సాధారణంగా పిల్లలు స్కూల్ డుమ్మా కొట్టేందుకు కాలు నొప్పి, కడుపు నొప్పి, తలనొప్పి అంటూ చిన్న చిన్న అబద్ధాలు చెబుతుంటారు. అయితే ఇప్పుడు కాలం మారిపోయింది. పెరుగుతోన్న టెక్నాలజీ సహాయంతో పిల్లలు స్కూల్ బంక్ కొట్టేందుకు కొత్త మార్గాలను ఎంచుకుంటున్నారు. తాజాగా కొందరు టీనేజర్స్ పాఠశాలలకు బంక్ కొట్టేందుకు సాధ్యం కానీ పనిని సుసాధ్యం చేసి చూపించారు. అదేంటో చూస్తే మీరు కూడా ఆశ్చర్యపోతారు.
యూకేకు చెందిన కొంతమంది టీనేజర్స్ పాఠశాలలకు డుమ్మా కొట్టేందుకు టెక్నాలజీని ఉపయోగించారు. కోవిడ్ నిర్ధారణ పరీక్షలను ఎలా ఫేక్ చేయాలని తెలుసుకోవడమే కాకుండా.. సోషల్ మీడియా ద్వారా ఆ చిట్కాలను అందరికీ తెలియజేశారు. ర్యాపిడ్ యాంటీజెన్ కిట్‌పై నిమ్మరసంతో పాటు కోకా కోలా, వెనిగర్, సిట్రస్ ద్రవాలను వేయడం వల్ల కోవిడ్ పాజిటివ్ వస్తుందని ఆ స్టూడెంట్స్ తెలుసుకోవడమే కాకుండా.. ఆ ప్రక్రియను ఎలా చేయాలన్నది వివరిస్తూ వీడియోలు చేసి టిక్‌టాక్‌లో పోస్ట్ చేశారు. వాటికి లక్షల్లో వ్యూస్, వేలల్లో లైకులు వస్తున్నాయని యూకేకి చెందిన ఐన్యూస్ ఓ నివేదికలో వెల్లడించింది.
కాగా, యూకేలో మరోసారి కరోనా విజృంభిస్తోంది. థర్డ్ వేవ్ వ్యాప్తితో అక్కడ రోజూవారీ కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. కొంతమంది పిల్లలు ఇలా నకిలీ కోవిడ్ రిపోర్ట్‌లను చూపించి స్కూళ్లకు బంక్ కొడుతుండగా.. మరికొందరు విద్యార్ధులు నిజంగానే కరోనా బారిన పడుతున్నారని అసోసియేషన్ ఆఫ్ స్కూల్ అండ్ కాలేజీ లీడర్స్ ప్రధాన కార్యదర్శి జెఫ్ బార్టన్ తెలిపారు.
Also Read:
రోజూ ఎన్ని బాదంపప్పులు తినాలి.? అతిగా తింటే ఏమవుతుంది.! ఈ విషయాలు తెలుసుకోండి
వామ్మో.. మొసలితో ఆ పిచ్చి గేమ్స్ ఏంటి అమ్మాయి.? వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే.!
ఈ ఫ్యాన్సీ నెంబర్‌కు క్రేజ్ మాములుగా లేదు.. ఏకంగా రూ. 7.6 లక్షలకు అమ్ముడైంది.!