‘ఆర్టీసీ బస్సులో ప్రయాణం.. సురక్షితం.. సుఖవంతం‘.. ఏ రాష్ట్రంలోని ఆర్టీసీ అయినా ఇదే స్లోగన్‌తో ముందకు వెళ్తుంది. కాగా ప్రైవేట్ ట్రావెల్స్‌తో పోల్చుకుంటే ఆర్జీసీ ఛార్జీలు చాలా తక్కువ. అందుకే సామాన్య ప్రుజలు తమ ప్రయాణాలకు ఆర్టీసీ ఎంచుకుంటారు. అయితే లగేజీ పరిమితి దాటితే.. ఎక్స్‌ట్రా ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఓ బుల్లి కోడిపిల్లకు హాఫ్ టికెట్ తీసుకున్న విచిత్ర ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. ఓ సంచార కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు.. రూ.10 చెల్లించి కోడి పిల్లను కొనుగోలు చేశారు. దాన్ని తీసుకుని హోసనగర వద్ద కేయస్ఆర్టీసీ బస్సు ఎక్కారు. అయితే ఊహించని విధంగా కోడిపిల్లకు కూడా టికెట్ తీసుకోవాలని కండక్టర్ డిమాండ్ చేశాడు. అది రూల్ అని.. పక్కా టికెట్ తీసుకోవాల్సిందే అని పేర్కొన్నాడు. దీంతో చేసేదేం లేక ఆ కుటుంబం ఆ కోడి పిల్ల కోసం హాఫ్ టికెట్ తీసుకున్నారు. ఇలా రూ.10తో కొనుగోలు చేసిన కోడి పిల్లను తీసుకెళ్లేందుకు.. ఆ కుటుంబం రూ.50 చెల్లించి టికెట్ తీసుకోవాల్సి వచ్చింది.
Also Read: ఆమ్లెట్ వేసేందుకు గుడ్డు పగలగొట్టగానే బయటకు వచ్చిన అతిథి.. అందరూ షాక్
లైవ్‌లో కన్నీళ్లు పెట్టిన దీప్తి.. హృదయం ముక్కలైన ఎమోజీలు పెట్టిన షణ్ముక్