Viral: పోలీసులను చూసి తత్తరపాటుకు గురైన కూరగాయల వ్యాపారి.. అనుమానమొచ్చి చెక్ చేయగా మైండ్ బ్లాంక్!

|

Jul 20, 2022 | 6:30 PM

అటు వైపు వచ్చే ప్రతీ వెహికిల్‌ను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ఈలోపు ఓ కూరగాయల వ్యాపారి తన వాహనంతో ఆ రోడ్డులోకి ఎంటరయ్యాడు..

Viral: పోలీసులను చూసి తత్తరపాటుకు గురైన కూరగాయల వ్యాపారి.. అనుమానమొచ్చి చెక్ చేయగా మైండ్ బ్లాంక్!
Representative Image
Follow us on

నల్ల మందు(Opium) అక్రమ రవాణా జరుగుతోందని పక్కా సమాచారం అందుకున్న పోలీసులు.. ఆ ముఠాను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకునేందుకు ఓ రోడ్డు దగ్గర కాపు కాశారు. అటు వైపు వచ్చే ప్రతీ వెహికిల్‌ను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ఈలోపు ఓ కూరగాయల వ్యాపారి తన వాహనంతో ఆ రోడ్డులోకి ఎంటరయ్యాడు. కొద్ది దూరంలో ఉన్న పోలీసులను చూసి తత్తరపాటుకు గురయ్యాడు. తన బండిని వెనక్కి తిప్పి నెమ్మదిగా జారుకోవాలనుకున్నాడు. అయితే అక్కడున్న పోలీసులు తమ మూడో కంటితో ఇదంతా గమనిస్తూ.. అతడు జారుకోకుండానే పట్టుకున్నారు. ఇంతకీ ఆ కథేంటంటే.!

వివరాల్లోకి వెళ్తే.. నల్ల మందు(Opium)ను అక్రమంగా రవాణా చేస్తోన్న 22 ఏళ్ల కూరగాయల వ్యాపారి రాజు ప్రతాప్రమ్‌ను పూణే క్రైమ్ బ్రాంచ్ పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అతడి దగ్గర నుంచి 2.8 కేజీల నల్ల మందును స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ మార్కెట్‌లో సుమారు రూ. 8 లక్షలు ఉంటుందని అంచనా.

స్థానిక తిలక్ రోడ్డులో పెద్ద ఎత్తున నల్ల మందు అక్రమంగా రవాణా కాబోతోందని ఇన్‌ఫోర్మర్స్ దగ్గర నుంచి సమాచారం రాగా.. క్రైం బ్రాంచ్ పోలీసులు బెటాలియన్‌తో ఆ రోడ్డులో గస్తీ కాశారు. అటుగా వచ్చిన ప్రతీ వెహికిల్‌ను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈలోపు కూరగాయల వాహనంతో అటుగా వచ్చిన రాజు.. నల్ల మందుతో రెడ్ హ్యాండెడ్‌గా దొరికాడు. కాగా, నిందితుడు రాజుపై నార్కోటిక్స్ అధికారులు కేసు నమోదు చేసి మేజిస్ట్రేట్ ముందు హాజరు పరిచారు.

ఇవి కూడా చదవండి

ఇదిలా ఉంటే.. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్‌లలోని ఎంపిక చేసిన ప్రాంతాలలో నల్లమందు చట్టబద్ధమైన సాగును కేంద్ర ప్రభుత్వం పర్యవేక్షిస్తోంది. సెంట్రల్ నార్కోటిక్స్ బ్యూరో.. నల్లమందు సాగుకు లైసెన్స్‌లను జారీ చేస్తుంది. ఆ ప్రాంతాలు మినహా.. దేశంలోని మరే ఇతర ప్రాంతంలోనైనా నల్లమందు సాగు చేయడం చట్టవిరుద్ధం.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం.