మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం.. శరీరానికి మాత్రమే కాదు.. జేబుకు కూడా చిల్లు పెడుతుంది. ఆర్ధిక ఇబ్బందులను కలిగిస్తుంది. మద్యం వల్ల కుటుంబం నాశనం అయిన వార్తల గురించి వింటూనే ఉన్నాం. అయితే మద్యం అలవాటుతో ఫేట్ మారిన వ్యక్తి ఉన్నాడని మీకు తెలుసా. మద్యం సేవించడం వల్ల ధనవంతుడయ్యాడు. ఇది ఎవరికైనా కొంచెం వింతగా అనిపించవచ్చు. కానీ ఇది పూర్తిగా నిజం.
బ్రిటన్ నివాసి 65 ఏళ్ల నిక్ వెస్ట్.. గత 42 సంవత్సరాలుగా బీర్ క్యాన్లను సేకరిస్తున్నాడు. ఈ అభిరుచి కారణంగా నిక్ వెస్ట్ ఇంట్లో 10,300 డబ్బాలు పేరుకుపోయాయి. వాటిలో కొన్ని చాలా అరుదుగా దొరికే బీరు క్యాన్స్ కూడా. నిక్ వెస్ట్ 16 ఏళ్ల వయసులో స్టాంపులు, ఇతర వస్తువులను సేకరించడం మొదలు పెట్టినట్లు.. ఇలా సేకరించడం తనకు చాలా ఇష్టం అని వెస్ట్ తెలిపారు. ఈ క్రమంలో స్నేహితులతో కలిసిమద్యం తాగే అలవాటు చేసుకున్నాడు. క్రమంగా మద్యానికి బానిసై బీరు విపరీతంగా తాగడం మొదలుపెట్టినట్లు చెప్పాడు.
అయితే అలా బీరు తాగుతూ..ఖాళీ బీర్ క్యాన్లను ఒక చోట దాచడం మొదలు పెట్టాడు. ఇలా చేయడం అతనికి చాలా ఆనందాన్ని ఇచ్చింది. అయితే ఈ హాబీల వల్ల నిక్ వెస్ట్ గది చిన్నది అయిపొయింది. దీంతో తన అలవాటుని వదులు కోలేక ఉన్న ఇంటిని వదిలి వేరే కొత్త ఇంటికి మారాల్సి వచ్చింది. తన అభిరుచిని నెరవేర్చుకోవడానికి కొత్త 5 బెడ్‌రూమ్‌ల ఇంటిని అద్దెకు తీసుకున్నాడు. అయితే ఉద్యోగం నుంచి పదవీ విరమణ తీసుకున్న తర్వాత డబ్బు ఇబ్బంది మొదలైంది. మరోవైపు తాను తగిన బీరు క్యాన్స్ ను పెట్టేందుకు స్థలం లేదు. దీంతో తాను దాచిన వేస్ట్ మెటిరీయల్ లో కొన్నింటిని విక్రయించాలని నిర్ణయించుకున్నాడు. మొదటి 6000 డబ్బాలను అమ్మగా $13500 అంటే మన దేశ కరెన్సీలో రూ. 14 లక్షలు వచ్చాయి. ఎందుకంటే ఈ డబ్బాలన్నీ చాలా ప్రత్యేకమైనవి.
దీని తర్వాత నిక్ వెస్ట్ ఇటలీలోని బీర్ క్యాన్ డీలర్‌లకు 1,800 డబ్బాలను విక్రయించాడు. అప్పుడు $12,500 (రూ. 10,43,526) అందుకున్నాడు. అయితే నిక్ వెస్ట్ దాచిన డబ్బాల్లో చాలా వరకు బ్రిటిష్ మ్యూజియంకు విరాళంగా ఇచ్చాడు. అంతేకాదు తన దగ్గర మూడు బీరు క్యాన్స్ ఉన్నాయని అవి చాలా అరుదుగా డబ్బాలు కనిపిస్తాయని పేర్కొన్నాడు. వాటి మీద డిజైన్, సరళత తనకు ఎంతగానో నచ్చిందని అందుకనే వాటిని తాను దాచుకున్నట్లు వెల్లడించాడు. నిక్ వెస్ట్ ఇంకా మాట్లాడుతూ తన దగ్గర ఉ న్న పురాతన బీర్ 1936 నాటిది. ఇది చాలా బాగుందని చెప్పాడు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..