బైక్‌పై వెళ్లేటప్పుడు వీధికుక్కలు వెంబడిస్తున్నాయా.? భయం వద్దు.. ఈ ట్రిక్ పాటిస్తే చాలు..

|

Jun 07, 2024 | 5:29 PM

ఇటీవలి కాలంలో ఎక్కడ చూసినా వీధికుక్కల బెడద ఎక్కువైంది. దీంతో పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ రోడ్డుపై స్వేచ్ఛగా తిరిగేందుకు ఇబ్బందులు పడుతున్నారు. అంతేకాదు.. కొన్ని ప్రాంతాల్లో అయితే.. ఈ వీధి కుక్కల బెడద వల్ల పిల్లలు సాయంత్రం వేళ.. తమకు స్థానికంగా ఉన్న పార్కుల్లో..

బైక్‌పై వెళ్లేటప్పుడు వీధికుక్కలు వెంబడిస్తున్నాయా.? భయం వద్దు.. ఈ ట్రిక్ పాటిస్తే చాలు..
Stray Dogs
Follow us on

ఇటీవలి కాలంలో ఎక్కడ చూసినా వీధికుక్కల బెడద ఎక్కువైంది. దీంతో పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ రోడ్డుపై స్వేచ్ఛగా తిరిగేందుకు ఇబ్బందులు పడుతున్నారు. అంతేకాదు.. కొన్ని ప్రాంతాల్లో అయితే.. ఈ వీధి కుక్కల బెడద వల్ల పిల్లలు సాయంత్రం వేళ.. తమకు స్థానికంగా ఉన్న పార్కుల్లో సైతం ఆడుకోవాలంటేనే భయపడుతున్నారు. మరి వీధికుక్కల దాడి నుంచి ఎలా తప్పించుకోవాలి.? అవి దాడి చేసినప్పుడు ఏమి చేయాలి? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందామా..

సాధారణంగా పిల్లలు ఒంటరిగా రోడ్డుపైకి వచ్చినా.. నడుస్తున్నా.. వీధికుక్కలు దాడి చేస్తున్నాయి. కాబట్టి పిల్లలను ఒంటరిగా ఎక్కడికీ వెళ్లనివ్వకండి. వారిని బయటకు పంపించే క్రమంలో.. పిల్లలతో ఎవరొకరు ఉండాలని నిర్ధారించుకోండి. ఇక పెద్దలు అయితే.. రోడ్డుపై వెళ్లేటప్పుడు తమతో పాటు ఒక కర్రను చేతిలో పెట్టుకోవడం మంచిది. ఆ కర్రను చూసి వీధికుక్కలు దాడుసుకుని మన దగ్గరకు రాకుండా ఉంటాయి. ఇక మీరు రోడ్డుపై నడుస్తున్నప్పుడు కుక్క మీ వద్దకు వస్తే, దాన్ని చూసి భయపడకండి. అలాగే వాటిని చూసి పరిగెత్తకండి. మీరు భయపడకుండా.. గట్టిగా ఉండండి. మీద.. మీదకు రావడానికి ప్రయత్నిస్తే.. కర్రో.. రాయో విసరండి..

ఇది చదవండి: హైదరాబాద్‌లోని రియల్ ఎస్టేట్‌కి హాట్ కేకుల్లా ఇప్పుడీ ప్రాంతాలు.. మరో మాదాపూర్ అవ్వడం ఖాయం.!

ఇవి కూడా చదవండి

మిమ్మల్ని మీరు ఎలా రక్షించుకోవాలి?

కుక్క కాటు నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకునేందుకు ఒక మంచి టెక్నిక్.. మీ చేతిలో ఉన్న వస్తువు లేదా క్లాత్‌ను కుక్క కళ్లపై విసిరేయడం. అంటే మీరు మీ చొక్కా లేదా స్కార్ఫ్, దుప్పటా ఇలా ఏదైనా వాటిపైకి విసిరేయవచ్చు. తద్వారా వెంటనే అక్కడి నుంచి తప్పించుకోగలరు. మీరు ఎవరినైనా వీధి కుక్కలా నుంచి రక్షించేందుకు ప్రయత్నిస్తే.. చేతిలో ఏదైనా ఉండేలా చూసుకోండి. కొన్ని కుక్కలు వాటిపై నీళ్లు చల్లితే పారిపోతాయి. ఇదే కాదు కుక్క ముక్కు లేదా కళ్లను గుడ్డతో కప్పడానికి ప్రయత్నించండి, ఎందుకంటే అవి దాని వీక్ పాయింట్స్. ఇలా చేయడం ద్వారా మీరు వాటి దృష్టిని మరల్చవచ్చు.

కుక్కలు మీ వాహనాన్ని వెంబడిస్తుంటే..?

సాధారణంగా మీరు బైక్‌పై వెళ్లేటప్పుడు అప్పుడప్పుడూ కుక్కలు మీ వాహనాన్ని వెంబడిస్తాయి. అలాంటి సమయంలో మీరు భయపడవద్దు. వాహనాన్ని స్పీడ్‌గా పోనివ్వకండి. స్పీడ్‌గా పోతే.. వాటికీ అనుమానమొచ్చి.. ఇంకా మీద మీదకు దూకుడుగా వస్తాయి. వాహనం స్పీడ్ తగ్గిస్తే.. కుక్కలు ప్రమాదం లేదని భావించి వెనక్కి తగ్గుతాయి. అంతేకాదు మనం వేసుకున్న దుస్తుల రంగులు నచ్చకపోయినా, కళ్లు జోళ్లు పెట్టుకున్నా, మనం వింతగా కనిపించినా.. కుక్కలు వెంటాడే ప్రమాదం ఉంటుంది. అందుకే మనం స్లోగా వెళ్తే.. అవి స్లో అవుతాయి..

ఇది చదవండి: పురావస్తు తవ్వకాల్లో బయటపడింది చూడగా స్టన్.! దెబ్బకు కళ్లు జిగేల్.. అదేంటంటే

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి