పెంపుడు కుక్కకు గ్రాండ్‌గా సీమంతం.. అదిరిపోయే వంటకాలు, ఆహారపదార్థాలు.. ఆశ్చర్యపోయిన జనం..

|

Mar 05, 2022 | 8:00 PM

విశ్వాసానికి మారుపేరుగా నిలిచే కుక్కలంటే చాలామంది అమితమైన ప్రేమ చూపిస్తారు. వాటిని తమ సొంత కుటుంబ సభ్యుల్లా చూసుకుంటారు.

పెంపుడు కుక్కకు గ్రాండ్‌గా సీమంతం.. అదిరిపోయే వంటకాలు, ఆహారపదార్థాలు.. ఆశ్చర్యపోయిన జనం..
2
Follow us on

విశ్వాసానికి మారుపేరుగా నిలిచే కుక్కలంటే చాలామంది అమితమైన ప్రేమ చూపిస్తారు. వాటిని తమ సొంత కుటుంబ సభ్యుల్లా చూసుకుంటారు. వాటికి ఏ చిన్న సమస్య కలిగినా అల్లాడిపోతుంటారు. ఈక్రమంలో ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్న పెంపుడుకుక్కకు వేడుకగా సీమంతం నిర్వహించారు తిరుపతికి చెందిన దంపతులు. కుక్కే కదా అని ఏదో సాదాసీదాగా ఈ కార్యక్రమం చేశాడనుకుంటే మీరు పొర‌పాటు ప‌డినట్లే. గర్భిణులకు ఎలాగైతే సీమంతం చేస్తారో అలాగే బంధుమిత్రుల మ‌ధ్య అంగ‌రంగ‌ వైభవంగా కుక్కకు సీమంతం నిర్వహించాడు. చిత్తూరు జిల్లా తిరుపతి నగరంలోని కోలా వీధిలో ఈ వేడుక జరిగింది. సత్యనారాయణ రాధసుధా అనే జంతు ప్రేమికులు ఈ కార్యక్రమం నిర్వహించారు. తమ కన్న బిడ్డలకు ఎలాగైతే సీమంతం చేసారో అదే రీతిలో ఇంట్లోని పెంపుడు కుక్కకు వేడుకగా సీమంతం నిర్వహించి అందరినీ ఆశ్చర్యపరిచారు.

ఇన్విటేషన్‌ కార్డులతో ఆహ్వానం..
ఇందుకోసం ముందుగానే ఇన్విటేషన్ కార్డులను ముద్రించి బంధుమిత్రులకు ఆహ్వానం పంపారు సత్యనారాయణ రాధసుధా . శ్రీమంతానికి రావాలని కబురు పంపారు. ఇక వేడుకల్లో భాగంగా కుక్కకి సంప్రదాయ వస్త్రాలు తొడిగించారు. పూలు, బంగారు గాజులతో ఎంతో అందంగా అలంకరించారు. అంతేకాదు వేడుకకు హాజరైన వారికి అదిరిపోయే వంటకాలు, ఆహార పదార్థాలు సిద్ధం చేశారు. గత నెల 14న సత్యనారాయణ రాధసుధా దంపతులు, కుమార్తెలతో కలిసి కుక్కకు సీమంతం నిర్వహించగా మూడు రోజుల క్రితం అది 5 పిల్లలకు జన్మ నిచ్చింది. కాగా కుక్కకు సీమంతం చేసి స్థానికంగా టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యారు సత్యనారాయణ దంపతులు. కాగా ఇలాంటి ఘటనే గతేడాది త‌మిళ‌నాడులోని మ‌దురై జిల్లాలో జరిగింది. జైహింద్‌పురంలో నివ‌సించే శ‌క్తివేల్ అనే పోలీస్ ఆఫీస‌ర్ తన పెంపుడు కుక్కకు ఇలాగే సంప్రదాయబద్ధంగా సీమంతం నిర్వహించారు.

– ఎంపీఆర్ రాజు, తిరుపతి..

Also Read:Finger millet: ఏంటి మీ డైట్‌లో రాగి లేదా..? అయితే మీరు చాలా కోల్పోతున్నారు.. ఎన్నో ఉపయోగాలు

Aadavallu Meeku Johaarlu : రిలీజ్‌కు ముందు మేము చెప్పిందే ఇప్పుడు జరిగింది: శర్వానంద్

KTR: నేనూ బాధితుడినే.. ఓపెన్ అయిన కేటీఆర్.. ఆశ్చర్యపోయిన జనం..