AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: రేయ్ ఎవర్రా మీరంతా.. పెళ్లిలో లెగ్‌పీస్ వేయలేదని.. పొట్టు పొట్టు కొట్టుకున్న ఇరు వర్గాలు!

ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహా జిల్లాలో ఒక పెళ్లి విందులో ఊహించని ఘటన జరిగింది. కేవలం చికెన్ లెగ్ పీస్ దొరకలేదన్న చిన్న కారణంతో మొదలైన గొడవ, ఇరువర్గాల మధ్య పెద్ద యుద్ధానికే దారితీసింది. దీనికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Viral Video: రేయ్ ఎవర్రా మీరంతా.. పెళ్లిలో లెగ్‌పీస్ వేయలేదని.. పొట్టు పొట్టు కొట్టుకున్న ఇరు వర్గాలు!
Up Wedding Fight
Anand T
|

Updated on: Mar 29, 2026 | 5:41 PM

Share

ఉత్తరప్రదేశ్‌లో విచిత్ర ఘటన వెలుగు చూసింది. పెళ్లి వింధు భోజనంలో చికెన్ లెగ్ పీస్ కోసం చిన్నగా మొదలైన గొడవ ఒకరినోకరు కొట్టుకునే వరకు వెళ్లింది. పందిట్లోనే చేర్లతో ఇరువర్గాలు పొట్టు పొట్టుకొట్టుకున్నారు. స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు ఇరువర్గాలకు సర్థి చెప్పి గొడవను సద్దుమణిగించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

వివరాల్లోకి వెళ్తే.. లక్నో నగరంలో ఓ పెళ్లి వేడక జరుగుతుంది. పెళ్లి తంతు ముగిసి అందరూ భోజనాలు చేస్తున్నారు. భోజనాల సందర్భంగా చికెన్ బిర్యానీ కూడా వడ్డించారు. అయితే, వడ్డించే సమయంలో తమకు లెగ్ పీస్ రాలేదని పెళ్లికొడుకు తరపు బంధువులు పెళ్లి కూతురి కుటుంబ సభ్యులలో వాగ్వాదానికి దిగారు. ఇలా చిన్నగా మొదలైన గొడవ మాట మాట పెరిగి అది కాస్తా తోపులాటకు దారితీసింది. క్షణాల్లో పెళ్లి వేదిక కాస్తా కుమ్ములాటల వేదికగా మారిపోయింది.

ఆగ్రహంతో ఊగిపోయిన పెళ్లికొడుకు తరపు బంధువులు పెళ్లి మండపంలో ఉన్న కుర్చీలు, టేబుళ్లను విరగ్గొట్టారు. వడ్డించిన ఆహారాన్ని చిందరవందర చేశారు. దీంతో విసిగిపోయిన పెళ్లి కూతురు కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇరు వర్గాలకు సర్థిచెప్పి పరిస్థితిని సద్దుమణిగించారు. అయితే అక్కడే ఉన్న కొందరు ఈ తతంగాన్నంత వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us