మహారాష్ట్రలోని భండారా-గోండియా హైవేపై దారుణ ఘటన చోటుచేసుకుంది. నావెగావ్ నగ్జీరా శాంక్చువరీ సమీపంలో అర్ధరాత్రి వేళ రోడ్డు దాటుతున్న ఓ పులిని కారు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పులి తీవ్రంగా గాయపడింది. దాని ముందు కాళ్లు రెండు నుజ్జునుజ్జయ్యాయి. దీంతో ఆ పులి బాధతో విలవిల్లాడుతూ.. వెనక కాళ్లతోనే రోడ్డుపై ఈడ్చుకుంటూ ఆ పక్కనున్న పొదల్లోకి వెళ్లి పడిపోయింది. చివరకు మృతి చెందింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు, జంతు ప్రేమికులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆ వెనకాలే మరో కారులో వస్తున్న ఓ వ్యక్తి ఈ ప్రమాదాన్ని వీడియో తీసి తన ‘ఎక్స్’ ఖాతాలో షేర్ చేశాడు. గాయపడ్డ పులిని కాపాడేందుకు నాగ్ పూర్‌లోని ఆసుపత్రికి తరలిస్తుండగా దారిలోనే కన్నుమూసిందని పేర్కొన్నాడు.
కేవలం 19 సెకన్ల ఈ వీడియో చాలా బాధాకరం. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఇది X యొక్క హ్యాండిల్ @Prateek34381357లో షేర్ చేయబడింది. ఈ వీడియోలో గాయపడిన పులి రోడ్డుపై నుంచి అడవిలోకి వెళ్లేందుకు ప్రయత్నించడం హృదయవిదారకంగా కనిపించింది. తీవ్ర గాయాలు కావడం వల్ల అది పడుతూ లేస్తూ ముందుకు కదిలింది. దాన్ని ఆ పరిస్థితుల్లో చూసిన నెటిజన్లు అయ్యో పాపం అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
This happened on Bhandara – Gondia highway which runs through the Navegaon Nagzira sanctuary, A high speeding Creta vehicle hit a adult male tiger which was crossing the road, injured animal was rescued and was being shifted to Nagpur for treatment but died before reaching… pic.twitter.com/WxzEOwtqeU
— Prateek Singh (@Prateek34381357) May 21, 2024
ఈ ఘటన మహారాష్ట్ర ప్రజల్లో ఆందోళన కలిగించింది. రోడ్డు దాటుతున్న వన్యప్రాణులను రక్షించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..