Viral Video: వాట్ ఎన్ ఐడియా సర్జీ.. సాయం కోసం బైక్ ను బుక్ చేసిన యువకుడు..

|

Mar 03, 2024 | 10:06 AM

ఎవరైనా ఏదైనా వాహనంలో ప్రయాణిస్తున్న సమయంలో మధ్యలో పాడైపోతే.. అయ్యో ఈ రోజు ఇలా జరిగింది బయలు దేరిన వేళ ఏమిటో అంటూ ఆలోచిస్తారు. అలా కారు లేదా బైక్ మార్గ మధ్యలో చెడిపోయినప్పుడల్లా.. తమ అదృష్టం ఇలా ఉంది అంటూ తనని తాను దూషించుకుంటాడు. ఎందుకంటే అది చాలా సమస్యలను కలిగిస్తుంది. ముఖ్యంగా వాహనం చెడిపోయిన ప్రతిసారీ అక్కడ లేదా సమీపంలో మెకానిక్ ఉంటాడన్న గ్యారెంటీ ఏమీ లేదు. దీంతో వాహనాన్ని తోసుకుంటూ మెకానిక్ వద్దకు తీసుకుని వెళ్ళాల్సిన పరిస్తితి వస్తుంది

Viral Video: వాట్ ఎన్ ఐడియా సర్జీ.. సాయం కోసం బైక్ ను బుక్ చేసిన యువకుడు..
Video Viral
Follow us on

నేటి కాలంలో టెక్నాలజీ మన జీవితాలను పూర్తిగా మార్చివేసింది. ఇప్పుడు చిన్న చిన్న విషయాలకే టెక్నాలజీని వాడుతున్నారు. మునుపెన్నడూ ఊహించనివిధంగా చిన్న పెద్ద అనే తేడా లేకుండా తమకు అందుబాటులో ఉన్న టెక్నాలజీని వదేస్తున్నాడు మనిషి. ఇంకా చెప్పాలంటే చాలా మంది తమ చిన్న చిన్న ప్రయోజనాల కోసం టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. ఇలాంటి వీడియోనే ఇప్పుడు జనాల్లో చర్చనీయాంశమైంది. ఇది చూసిన తర్వాత మీరు తప్పకుండా వాట్ ఎన్ ఐడియా సర్జీ అంటూ ప్రసంసల వర్షం కురిపిస్తారు.

ఎవరైనా ఏదైనా వాహనంలో ప్రయాణిస్తున్న సమయంలో మధ్యలో పాడైపోతే.. అయ్యో ఈ రోజు ఇలా జరిగింది బయలు దేరిన వేళ ఏమిటో అంటూ ఆలోచిస్తారు. అలా కారు లేదా బైక్ మార్గ మధ్యలో చెడిపోయినప్పుడల్లా.. తమ అదృష్టం ఇలా ఉంది అంటూ తనని తాను దూషించుకుంటాడు. ఎందుకంటే అది చాలా సమస్యలను కలిగిస్తుంది. ముఖ్యంగా వాహనం చెడిపోయిన ప్రతిసారీ అక్కడ లేదా సమీపంలో మెకానిక్ ఉంటాడన్న గ్యారెంటీ ఏమీ లేదు. దీంతో వాహనాన్ని తోసుకుంటూ మెకానిక్ వద్దకు తీసుకుని వెళ్ళాల్సిన పరిస్తితి వస్తుంది. ఇప్పుడు ఈ సమస్యకు సంబంధించిన వీడియో ప్రస్తుతం ఓ రేంజ్ లో వైరల్ అవుతోంది. ఇందులో ఆ వ్యక్తి బైక్‌ను నెట్టడానికి.. మెకానిక్ వద్దకు తీసుకెళ్లడానికి బైక్ ని బుక్ చేశాడు.

ఇవి కూడా చదవండి

ఇక్కడ వీడియో చూడండి

వీడియోలో ఒక Rapido బైకర్ కస్టమర్‌ని పికప్ చేసుకోవడానికి తీసుకుని వెళుతున్నట్లు చూడవచ్చు, అతను తన గమ్య స్థానానికి చేరుకున్న తర్వాత కస్టమర్‌కు తన సొంత బైక్ ఉండడం చూసి చాలా ఆశ్చర్యపోయాడు. దీని తరువాత మీరు ఈ బైక్‌ను ఎందుకు బుక్ చేసారని డ్రైవర్ తన కస్టమర్ ని అడగగా.. అప్పుడు కస్టమర్ చెప్పిన సమాధానానికి ఓ రేంజ్ లో షాక్ తిన్నారు. తన బైక్ చెడిపోయిందని, ఇంకా సర్వీస్ సెంటర్‌కు వెళ్లాలని, అందుకే ఈ బైక్‌ను బుక్ చేసుకున్నానని చెప్పాడు. దీని తరువాత బైక్ టాక్సీ రైడర్ తన కస్టమర్ కు సహాయం చేశాడు. బైక్ మెకానిక్ వద్దకు చేర్చాడు. అతను అతని నుండి డబ్బు తీసుకోవడానికి నిరాకరించాడు. పైగా సహాయం చేసినందుకు బదులుగా డబ్బు తీసుకోకూడదని చెప్పాడు. అయితే సదరు కస్టమర్ మాత్రం డబ్బులు డబ్బులు తీసుకోమని.. పెట్రోల్ ఖర్చుకి ఇస్తున్నాని చెప్పాడు.

@gojo_rider అనే ఖాతా ద్వారా ఈ వీడియో Instagramలో భాగస్వామ్యం చేయబడింది. ఈ వార్త రాసే వరకు వేల మంది దీనిని చూసి కామెంట్ చేస్తూ తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ఒక వినియోగదారు ఇలా వ్రాశారు, ‘ఇలాంటి చిన్న వీడియోలను చూడటం ద్వారా మాత్రమే మానవత్వం సజీవంగా ఉందని అర్థం అవుతుంది.’ మరొకరు, ‘ఈ సోదరుడు తన తెలివిని ఎంత అద్భుతంగా ఉపయోగించాడు’ అని రాశారు. ఇది కాకుండా, చాలా మంది ఇతర వినియోగదారులు దీనిపై వ్యాఖ్యానిస్తూ తమ అభిప్రాయాన్ని చెబుతున్నారు.

మరిన్ని వైరల్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..