AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నువ్వు దేవుడు సామీ..! బ్రేక్‌ఫాస్ట్‌లో 10కిలోల మిరపకాయలు, ఎర్రటి కారం పొడితో స్నానం.. షాకింగ్‌ వీడియో చూస్తే..

సోషల్ మీడియాలో ప్రతిరోజూ ప్రతిక్షణం ఏదో ఒకటి వైరల్ అవుతూనే ఉంటుంది. అది ప్రజలను ఆశ్చర్యపరుస్తుంది. క్షణంలో చర్చనీయాంశంగా మారుతుంది. ప్రస్తుతం మేఘాలయలోని తూర్పు జైంటియా హిల్స్ జిల్లాకు చెందిన ఒక సాధారణ రైతు ప్రత్యేక సామర్థ్యం మరోసారి వైరల్ అవుతోంది. ఈ రైతు కిలోల కొద్దీ మిరపకాయలు తినడమే కాకుండా, కారం పొడితో స్నానం చేస్తాడు. అతనికి ఉన్న ఈ అద్భుతమైన సామర్థ్యాన్ని చూసి స్థానికులతో పాటు నెటిజన్లు సైతం షాక్‌ అవుతున్నారు. అతన్ని మానవాతీతుడు అంటూ ప్రశంసిస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే...

నువ్వు దేవుడు సామీ..! బ్రేక్‌ఫాస్ట్‌లో 10కిలోల మిరపకాయలు, ఎర్రటి కారం పొడితో స్నానం.. షాకింగ్‌ వీడియో చూస్తే..
Meghalaya Ram Pirtuh
Jyothi Gadda
|

Updated on: Oct 04, 2025 | 9:24 AM

Share

మేఘాలయలోని దట్టమైన అడవులు, కొండల మధ్య సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్న ఒక వ్యక్తి నివసిస్తున్నాడు. రామ్ పీర్తుహ్ అనే ఈ వ్యక్తి తూర్పు జైంటియా హిల్స్ జిల్లాలోని బటావ్ గ్రామానికి చెందిన ఒక సాధారణ రైతు. కానీ, అతను తన అసాధారణ సామర్థ్యాల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాడు. రామ్‌ పీర్తుహ్‌ అల్పాహారంగా 10 కిలోగ్రాముల మిరపకాయలు తింటాడట. ఇందుకు సంబంధించిన పాత వీడియో ఒకటి తాజాగా వైరల్‌గా మారింది. అది కూడా చుక్క కన్నీళ్లు, చెమట లేకుండా.! కథ ఇక్కడితో ఆగదు. ఇంకా అతను స్నానానికి సబ్బుగా మిరపకాయ పొడిని ఉపయోగిస్తున్నాడు. రామ్ తన ప్రైవేట్ భాగాలను ఎర్రటి కారం పొడితో కడుక్కుంటున్నాడు. కనీసం అపానవాయువు కూడా పోనివ్వడని వైరల్ పోస్ట్‌లు చెబుతున్నాయి. ఇది మానవాతీత శక్తులా లేక కేవలం పుకారా? అంటూ జనాలు షాక్‌ అవుతున్నారు.

రామ్ పీర్తుహ్‌ ప్రత్యేక ప్రతిభ 2021 లో వార్తల్లో నిలిచింది. అతను మిరపకాయల ప్యాకెట్లను తింటున్నట్టుగా వీడియోలో చూపించబడింది. ఆ వీడియోకు మేఘాలయకు చెందిన ఈ వ్యక్తి ఒకేసారి 10 కిలోగ్రాముల ఘాటైన మిరపకాయలు తినగలడు అని పేరు పెట్టారు. ఫేస్‌బుక్, యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసిన ఈ వీడియో మిలియన్ల కొద్దీ వ్యూస్‌ సంపాదించింది. ఆ తరువాత ఏం జరిగిందోనని ఆ వ్యక్తి గురించి చర్చించుకోవడం ప్రారంభించారు. దీని వెనుక ఉన్న నిజం తెలుసుకోవడానికి సుదూర ప్రాంతాల నుండి కూడా ప్రజలు అతన్ని వెతుక్కుంటూ రావడం ప్రారంభించారు.

ఇవి కూడా చదవండి

ఈ సందర్భంగా 50 ఏళ్ల రైతు రామ్ ఇలా అన్నాడు.. మిరపకాయ నా జీవితంలో ఒక భాగం. నేను చిన్నప్పటి నుంచి తింటున్నాను, కాబట్టి ఇప్పుడు దానిలోని కారపు రుచి కూడా నాకు అనిపించడం లేదు అని చెప్పాడు. ఉదయం నిద్ర లేవగానే మిరప టీ, మధ్యాహ్నం మిరపకాయ మటన్ కర్రీ, సాయంత్రం పచ్చి మిరపకాయలు తింటాను. ఇలా మిరపకాయ నా ఔషధం, దానితో నాకు ఎలాంటి అనారోగ్యం అనిపించదు అని ఆయన అన్నారు.

వీడియో ఇక్కడ చూడండి..

View this post on Instagram

A post shared by Golu K Facts (@golu.k_facts)

మేఘాలయలోని జైంటియా హిల్స్‌లో మిరప సాగు సర్వసాధారణం. కానీ, రామ్ లాంటి వారు ఎవరూ లేరు. ఇప్పుడు అతని పాత వీడియో మళ్ళీ వైరల్ అవుతోంది. అతను మిరపకాయ తినడమే కాదు, దాంతో స్నానం చేస్తాడు. రామ్‌లోని ఈ ఆశ్చర్యకరమైన లక్షణం గురించి చర్చించడం ప్రారంభించినప్పుడు, చాలా మంది దీనిని ప్రయత్నించడం ప్రారంభించారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

నేను ఇప్పుడు తెలంగాణ వాన్ని: వెంకయ్య నాయుడు
నేను ఇప్పుడు తెలంగాణ వాన్ని: వెంకయ్య నాయుడు
అమ్మాయికి మొగుడు... అత్తకు యముడు... ఏకంగా గొంతు కోసి..
అమ్మాయికి మొగుడు... అత్తకు యముడు... ఏకంగా గొంతు కోసి..
గురు, శుక్రుల అనుకూలత.. ఆ రాశుల వారికి హద్దుల్లేని సంపద ఖాయం..!
గురు, శుక్రుల అనుకూలత.. ఆ రాశుల వారికి హద్దుల్లేని సంపద ఖాయం..!
మెస్సీ వచ్చిన ఆ రోజు కోల్‌కతా స్టేడియంలో ఏం జరిగింది ?
మెస్సీ వచ్చిన ఆ రోజు కోల్‌కతా స్టేడియంలో ఏం జరిగింది ?
కొత్త ఏడాది ఈ రాశుల వారి కుటుంబాల్లో భారీగా శుభ కార్యాలు..!
కొత్త ఏడాది ఈ రాశుల వారి కుటుంబాల్లో భారీగా శుభ కార్యాలు..!
రైతన్నలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇకపై నేరుగా ఇంటికే యూరియా!
రైతన్నలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇకపై నేరుగా ఇంటికే యూరియా!
టీ20 వరల్డ్ కప్ టికెట్‌ను మెస్సీకి బహూకరించిన ఐసీసీ ఛైర్మన్ జై షా
టీ20 వరల్డ్ కప్ టికెట్‌ను మెస్సీకి బహూకరించిన ఐసీసీ ఛైర్మన్ జై షా
సమాధులే ఇంటి దేవతలు.. ఏపీలోని ఈ వింత గ్రామం గురించి మీకు తెలుసా
సమాధులే ఇంటి దేవతలు.. ఏపీలోని ఈ వింత గ్రామం గురించి మీకు తెలుసా
కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.20 లక్షల వరకు లోన్.. పొందండిలా..
కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.20 లక్షల వరకు లోన్.. పొందండిలా..
ఈ ఫొటోలో ఒక టాలీవుడ్ హీరోయిన్ కూడా ఉంది.. గుర్తు పట్టండి చూద్దాం
ఈ ఫొటోలో ఒక టాలీవుడ్ హీరోయిన్ కూడా ఉంది.. గుర్తు పట్టండి చూద్దాం