Traffic Challan: డ్రైవింగ్ చేసేటప్పుడు ట్రాఫిక్ రూల్స్ పాటించడం తప్పనిసరి. ట్రాఫిక్స్ నిబంధనలు ఉల్లంఘించిన వారు ఖచ్చితంగా శిక్షార్హులే.. అయినప్పటికీ కొందరు చాలాసార్లు ట్రాఫిక్ రూల్స్‌ని అతిక్రమిస్తూ..పెనాల్టీలు చెల్లిస్తూ ఉంటారు… కొందరు అత్యవసరంగా తప్పని పరిస్థితుల్లో రూల్స్ పాటించకుండా ప్రవర్తిస్తుంటే…మరికొందరు కావాలనే నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తూ ట్రాఫిక్ రూల్స్‌ని బ్రేక్ చేస్తుంటారు. అయితే, ఓ యువతి కూడా డ్రైవింగ్ సమయంలో ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించింది. అది కూడా ఒకసారి రెండుసార్లు, మూడు సార్లు కాదు.. మూడు నెలల కాలంలో 33 సార్లు ట్రాఫిక్ నిబంధనలను అతిక్రమించింది. దాంతో ఆమెకు ట్రాఫిక్ పలు సందర్భాల్లో ట్రాఫిక్ అధికారులు విధించిన ఛాలన్ ఎంతో తెలుసా? ఆమె కట్టాల్సిన ఫైన్‌తో ముంబై-పూణెలో ఓ ఇంటినే కొనుగోలు చెయొచ్చట..ఇది వింటే ఎవరికైనా పిచ్చెక్కిపోతుంది. ఆమె పెనాల్టీగా అంత చెల్లించాల్సి ఉందిట.. పూర్తి వివరాల్లోకి వెళితే..
ఆ అమ్మాయి పేరు ఆన్ మేరీ క్యాష్. ఈ యువతి డ్రైవింగ్ నైపుణ్యంతో ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఆమె కారు డ్రైవ్ చేసే విధానం జనాలకు నచ్చికాదు..ఆమె చేసే చెత్త, భయానక డ్రైవింగ్ కారణంగా ఆమె సంచలనంగా మారింది. బ్రిటన్‌లోని కార్డిఫ్‌లో నివసించే ఈ యువతి వేగంగా డ్రైవ్ చేయాలనుకుంటుంది. తన కోరికలు తీర్చుకోవడానికి ఆమె 33 సార్లు ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించింది. ట్రాఫిక్ రూల్స్‌ని బ్రేక్ చేస్తూ..ఎప్పటికప్పుడు పారిపోయింది. అక్కడే పోలీసులే లేకుంటే తననేవరూ పట్టించుకుంటారులే అనుకుంది.
కానీ, ఆమె చేసిన బీభత్సకరమైన డ్రైవింగ్ ఆయా రోడ్లలోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డయింది. గత 3 నెలల్లో, ఆమె 33 సార్లు నిబంధనలను ఉల్లంఘించింది. దాంతో ఆమెకు 25,000 అమెరికన్ డాలర్లు అంటే రూ.26 లక్షల జరిమానా విధించారు. అంతే కాదు వచ్చే 18 నెలల పాటు ఆమె డ్రైవింగ్ చేయకూడదని కండీషన్ పెట్టారు. కాదని కారు బయటకు తీస్తే..ఆమెకు ఐదేళ్ల జైలు శిక్ష తప్పదని హెచ్చరించారు. మేరీ నిస్సాన్ ఎక్స్-ట్రైల్ నడుపుతోంది. దాంతో ఆమె కారును కూడా జప్తు చేశారు పోలీసులు. పైగా సదరు యువతికి డ్రైవింగ్ లైసెన్స్ కూడా లేదని విచారణలో తేలింది.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ ఇక్కడ క్లిక్ చేయండి