Watch: ఓరీ దేవుడో ఇదేం ఇల్లురా సామీ.. మయసభను మించిపోయింది..! లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టు..
సోషల్ మీడియా అంటేనే అదో వింత ప్రపంచం. ఇక్కడ ఎన్నో రకాల వింతలు, విడ్డూరాలు కనిపిస్తుంటాయి. ఒక వ్యక్తి తన వెరైటీ, కాదు కాదు.. వెరీ స్పెషల్ హోం టూర్‌ని సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అది చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. ప్రపంచంలో ఇలాంటి ఇల్లు కూడా ఉందా..? బాబోయ్ పొరపాటున ఎవరైనా దొంగోడు ఈ ఇంట్లోకి వెళ్లాడంటే.. పిచ్చివాడై బయటకు వెళ్తానంటూ వేడుకుంటాడు..ఈ ఇల్లు నిజమైనదా..? లేదంటే ఫేక్ వీడియోనా అనే గందరగోళం పడ్డారు నెటిజన్లు.

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా దొంగల బెడద ఎక్కువైంది. ఈజీ మనీ కోసం కొందరు చోరీలకు పాల్పడుతున్నారు. దీంతో చాలా ఇళ్లలో హై సెక్యూరిటీ ఏర్పాటు చేసుకుంటున్నారు. భద్రత కోసం హైటెక్ గాడ్జెట్‌లు కూడా ఏర్పాటు చేసుకుంటున్నారు. కానీ ఒక కెనడియన్ సృష్టికర్త దొంగలను భయపెట్టడమే కాకుండా వారిని పూర్తిగా పిచ్చివాళ్లను చేసే ఇంటిని నిర్మించాడు. @river_of_paradise17 అనే ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఈ వెరైటీ, స్పెషల్ హోం టూర్ వీడియోను షేర్ చేశారు. దీనిని మొదట టిక్‌టాక్ స్టార్ డ్రూ డిర్క్సెన్ సొంతం చేసుకున్నాడు. ఇంటిలోని ప్రతి మూలన ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు మయసభాను మించిపోయిన అద్భుతాలు చూపించే వీడియో ఇది.
వైరల్ వీడియో ఆరంభంలో ముందుగా .. తలుపు తెరవండి.. మీ వెనుక ఒక గోడ ఉంది. ఒక గదిలోకి అడుగు పెట్టగానే ఒక గొయ్యి ఉంది. దొంగను గందరగోళపరిచే, షాక్ అయ్యే రహస్యాలు ప్రతిచోటా దాగి ఉన్నాయి. లక్షలాది మంది ఈ వీడియోని చూశారు. పొరపాటున దొంగోడు ఇక్కడకు వస్తే..తానంట తానే బయటకు రావాలని వేడుకుంటాడు అని చెప్పారు. మొత్తంలో ఈ ఇల్లే ఓ ఇంద్రజాలంలా అనిపించింది. అడుగడునా ఓ అద్భుతం కనిపించింది. ఎక్కడ కాలు పెడితే, ఎక్కడికి వెళతామో తెలియదు. ఎక్కడ డోర్ ఉంది. ఎక్కడ విండో ఉంది అర్థం కావటం లేదు. ఇలాంటి ఈ ఇంటినిండా 10కి పైగా మ్యాజిక్ ట్రిక్స్ ఉన్నాయి. మాటల్లో వర్ణించలేని ఈ వీడియోని మీరు తప్పక చూడాల్సిందే..
వీడియో ఇక్కడ చూడండి..
View this post on Instagram
10 మిలియన్లకు పైగా అనుచరులతో కంటెంట్ సృష్టికర్త డ్రూ డిర్క్సెన్ ఈ ఇంటిని స్వయంగా రూపొందించారు. వీడియోకి క్యాప్షన్‌గా “నువ్వు దొంగవైతే దీన్ని చూడకు. ధన్యవాదాలు! అనే పదాలతో ప్రారంభమవుతుంది. ఆ తర్వాత టూర్ ప్రారంభమవుతుంది. ఈ ఇంట్లో చాలా రహస్యాలు ఉన్నాయి. ప్రతి మూలలో ఒక రహస్యం ఉంది. అతను తన స్నేహితుడి ద్వారా ఈ రహస్యాలను ప్రజలకు పంచుకున్నాడు. ఇది మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..




