AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: అల్ట్రాసౌండ్ స్కానింగ్‌లో పుట్టబోయే బిడ్డను చూడాలనుకుంది.. కట్ చేస్తే.. దెబ్బకు మైండ్ బ్లాంక్!

అమ్మతనం.. మహిళలకు జీవితంలో అత్యంత సంతోషాన్ని ఇస్తుందీ దశ. ఇక అమ్మలు కాబోతున్న మహిళలు.. తమకు పుట్టబోయే బిడ్డలు అలా ఉండాలి.. ఇలా ఉండాలని ఊహిస్తుంటారు. ఈ కోవలోనే అమ్మ కాబోతున్న ఓ మహిళ..

Viral: అల్ట్రాసౌండ్ స్కానింగ్‌లో పుట్టబోయే బిడ్డను చూడాలనుకుంది.. కట్ చేస్తే.. దెబ్బకు మైండ్ బ్లాంక్!
Viral
Ravi Kiran
|

Updated on: May 08, 2023 | 6:15 PM

Share

అమ్మతనం.. మహిళలకు జీవితంలో అత్యంత సంతోషాన్ని ఇస్తుందీ దశ. ఇక అమ్మలు కాబోతున్న మహిళలు.. తమకు పుట్టబోయే బిడ్డలు అలా ఉండాలి.. ఇలా ఉండాలని ఊహిస్తుంటారు. ఈ కోవలోనే అమ్మ కాబోతున్న ఓ మహిళ.. తనకు పుట్టబోయే బిడ్డ ఎలా ఉండాలో చూడాలని స్థానిక ఆస్పత్రికి వెళ్తుంది. అల్ట్రాసౌండ్ స్కాన్ ద్వారా తన బిడ్డ ముఖాన్ని చూసి సంతోషించాలని అనుకుంది. కానీ స్కాన్‌లో వచ్చిన ఇమేజ్ చూడగానే ఆమె నవ్వు మాయమైంది. ఇంతకీ అసలేం జరిగిందో.? ఆ స్టోరీ ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా..

వివరాల్లోకి వెళ్తే.. స్కాట్లాండ్‌లోని డన్‌ఫెర్మ్‌లైన్‌కు చెందిన 25 ఏళ్ల తస్మిన్ స్టెన్‌హౌస్ ఐదు నెలల గర్భవతిగా ఉన్నప్పుడు పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి వెళ్లగా.. అల్ట్రాసౌండ్ స్కాన్ ద్వారా తనకు పుట్టబోయే బిడ్డ ఎలా ఉందో చూడాలని అనుకుంది. ఆనందంగా ఆ స్కాన్ చేయించుకుంది. ఇక ఆ స్కాన్‌కు సంబంధించిన బ్లాక్ అండ్ వైట్ ఇమేజ్‌ను స్క్రీన్‌పై చూడగానే దెబ్బకు షాక్ అయింది. ఆ ఫోటోలో శిశువు తల పుర్రెను పోలి ఉండటాన్ని చూసి సదరు మహిళకు మైండ్ బ్లాంకయింది. ఆ తర్వాత తనకు జరిగిన ఈ అనుభవాన్ని తస్మిన్ తన భర్తతో పంచుకుంది. అతడి దానికి పగలబడి నవ్వాడు. దీన్ని సోషల్ మీడియా ద్వారా నెటిజన్లతో పంచుకుంది తస్మిన్. కాగా, తస్మిన్ 2022 ఫిబ్రవరిలో పండింటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఇక ఆ అమ్మాయి ముఖం ఎంతో అందంగా ఉందని.. తస్కిన్ స్వయంగా ప్రకటించింది.

Follow Us