Viral Photo: ఈ ఫోటోలో మీరు మొదటిగా చూసేది.. మీ అతిపెద్ద భయం.. అదేంటో తెలుసుకోండి!

ఈ ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు మాత్రం ఓ వ్యక్తి వ్యక్తిత్వాన్ని అంచనా వేసేందుకు బాగా ఉపయోగపడతాయి. వీటిని సైకాలజిస్టులు విరివిగా వినియోగిస్తారు.

Viral Photo: ఈ ఫోటోలో మీరు మొదటిగా చూసేది.. మీ అతిపెద్ద భయం.. అదేంటో తెలుసుకోండి!
Optical Illusion
Follow us
Ravi Kiran

|

Updated on: Jun 01, 2022 | 9:29 PM

ఆప్టికల్ ఇల్యూషన్.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఇంటర్నెట్ ఓపెన్ చేస్తే చాలు.. ప్రతీ చోటా ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలే కనిపిస్తున్నాయి. అందులో ఉన్నది ఏంటో కనిపెట్టాలని ఒకరు అంటుంటే..? మీ వ్యక్తిత్వాన్ని తెలుసుకోవాలని మరొకరు సవాల్ విసురుతారు. ఏది ఏమైనా ఈ ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు మాత్రం ఓ వ్యక్తి వ్యక్తిత్వాన్ని అంచనా వేసేందుకు బాగా ఉపయోగపడతాయి. వీటిని సైకాలజిస్టులు విరివిగా వినియోగిస్తారు.

మీరెప్పుడూ ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాల ద్వారా వ్యక్తిత్వాన్ని తెలుసుకునే ప్రయత్నం చేసి ఉంటారు.? మరి ఎప్పుడైనా వీటి ద్వారా మీలోని అతిపెద్ద భయాన్ని తెలుసుకున్నారా.? అయితే ది మైండ్స్ జర్నల్ ప్రకారం.. ఈ ఆప్టికల్ ఇల్యూషన్ ఆ విషయాన్ని చెబుతుంది. లేట్ ఎందుకు మీరు నిశితంగా పైన పేర్కొన్న ఫోటోను గమనించండి.. మొదటిగా ఏం చూశారో చెప్పండి.. వాటి వెనుక ఉన్న కథలను తెలుసుకోండి.

ఇవి కూడా చదవండి

అమ్మాయి:

పైన పేర్కొన్న ఫోటోలో మొదటిగా మీరు అమ్మాయిని చూసినట్లయితే.. మీ భయాలకు మూలం చిన్నతనం నుంచి అణిచివేయబడిన భావోద్వేగాలు. ‘పిల్లలు.. తన చిన్నతనంలో జరిగిన అనేక సంఘటనల ద్వారా భయానికి లోనవుతుంటారు. అవి వారికి యుక్తవయస్సు వచ్చేసరికి భయాలుగా, వ్యసనాలుగా బయటపడతాయి. ఒకవేళ మీ తల్లికి దూరంగా ఉన్నా.. మీరు చిన్నతనంలో ఒంటరితనాన్ని అనుభవించినా.. అది మీలో తెలియని భయాన్ని సృష్టిస్తుంది’. వీరికి అతిపెద్ద భయం.. నిర్ణయం తీసుకోవడం లేదా బాధ్యతను స్వీకరించడం..

సీతాకోకచిలుక:

మీరు మొదటిగా సీతాకోకచిలుకను చూసినట్లయితే.. మీకు అతిపెద్ద భయం.. ప్రాణభయం లేదా అవకాశాలు కోల్పోతున్నామనే భయం. దానికి అర్ధం.. సీతాకోకచిలుక అనేది సానుకూలతకు చిహ్నం లాంటిది, కానీ అందులో లోతైన, నిగూఢమైన అర్ధాన్ని కలిగి ఉంటుంది. అవి మీ కలలో కనిపించినట్లయితే.. మార్పును, సరికొత్త ప్రారంభాన్ని సూచిస్తాయి.

స్ట్రాబెర్రీ:

ఈ ఆప్టికల్ ఇల్యూషన్‌లో మీరు స్ట్రాబెర్రీని చూసినట్లయితే.. మీకు ప్రేమ పట్ల ఉన్న అతిపెద్ద భయాన్ని అది వ్యక్తపరుస్తుంది. స్ట్రాబెరీలన్నవి ప్రేమకు చిహ్నాలు అని మైండ్స్ జర్నల్‌లో ఓ కథనం పేర్కొంది. పురాణాల ప్రకారం.. అడోనిస్ మరణం తర్వాత దేవత వీనస్ కంటి నుంచి వచ్చిన ఓ కన్నీటి బొట్టు.. నేలపై పడిన వెంటనే స్ట్రాబెర్రీలు ఉద్బవించాయని పేర్కొంది.