Watch: మియామి ఈవెంట్‌లో డాన్స్‌ చేసిన ట్రంప్‌.. నెట్టింట దుమ్మురేపుతున్న వీడియో వైరల్

ట్రంప్ ప్రదర్శనకు పెద్ద ఎత్తున హర్షధ్వానాలు వెల్లువెత్తాయి. యువ పురుష ఓటర్లలో ఆయనకున్న ప్రజాదరణను ఇది హైలైట్ చేసింది. ఆయన కుటుంబం, ముఖ్య సహాయకులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ట్రంప్ తిరిగి అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఆయన నిర్వహిస్తున్న బహిరంగ ప్రదర్శనలలో ఈ కార్యక్రమం ఒక భాగం.

Watch: మియామి ఈవెంట్‌లో డాన్స్‌ చేసిన ట్రంప్‌.. నెట్టింట దుమ్మురేపుతున్న వీడియో వైరల్
Trump Dances

Updated on: Apr 13, 2025 | 2:07 PM

ఫ్లోరిడాలోని మియామిలో ఆదివారం నిర్వహించిన UFCలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సందడి చేశారు. అభిమానులు ట్రంప్ క్యాప్‌లు ధరించి.. ఆయనకు ఘన స్వాగతం పలకడంతో ట్రంప్‌ తన స్టైల్లో అభిమానులతో కలిసి కాలు కదిపారు. ఆయనతో పాటు ఎలాన్‌ మస్క్‌, రాబర్ట్ ఎఫ్. కెన్నెడీ, కాష్ పటేల్, మార్కో రూబియో, తులసీ గబ్బార్డ్‌, ట్రంప్‌ మనవరాలు కాయ్‌ ట్రంప్‌ తదితరులు సందడి చేశారు. ట్రంప్ అరీనాలోకి అడుగుపెట్టగానే జనం స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారు. ఆయనతో పాటు UFC CEO డానా వైట్ కూడా ఉన్నారు. కాగా డాన్స్‌ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

వీడియో ఇక్కడ చూడండి..

ట్రంప్ ప్రదర్శనకు పెద్ద ఎత్తున హర్షధ్వానాలు వెల్లువెత్తాయి. యువ పురుష ఓటర్లలో ఆయనకున్న ప్రజాదరణను ఇది హైలైట్ చేసింది. ఆయన కుటుంబం, ముఖ్య సహాయకులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ట్రంప్ తిరిగి అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఆయన నిర్వహిస్తున్న బహిరంగ ప్రదర్శనలలో ఈ కార్యక్రమం ఒక భాగం.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..