
హైరిస్క్.. హైరివార్డ్.! అటు స్టాక్ మార్కెట్ ఎలాగో.. ఇటు లాటరీ టికెట్లు కూడా అలానే. ఈ రెండూ హైరిస్క్, హైరివార్డు గేమ్స్ అనమాట. చాలామంది తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు లాటరీ టికెట్లు కొంటుంటారు. ప్రతిరోజూ లక్షలాది మంది టిక్కెట్లు కొంటే.. అందులో కొద్దిమందికే అదృష్టం వరిస్తుంది. సరిగ్గా ఇదే తరహ ఘటన ఓ వ్యక్తికి జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. మిచిగాన్‌లోని వేన్ కౌంటీకి చెందిన 32 ఏళ్ల వ్యక్తి జీవితం రాత్రికి రాత్రే మారిపోయింది. సరదా కోసం స్క్రాచ్ చేసిన టికెట్ ద్వారా లచ్చిందేవి తలుపు తట్టింది.
ఇది చదవండి: అక్కడికి ఎలా ఎక్కావు మావ.. వీడియో చూస్తే వణికిపోవాల్సిందే
సదరు యువకుడు ఇటీవల కాంటన్ ప్రాంతంలోని మిచిగాన్ అవెన్యూలో ఉన్న ఫ్లేక్ ఫ్రెష్ మార్ట్ స్టోర్‌కి వెళ్లాడు. అక్కడ అతడు 100X గేమ్ కోసం పలు టికెట్లు కొన్నాడు. సాధారణంగా అతడు ఈ గేమ్ ఆడడు. కానీ ఆ రోజు ఏదో కారణంతో ఆడాలని అనుకున్నాడు. టికెట్లు కొన్నాడు. ఇక అదే అతడికి లక్ తెచ్చిపెట్టింది. టికెట్‌లో 11వ నెంబర్ రావడంతో అతడికి ఏకంగా 2 మిలియన్ల డాలర్ల జాక్ పాట్ తగిలింది. అంటే ఇండియన్ కరెన్సీలో రూ. 17 కోట్లు అనమాట. తనకు ఇంతటి పెద్ద బహుమతి రావడంతో ఆ యువకుడి ఆనందానికి అవధులు లేవు. 20 డాలర్లతో టికెట్ కొంటే 2 మిలియన్ల డాలర్స్ ప్రైజ్ మనీ వచ్చిందని అన్నాడు. ఇంత పెద్ద మొత్తాన్ని గెలుచుకున్న తర్వాత, అతడు ఆ డబ్బును తన, తన కుటుంబీకుల భవిష్యత్తు కోసం పొదుపు చేస్తానని చెప్పుకొచ్చాడు.
ఇది చదవండి: కొండ కింద నల్లటి ఆకారం.. కెమెరాకు పని చెప్పి జూమ్ చేయగా దిమ్మతిరిగింది