
సాధారణంగా చిన్న పిల్లలు పక్క తడుపుతుంటారు. పిల్లలకు టాయ్‌లెట్‌ను కంట్రోల్ చేసుకునే సమర్థత ఉండకపోవడం వల్ల ఆ పరిస్థితి ఉంటుంది. మరి.. పెద్దలు అలా చేస్తే పరిస్థితి ఏంటి? అవును, అతనో యుక్త వయస్కుడు. అతనికి ఓ ప్రియురాలు కూడా ఉంది. కానీ, ఇప్పటికీ పక్కతడిపే అలవాటు ఉంది. అదే అతని ప్రాణాలమీదకు తెచ్చింది. అవును, పక్కతడిపే అలవాటే అతని ప్రాణాలు పోయేంత పని చేసింది. ఇందుకు సంబంధించిన షాకింగ్ వివరాలు ఇలా ఉన్నాయి.
అమెరికాలోని లూసియానాకు చెందిన ఓ యువకుడు బ్రియానా లాక్టోస్ అనే అమ్మాయిని ప్రేమించాడు. ఆమెతో సహజీవనం చేస్తున్నాడు. దాదాపు ఏడాదిన్నర కాలంగా వీరి బంధం హ్యాపీగా సాగింది. కానీ, ఒకే ఒక ఘటన.. యువకుడి ప్రాణాల మీదకు తెచ్చింది. అదే నిద్ర మత్తులో పక్కతడపడం. అవును, ఆ యువకుడు నిద్ర మత్తులో మంచంపై మూత్ర విసర్జన చేశాడు. అది గమనించిన యువతి.. ఆగ్రహంతో ఊగిపోయింది. కట్టలుతెంచుకున్న ఆగ్రహంతో.. అతన్ని పొట్టు పొట్టుగా కొట్టింది. ఈ ఊహించని పరిణామంతో బెంబేలెత్తిపోయిన యువకుడు ఆమె నుంచి తప్పించుకుని పారిపోయే ప్రయత్నం చేశాడు. అయినా తగ్గని యువతి.. వంట గదిలో కత్తి తీసుకుని, అతన్ని దొరకబట్టి మరీ పొడిచింది. కత్తి దాడిలో గాయపడిన యువడికి అమ్మాయే ఆస్పత్రిలో చేర్పించింది. ప్రస్తుతం అతను చికిత్స పొందుతున్నాడు. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు చెబుతున్నారు.
ఈ ఘటనలో యువతిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. విచారించారు. ఘటన జరిగిన రోజు రాత్రి ఇద్దరూ ఫుల్లుగా మధ్యం సేవించారని, నిద్రలో యువకుడు మూత్రం పోసినట్లు తెలిపారు. ఈ విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరగగా.. యువకుడు తన ప్రియురాలిని కొట్టాడట. దాంతో కోపోద్రిక్తురాలైన అమ్మాయి.. కత్తి తీసుకుని అతనిపై దాడిచేసిందట. అనంతరం ఆమెనె ఆస్పత్రికి తరలించి, చికిత్స చేయించింది. ఈ ఘటనపై పోలీసులు విచారిస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..