Cooker Blast Viral Video: వామ్మో.. వంటచేస్తుండగా పేలిన ప్రెషర్‌ కుక్కర్.. ఇళ్లంతా విధ్వంసం!.. భయానక వీడియో వైరల్‌..

|

Dec 13, 2023 | 12:55 PM

కుక్కర్ పేలుడు వీడియో చాలా భయానకంగా ఉంది. ఇద్దరు మహిళలు వంటగదిలో పని చేస్తుండగా,గ్యాస్‌పై ఉంచిన కుక్కర్‌ వీడియోలో కనిపిస్తోంది. ఒక వ్యక్తి టేబుల్ వద్ద కూర్చుని ఉండగా సమీపంలో ఒక పిల్లవాడు ఆడుకుంటున్నాడు. ఒక్కసారిగా కుక్కర్‌లో పేలుడు సంభవించి కుక్కర్‌ పైకప్పు ఎగిరిపోయింది.. వంటగది మొత్తం పొగతో నిండిపోయింది. ఏం జరిగిందో ఎవరికీ అర్థంకాలేదు.

Cooker Blast Viral Video: వామ్మో.. వంటచేస్తుండగా పేలిన ప్రెషర్‌ కుక్కర్.. ఇళ్లంతా విధ్వంసం!.. భయానక వీడియో వైరల్‌..
Cooker Blast
Follow us on

ప్రస్తుతం చాలా మంది ఇళ్లల్లో ప్రెషర్‌ కుక్కర్ల వినియోగం పెరిగింది. వంట త్వరగా పూర్తి చేసేందుకు గానూ ప్రజలు తమ ఇళ్లల్లో ప్రెషర్‌ కుక్కర్లను ఎక్కువగా వినియోగిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రెషర్ కుక్కర్‌లో వంట చేస్తుండగా..అది పేలిపోయినట్లు అనేక వార్తలు విన్నాం. అందుకే కుక్కర్‌లో వంట చేసేటప్పుడు ప్రజలు చాలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు. కిచెన్‌లో పని చేస్తున్న మహిళల మధ్య అకస్మాత్తుగా కుక్కర్ పేలినట్లు పంజాబ్‌కు చెందిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కుక్కర్ పేలుడు వీడియో చాలా భయానకంగా ఉంది. ఇద్దరు మహిళలు వంటగదిలో పని చేస్తుండగా,గ్యాస్‌పై ఉంచిన కుక్కర్‌ వీడియోలో కనిపిస్తోంది. ఒక వ్యక్తి టేబుల్ వద్ద కూర్చుని ఉండగా సమీపంలో ఒక పిల్లవాడు ఆడుకుంటున్నాడు. ఒక్కసారిగా కుక్కర్‌లో పేలుడు సంభవించి కుక్కర్‌ పైకప్పు ఎగిరిపోయింది.. వంటగది మొత్తం పొగతో నిండిపోయింది. ఏం జరిగిందో ఎవరికీ అర్థంకాలేదు.

మహిళ కుక్కర్‌లో కూరగాయలు వండుతున్నట్లు సమాచారం. గ్యాస్ ఎక్కువ కావటంతో కుక్కర్ ఒక్కసారిగా పేలిపోయింది. పేలుడు ధాటికి ఇంట్లోని వారంతా తమ ప్రాణాలు కాపాడుకునేందుకు అక్కడి నుంచి పరుగులు తీశారు. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఈ ఘటనకు సంబంధించిన భయానక వీడియో సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేసింది.

ఇవి కూడా చదవండి

పంజాబ్‌లోని పాటియాలాలో ఈ ఘటన జరిగినట్లు సమాచారం. ఘటన జరిగిన సమయంలో ఇంట్లో ఓ చిన్నారి సహా నలుగురు వ్యక్తులు ఉన్నారు. కుక్కర్‌ పేలుడు సంభవించడంతో ప్రాణాలు కాపాడుకునేందుకు అందరూ అక్కడి నుంచి పరుగులు తీశారు. పేలుడు ధాటికి వంటగదిలో ఉంచిన వస్తువులు చెల్లాచెదురుగా పడిపోవడం వీడియోలో కనిపిస్తోంది. ఇల్లు మొత్తం ఆవిరితో నిండిపోయి కనిపించింది.

ఇదిలా ఉంటే.. కుక్కర్ పేలిపోవటానికి కారణాలపై పలువురు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ప్రెషర్ కుక్కర్ పేలుడు అది సరిగ్గా శుభ్రం చేయకపోవడం, అవసరానికి మించి నీటిని నింపడం, బలవంతంగా తెరవడానికి ప్రయత్నించడం, సామర్థ్యం కంటే ఎక్కువ ఉడికించడం, విజిల్, రబ్బరు సరిగ్గా శుభ్రం చేయకపోవడం మొదలైన అనేక కారణాలు ఉండొచ్చునని చెబుతున్నారు. అందుకే ఇళ్లల్లో ప్రెషర్‌ కుక్కర్‌ ఉపయోగించి వంట చేసే మహిళలు అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..