనసు దోచుకున్న దోశ స్టాల్ యువతి.. నర్తకి కాబోయి కాలు కోల్పోయిన వీణ స్ఫూర్తిదాయక స్టోరీ
Truly Inspirational Person
Follow us on

మనిషికి జీవితంలో ఏదైనా సాధించాలనే తపన, కృషి, పట్టుదల ఉంటే ఎలాంటి కష్టాన్నైనా ఎదుర్కోవచ్చు. అదే విధంగా అంగవైకల్యం శారీరకంగానే కాని మానసికంగా కాదు అంటూ తనని తాను నిరుపించుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేసి సక్సెస్ అందుకున్నవారు ఎందరో ఉన్నారు మన సమాజంలో. కాళ్లు లేకపోతె చేతులనే కాళ్లు చేసుకునే వ్యక్తులున్నారు.. చేతులు లేకపోతే కాళ్లనే చేతులుగా మలచుకుని సక్సెస్ అందుకున్నవారు కూడా ఎందరో ఉన్నారు. దీనికి కారణం పని చేయాలనే తపన, జీవితంలో ఏదైనా సాధించాలనే కోరిక మాత్రమే. అలా ఓ యువతి ప్రస్తుతం వార్తల్లో నిలిచింది. చిన్న హోటల్ వ్యాపారంలోకి అడుగుపెట్టిన ఓ యువతి. విజయవంతంగా తన జీవితాన్ని తాను మలచుకుంది. ఒక కాలు లేకుండా పని చేస్తూ చలాకీగా ఉత్సాహంగా జీవితాన్ని గడుపుతున్న ఈ యువతి నిజంగా స్ఫూర్తిదాయకమని క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ తన ఎక్స్ ఖాతాలో ఆమె కథనాన్ని షేర్ చేశారు.

బెంగుళూరులో “కరి దోస” స్టాల్‌ను కలిగి ఉన్న వీణా అంబరీష్ అనే యువతి స్ఫూర్తిదాయకమైన కథ ఇది. భరతనాట్య కళాకారిణి అయిన వీణ 17 ఏళ్ల వయసులో బస్సు ప్రమాదంలో తన కుడి కాలును కోల్పోయింది. ఈ ఘోర ప్రమాదం జరిగిన షాక్‌లో ఉన్న వీణ ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది. తర్వాత వీణ అంగవైకల్యం శరీరానికే తప్ప మనసుకు కాదని బతకాలని నిర్ణయించుకుంది. చదువు మీద దృష్టి పెట్టి ఎంబీఏ పట్టా తీసుకుంది. ఐటీ కంపెనీలో ఉద్యోగం సంపాదించింది.

ఇవి కూడా చదవండి

17 ఏళ్ల వయసులో వీణా అంబరీష్ బెంగళూరులో జరిగిన ప్రమాదంలో కాలు కోల్పోయింది. అప్పుడు వీణ అరంగ్రేటం కోసం సిద్ధమవుతున్న భరతనాట్యం నర్తకి. ఆమె జీవితంపై ఈ ప్రమాదం చాలా తీవ్రంగా దెబ్బతీసింది. అయితే MBA పూర్తి చేసి కొన్ని సంవత్సరాలు పనిచేసింది.

 

అయితే ఎక్కువ సేపు కూర్చొని పని చేయలేక ఐటీ ఉద్యోగం వదిలేయాల్సి వచ్చింది. అయితే లైఫ్‌ని లీడ్ చేయడానికి ఏం చేయాలో ఆలోచించిన వీణ తనకు వండడం అంటే చాలా ఇష్టమని, అందులోనూ ఏదైనా సాధించగలనని 2023లో బెంగుళూరులో “కరి దోస” పేరుతో ఓ దోసె స్టాల్‌ను ప్రారంభించింది వీణ. ఇప్పుడు ఆమె తన వ్యాపారాన్ని విజయవంతంగా నడుపుతోంది.

VVS లక్ష్మణ్ (@VVSLaxman281) తన X ఖాతాలో వీణా అంబరీష్ గురించి ఈ స్పూర్తిదాయక కథనాన్ని పంచుకున్నారు. “జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా ధైర్యంగా నిలబడే వీణ మనందరికీ స్ఫూర్తిదాయకం” అని శీర్షిక పెట్టారు. మే 21న షేర్ చేసిన ఈ పోస్ట్‌కి 1 లక్షకు పైగా వీక్షణలు వచ్చాయి. దైర్యవంతమైన ఈ యువతి నిజంగా మనందరికీ స్ఫూర్తి అని నెటిజన్లు వీణాపై ప్రశంసల వర్షం కురిపించారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..