Elephant Viral Video: సోషల్ మీడియా ప్రపంచంలో నిత్యం పలు రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. సాధారణంగా వైరల్ అయ్యే ఫోటోలు, వీడియోలలో ఎక్కువగా జంతువులకు సంబంధించినవే ఉంటాయి. వాటినే చూడటానికి నెటిజన్లు తెగ ఇష్టపడతుంటారు. అయితే.. వీటిలో కొన్ని వీడియోలు ఫన్నీగా ఉంటే.. మరికొన్ని ఆశ్చర్యకరంగా ఉంటాయి. తాజాగా.. ఓ ఏనుగుకు స్నానం చేయిస్తున్న వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. వైరల్ అవుతున్న వీడియో నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. సోషల్ మీడియా (social media) లో హల్ చల్ చేస్తున్న వీడియో చూసి అందరూ ఫిదా అవుతున్నారు.
వైరల్ అవుతున్న వీడియోలో ఏనుగుకు స్నానం చేయిస్తున్న దృశ్యాన్ని చూడవచ్చు. ఇటీవల కాలంలో ఎండలు దంచికొడుతున్నాయి. ఈ క్రమంలో ఎండ తాపం నుంచి ఏనుగుకు ఉపశమనం కల్పించేందుకు ఓ మావటి పైపుతో స్నానం చేయించాడు. ఏకంగా ఏనుగు పైకి ఎక్కి దానికి స్నానం చేయించాడు. ఇంటర్నెట్‌లో ప్రస్తుతం ఈ వీడియో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ ఏనుగు స్నానం చేసే విధానం చాలా ప్రత్యేకమైనదిగా ఉందని నెటిజన్లు పేర్కొంటున్నారు. ముందుగా ఏనుగు స్నానం చేస్తున్న దృశ్యాన్ని చూడండి..
వైరల్ వీడియో..
ఈ వైరల్ వీడియోలో ఏనుగు స్నానం చేసే ఈ స్టైల్ చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఈ వీడియోను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయగా.. లక్షలాది మంది వీక్షించి తెగ షేర్ చేస్తున్నారు. ఈ వార్త రాసే సమయానికి 3 లక్షల మందికి పైగా ఈ వీడియోను లైక్ చేసారు. దీంతోపాటు పలు రకాల కామెంట్లు చేస్తున్నారు. ఏనుగు స్నానం చేసే విధానం అద్భుతంగా ఉందంటూ పేర్కొంటున్నారు.
మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..