Viral News: 30 ఏళ్ల స్త్రీ తనకు తానే అంత్యక్రియ వేడుక నిర్వహించుకుంది.. ఎందుకో తెలిస్తే కన్నీరు ఆగదు..

ఇటీవల చైనాలోని జెజియాంగ్ ప్రావిన్స్‌లో 30 ఏళ్ల మహిళ బతికి ఉండగానే తన అంత్యక్రియలు తానే నిర్వహించుకుంది. ఈ ప్రత్యేకమైన తుది వీడ్కోలు కార్యక్రమానికి చాలా మంది హాజరయ్యారు. ఆ మహిళ గురించి తమ అభిప్రాయాన్ని తెలియజేస్తూ కొన్ని మాటలు కూడా చెప్పారు. ఆ స్త్రీ ఇలాంటి పని ఎందుకు చేసిందో తెలిస్తే షాక్ తింటారు. అయ్యో ఇదేగా జీవితం అని అంటారు.

Viral News: 30 ఏళ్ల స్త్రీ తనకు తానే అంత్యక్రియ వేడుక నిర్వహించుకుంది.. ఎందుకో తెలిస్తే కన్నీరు ఆగదు..
Viral News

Updated on: Apr 10, 2025 | 9:01 PM

ఇటీవల చైనాలో ఒక వింత సంఘటన జరిగింది. దాని గురించి వింటే మీరు కూడా ఆలోచిస్తారు. 30 ఏళ్ల మహిళ బతికి ఉండగానే తనకి తాను అంత్యక్రియలు చేసుకుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ప్రజలు ఈ వీడ్కోలు కార్యక్రమానికి వచ్చి ఆ స్త్రీని ఆశీర్వదించారు. ఈ మహిళ ఇలాంటి పని ఎందుకు చేసిందో తెలిస్తే కన్నీరు పెడతారు. అయ్యో అని అంటారు.

సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్‌లో ప్రచురితమైన ఒక నివేదిక ప్రకారం ఈ కేసు చైనాలోని జెజియాంగ్ ప్రావిన్స్‌లో చోటు చేసుకుంది. అక్కడ నివసిస్తున్న జియాంగ్ యి అనే మహిళకు మూడు నెలల క్రితం గర్భాశయ క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఆమె బతకడానికి ఇంకా రెండేళ్లు మాత్రమే మిగిలి ఉందని వైద్యులు చెప్పారు. ఇది విన్న తర్వాత ఆ స్త్రీ చాలా బాధపడింది. అయితే ఆశను వదులుకోలేదు. దీని తరువాత.. తన జీవితాన్ని ముందుకు కొనసాగిస్తోంది. తాను బతికి ఉండగానే ప్రపంచానికి, స్నేహితులకు వీడ్కోలు చెప్పడానికి తన సొంత అంత్యక్రియలను నిర్వహించుకుంది.

భర్త, బిడ్డకి తల్లి అయిన జియాంగ్ తన అంత్యక్రియల కోసం తన చిత్రపటాన్ని చిత్రించుకుంది. దానిని తనకు అత్యంత ప్రియమైన జ్ఞాపకంగా రూపొందించుకుంది. ఒక పోస్టర్ కూడా తయారు చేయించుకుని.. దానిపై – నమస్తే! నేను దురదృష్టవంతురాలీని కాకపోతే… నేను రాబోయే రెండేళ్లలో దేవదూతను అవుతాను.. మీ ఆశీస్సులు నాకు తప్పకుండా ఇస్తారని ఆశిస్తున్నానని కాప్షన్ కూడా రాసింది.

ఇవి కూడా చదవండి

జియాంగ్ అంత్యక్రియలకు చాలా మంది హాజరై తమ ఆశీస్సులు, మద్దతును అందించారు. ఒక వ్యక్తి ఇలా అన్నాడు, “నీ భవిష్యత్తులో ప్రతి రోజు బంగారు సూర్యకాంతిలా ఉండాలని నేను ఆశిస్తున్నానని చెప్పగా.. మరొక స్త్రీ జియాంగ్‌ను కౌగిలించుకుని ఇది కనిపించేంత భయంకరమైనది వ్యాధి కాదు” అని ఓదార్చింది. నేను కూడా తీవ్ర అనారోగ్యంతో ఉన్నాడు.. ఇప్పుడు దాన్ని అధిగమించాను. మీరు కూడా అలాగే చేస్తారని నాకు ఖచ్చితంగా తెలుసని పేర్కొంది.

ఆ మహిళ తన ఇంట్లో ఈ తుది వీడ్కోలు వేడుకను నిర్వహించింది. ఈ కార్యక్రమానికి హాజరైన ప్రజలు భావోద్వేగ స్లయిడ్ షోను ప్రదర్శించారు. అందులో జియాంగ్ జీవితం, కెరీర్ , బాల్యంలోని విలువైన జ్ఞాపకాల కథనం ఉంది.

ఈ సమయంలో జియాంగ్ తన కొడుకు ఎదగడం చూడాలని తన కోరికను వ్యక్తం చేసింది, అది విని అక్కడ ఉన్న ప్రతి ఒక్కరి కళ్ళు చెమ్మగిల్లాయి. ఆమె నేను మరణానికి భయపడనని పేర్కొంది. మన జీవితంలోని ప్రతి క్షణాన్ని సంపూర్ణంగా జీవించాలని జియాంగ్ కథ మనకు బోధిస్తుంది. మనం ఎంత కష్ట సమయాల్లో ఉన్నా సరే. మనం ఆశావాద దృక్పథంతో ఉండాలి, ఎప్పుడూ వదులుకోకూడదు.

 

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..