Watch Video: సొరచేప ఎలా పుడుతుందో ఎప్పుడైనా చూశారా..? దుబాయ్ మాల్ అక్వేరియంలో అరుదైన ఘటన..

|

Jul 31, 2024 | 6:13 PM

అక్కడి మాల్‌లో ఇలాంటి అరుదైన సంఘటన చోటుచేసుకుంది. అక్వేరియంలో షార్క్ బేబీ పుట్టింది. షార్క్ బేబీకి జన్మనిస్తున్న సమయంలో మాల్‌కు వచ్చిన సందర్శకులు ఆ అద్భుతమైన క్షణాన్ని వీక్షించారు. దీనికి సంబంధించి వీడియోను అక్వేరియం నిర్వాహకులు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. అక్వేరియంలోని సొరచేప తల్లి నుంచి బేబీ షార్క్ ఉద్భవించి నీళ్ల ఉపరితలం మీదుగా జారిపోతూ కనిపించిన ఆ

Watch Video: సొరచేప ఎలా పుడుతుందో ఎప్పుడైనా చూశారా..? దుబాయ్ మాల్ అక్వేరియంలో అరుదైన ఘటన..
Shark Baby Video
Follow us on

Dubai Mall Aquarium : సముద్రంలో షార్క్ అత్యంత ప్రమాదకరమైన నీటి జంతువుగా చెబుతారు. అయితే, షార్క్‌ను ప్రత్యక్షంగా చూడటం చాలా అరుదు అనే చెప్పాలి. కానీ, షార్క్‌కి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అందులో షార్క్ తన బిడ్డకు జన్మనిస్తోంది. అందుకే ఈ వీడియో చూసిన వారంతా ఆశ్చర్యపోతున్నారు. అయితే ఈ వీడియో దుబాయ్‌లోని ఓ అక్వేరియంలో జరిగిన ఘటన అని తెలిసింది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద అక్వేరియం. దీనిని ప్రపంచంలోని నీటి అడుగున నిర్మించిన ఏకైక జూ అని పిలుస్తారు. ఈ అక్వేరియంలో ఇటీవల ఒక షార్క్ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ సంఘటన వీడియోను అక్వేరియం అధికారులు ఇంటర్‌నెట్‌లో పోస్ట్‌ చేశారు. అది కాస్త ఇప్పుడు నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది.

దుబాయ్ అక్వేరియం ప్రపంచంలోని అతిపెద్ద అక్వేరియంలలో ఒకటి. నీటి అడుగున జంతుప్రదర్శనశాలలో ఈ అక్వేరియాన్ని నిర్మించారు. ఇక్కడ దుబాయ్‌ మాల్‌లో ఇలాంటి అరుదైన సంఘటన చోటుచేసుకుంది. అక్వేరియంలో షార్క్ బేబీ పుట్టింది. షార్క్ బేబీకి జన్మనిస్తున్న సమయంలో మాల్‌కు వచ్చిన సందర్శకులు ఆ అద్భుతమైన క్షణాన్ని వీక్షించారు. దీనికి సంబంధించి వీడియోను అక్వేరియం నిర్వాహకులు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. అక్వేరియంలోని సొరచేప తల్లి నుంచి బేబీ షార్క్ ఉద్భవించి నీళ్ల ఉపరితలం మీదుగా జారిపోతూ కనిపించిన ఆ క్షణాన్ని వీడియోలో స్పష్టంగా చూడొచ్చు. ఈ ఉదయం మా అక్వేరియంలో షార్క్‌ బేబీ పురుడు పోసుకోవడం చాలా అద్భుతంగా అనిపించిందని వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు. ఇప్పుడా ఈ వీడియో వైరల్ అవుతోంది.

ఇవి కూడా చదవండి

వీడియోను చూసిన నెటిజన్లు అద్భుతమైన క్షణం అంటూ చాలా మంది స్పంధించారు. మేం అక్కడే ఉన్నాం. డైవింగ్ చేశాం.. అంతలోనే షార్క్ బేబీ పుట్టడం చూసి చాలా అద్భుతంగా ఫీలయ్యామంటూ ఇంకొకరు కామెంట్‌ చేశారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..