ప్రేమ నిజంగా గుడ్డిదే.. తాత వయసున్న వ్యక్తిని ప్రేమించిన యువతి.. నో చెప్పిన తల్లిదండ్రులను విడిచి మరీ పెళ్లి

ఆడిటీ సెంట్రల్ వెబ్‌సైట్ నివేదిక ప్రకారం హెబీ ప్రావిన్స్‌లోని రిటైర్మెంట్ హోమ్‌లో వాలంటీర్‌గా పనిచేస్తోన్న యువతికి.. 80 ఏళ్ల వృద్ధుడితో పరిచయం ఏర్పడింది. వీరిద్దరూ త్వరలోనే స్నేహితులు అయ్యారు. ఒకరితో ఒకరు మాట్లాడుతున్నప్పుడు.. వారికి చాలా సారూప్యమైన హాబీలు ఉన్నాయని, ఇద్దరూ ఒకే విధమైన విషయాలపై ఆసక్తి కలిగి ఉన్నారని గ్రహించారు.

ప్రేమ నిజంగా గుడ్డిదే.. తాత వయసున్న వ్యక్తిని ప్రేమించిన యువతి.. నో చెప్పిన తల్లిదండ్రులను విడిచి మరీ పెళ్లి
Unusual Love Story

Updated on: Jun 13, 2024 | 6:14 PM

ప్రేమ గుడ్డిది అని తరచుగా చెబుతుంటారు. ప్రేమ కులం, మతం, పేద, వయస్సు, సరిహద్దులకు అతీతం. తరచుగా తమకంటే 20-30 ఏళ్లు తక్కువ వయస్సు ఉన్న అమ్మాయిలను ప్రేమించి, ఆ తర్వాత ఒకరినొకరు ఇష్టపడి పెళ్లి చేసుకున్న సంఘటనలకు సంబందించిన వార్తలు అనేకం చూసి ఉంటారు లేదా వినే ఉంటారు. ప్రస్తుతం ఇలాంటి ప్రేమకథే చర్చనీయాంశమైంది అయితే ఈ కథలో ప్రియుడు, ప్రియురాలి మధ్య వయసు తేడా ఎంతగా ఉందంటే ఈ వయసులో కూడా ఎవరైనా ప్రేమలో పడే అవకాశం ఉందని తెలుసుకుని షాక్ తింటారు. ఈ వింత ప్రేమకథ చైనాలో చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళ్తే..

ఈ ప్రేమకథ చైనాలోని హెబీ ప్రావిన్స్‌కి చెందినది. నిజానికి ఇక్కడ నివసించే 23 ఏళ్ల అమ్మాయి వృద్ధాశ్రమంలో పరిచయమైన 80 ఏళ్ల వృద్ధుడితో ప్రేమలో పడింది. ఆడిటీ సెంట్రల్ వెబ్‌సైట్ నివేదిక ప్రకారం హెబీ ప్రావిన్స్‌లోని రిటైర్మెంట్ హోమ్‌లో వాలంటీర్‌గా పనిచేస్తోన్న యువతికి.. 80 ఏళ్ల వృద్ధుడితో పరిచయం ఏర్పడింది. వీరిద్దరూ త్వరలోనే స్నేహితులు అయ్యారు. ఒకరితో ఒకరు మాట్లాడుతున్నప్పుడు.. వారికి చాలా సారూప్యమైన హాబీలు ఉన్నాయని, ఇద్దరూ ఒకే విధమైన విషయాలపై ఆసక్తి కలిగి ఉన్నారని గ్రహించారు.

ప్రేమగా మారిన స్నేహం

ఇవి కూడా చదవండి

క్రమంగా సమయం గడిచిపోయింది. వీరి స్నేహం వేరే రూపం తీసుకుంది. ఇద్దరిలో ఒకరిపై మరొకరికి ప్రేమ అనే భావన ఏర్పడింది. నివేదికల ప్రకారం వృద్ధుడి పరిపక్వత, స్థిరత్వం, తెలివితేటలకు తాను ఆకర్షితురాలిని అయ్యానని అమ్మాయి చెప్పింది. అదే సమయంలో వృద్దురాలు తాను ఆ యువతి దయ, శారీరక సౌందర్యానికి ముగ్ధుడయ్యానని పేర్కొన్నాడు. ఇద్దరూ ఒకరిపై ఒకరి ప్రేమని వ్యక్తం చేసుకుని ఇద్దరూ ఒకరినొకరు పెళ్లి చేసుకోవాలని తహతహలాడారు. అయితే వీరి పెళ్ళికి వచ్చిన సమస్య ఏమిటంటే.. ఆ యువతి కుటుంబానికి .. వృద్దుడిని పెళ్లి చేసుకోవడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. ఎందుకంటే తమ కుమార్తె తన తాత వయస్సులో ఉన్న వ్యక్తిని పెళ్లి చేసుకుని తన జీవితాన్ని గడపడానికి ఇష్టపడడం లేదు.

తాతని పెళ్లి చేసుకోవడానికి తల్లిదండ్రులను వదిలేసిన యువతి

తమ ప్రేమ, పెళ్ళికి తన కుటుంబం ఆమోదించకపోవడంతో.. ఆ యువతి తన మనసు మాటను వింది. తన తల్లిదండ్రులను విడిచిపెట్టి వృద్దుడిని పెళ్లి చేసుకుంది. ఈ జంట ఇటీవలే వివాహం జరిగింది. అయితే ఈ వివాహానికి అమ్మాయి కుటుంబ సభ్యులు హాజరు కాలేదని తెలుస్తోంది. పెళ్లి సమయంలో ఒకరికొకరు అండగా ఉంటామని ఎటువంటి సందర్భం ఎదురైనా విడిచి పెట్టమని ప్రతిజ్ఞ చేశారు. అయితే ఈ పెళ్లిపై సోషల్ మీడియాలో నెటిజన్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆ అమ్మాయి డబ్బు కోసం ముసలి వ్యక్తిని పెళ్లి చేసుకుని ఉండొచ్చు అని అంటున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..