Watch: ఉత్తరాఖండ్‌ ప్రజల దుస్థితి ఇలా ఉంటుందా..? చదువుకోవాలంటే ఇలా ప్రాణాలకు తెగించాల్సిందే..!

ఈ క్లిప్‌లో, ఇద్దరు బాలికలు నదిని దాటడానికి శిథిలావస్థకు చేరుకున్న తాడుతో ట్రాలీలో కూర్చొని పాఠశాలకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. ట్రాలీ మధ్యలో ఆగినప్పుడు, అమ్మాయిలు ఎలాగోలా నదిని రెండు వైపుల నుండి లాగి దాటడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ దృశ్యం చూస్తుంటేనే ఒళ్లు గగ్గుర్పొడిచేలా కనిపిస్తుంది. ఈ దృశ్యాన్ని చూసిన చాలా మంది ఇంటర్నెట్ వినియోగదారులు వంతెన నిర్మించాలని డిమాండ్ చేస్తున్నారు.

Watch: ఉత్తరాఖండ్‌ ప్రజల దుస్థితి ఇలా ఉంటుందా..? చదువుకోవాలంటే ఇలా ప్రాణాలకు తెగించాల్సిందే..!
School Girls Crossing River

Updated on: Jan 28, 2025 | 9:00 PM

ఉత్తరాఖండ్.. భారతదేశంలోని అత్యంత అందమైన రాష్ట్రాలలో ఒకటి. బయటి నుండి ఉత్తరాఖండ్‌ అందాలు, ఆధ్యాత్మీక ప్రదేశాలను సందర్శించడానికి వచ్చే ప్రజలు ఇక్కడి ప్రకృతి రమణీయతను చూసి మైమరచిపోతారు. కానీ, ఇక్కడ నివసించే ప్రజల జీవితం అంత మెరుగ్గా ఉందా..? అని ఎప్పుడైనా ఆలోచించారా..? ఉత్తరాఖండ్‌ ప్రజల జీవితాలు ఎలా ఉంటాయో తెలియజేసే ఒక వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో ఉత్తరాఖండ్‌లోని మున్సియరీకి చెందిన కొంతమంది పాఠశాల బాలికలు తమ బ్యాగులు భుజాలకు వేసుకుని నదిని దాటి వెళ్లి చదువుకుంటున్నారు. కానీ, ఆ నదిపై నిర్మించిన వంతెనపై కాదు.. పాత పాడుబడిన ఓ తాడుపై వేలాడుతున్న ట్రాలీలో కూర్చుని భయంకరమైన రీతిలో నదిని దాటుతున్నారు. ఈ క్లిప్‌లో, ఇద్దరు బాలికలు నదిని దాటడానికి శిథిలావస్థకు చేరుకున్న తాడుతో ట్రాలీలో కూర్చొని పాఠశాలకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. ట్రాలీ మధ్యలో ఆగినప్పుడు, అమ్మాయిలు ఎలాగోలా నదిని రెండు వైపుల నుండి లాగి దాటడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ దృశ్యం చూస్తుంటేనే ఒళ్లు గగ్గుర్పొడిచేలా కనిపిస్తుంది. ఈ దృశ్యాన్ని చూసిన చాలా మంది ఇంటర్నెట్ వినియోగదారులు వంతెన నిర్మించాలని డిమాండ్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

కాగా, వీడియో నెట్టింట తీవ్ర దుమారం రేపుతోంది. 2025 సంవత్సరంలో కూడా మన దేశంలో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ ప్రాంతంలో అభివృద్ధి పురోగతిని ప్రశ్నిస్తూ, “అభివృద్ధి ఇలా ఉంటుందా?” అంటూ మరికొందరు వ్యాఖ్యానించారు.

ఇది కూడా చదవండి: వారెవ్వా ఏం ఐడియా గురూ.. కరెంట్‌, కష్టం లేకుండానే కమ్మటి చట్నీ రెడీ..! ఈ వీడియో చూస్తే..

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..