Video Viral: పెళ్లిలో సీన్ రివర్స్.. తళుక్కుమందమనుకున్నారు.. బొక్కబోర్లా పడ్డారు.. వీడియో వైరల్..

|

Nov 16, 2021 | 5:19 PM

పెళ్లి ప్రతి ఒక్కరి జీవితంలో ప్రత్యేకమైన రోజు. తమ పెళ్లి వేడుకలను ఎంతో ఘనంగా.. తమ జీవితకాలమంతా గుర్తుండిపోయేలా

Video Viral: పెళ్లిలో సీన్ రివర్స్.. తళుక్కుమందమనుకున్నారు.. బొక్కబోర్లా పడ్డారు.. వీడియో వైరల్..
Viral Video
Follow us on

పెళ్లి ప్రతి ఒక్కరి జీవితంలో ప్రత్యేకమైన రోజు. తమ పెళ్లి వేడుకలను ఎంతో ఘనంగా.. తమ జీవితకాలమంతా గుర్తుండిపోయేలా జరుపుకోవాలనుకుంటారు. పెళ్లిల్లో కుటుంబసభ్యులు.. బంధువులతో ఎంతో సరదగా.. డ్యాన్సులతో సంబంరంగా జరుపుకుంటారు. పెళ్లిలో ప్రతి క్షణాన్ని వీడియో. ఫోటోస్ తీసి భద్రంగా జరుపుకుంటారు. ఇక మారుతున్న కాలానుగుణంగానే పెళ్లి సంప్రదాయం కూడా మారిపోయింది. అందరూ ట్రెండీగా ఆలోచిస్తున్నారు. ఇక సోషల్ మీడియా పుణ్యామా అని.. పెళ్లి వేడుకలలో కాస్త వెరైటీగా ఉండేలా చూసుకుంటున్నారు. ఇతరులను చూసి తమ వివాహ వేడుకలు కూడా కాస్త ఢిపరెంట్ గా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. అయితే ఇలా ప్లాన్ చేసిన వారిలో కొందరు సక్సెస్ అవ్వగా.. మరికొందరు ప్లాప్ అవుతున్నాయి. ఈ క్రమంలో ఆ వెరైటీ ప్రయోగాలు బెడిసి కొడుతున్నాయి.

ఇటీవల పెళ్లికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడయాలో తెగ వైరల్ అవుతున్నాయి. అందులో కొన్ని సరికొత్త ఆలోచనలతో ఎంతో ఆసక్తిగా ఉండగా.. మరికొన్ని నవ్వులు పూయిస్తాయి. తాజాగా పెళ్లిలో ఓ వెరైటీ ప్రయోగం బెడిసి కొట్టింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది. వధువరులిద్దరు తమ పెళ్లి వేడుకగా జీవితంలో మర్చిపోలేనిదిగా ఉండాలని కోరుకున్నారు. ఈ క్రమంలో పెళ్లి మండపానికి ప్రత్యేకంగా చేరుకోవాలనుకున్నారు. అందులో భాగంగా.. ఒక టేబుల్ ఏర్పాటు చేశారు.. ఆ టేబుల్ ను గాలిలో ఒక వాహనం సహయంతో పైకి ఎత్తేలా ఏర్పాట్లు చేశారు. ఇక గాలిలో వస్తున్న ఆ వధువరులను చూసి బంధువులు.. స్నేహితులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. అందరు ఎంతో సంతోషంతో.. కేరింతలతో వారిద్దరికి స్వాగతం పలుకుతున్నారు. అంతా సవ్యంగా జరుగుతుందనుకున్న క్రమంలో ఊహించని ఘటన జరిగింది. వధువరులు ప్రయాణిస్తున్న బల్ల ఒక్కసారిగా అదుపుతప్పింది. దీంతో వధువరులిద్దరు కింద పడిపోయారు. దీంతో అక్కడున్నవారంత షాకయ్యారు. వెంటనే అక్కడకు వచ్చి వారిద్దరి పైకి లేపారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ ఫన్నీ వీడియో చూసిన నెటిజన్స్ పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

Also Read: Kajal Aggarwal: భర్త కోసం కీలక నిర్ణయం తీసుకున్న టాలీవుడ్ చందమామ.. కాజల్ డెసిషన్ ఏంటంటే..

Lavanya Tripathi: మహేశ్ సరసన అందాల రాక్షసి..  లక్కీ ఛాన్స్ అందుకున్న లావణ్య త్రిపాఠి ?..