AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch: ఆకలిమీదున్న పెద్ద పులి.. అమాంతం కొండచిలువను తినేసింది..! ఆ తర్వాత దాని అవస్థలు..

చాలా ఆకలిగా ఉన్న పులి ఎదురుగా కనిపించిన ఎరను వెంటనే తినేసింది..ఆకలి తీర్చుకునే ఆనందంతో ఆ పులి ఏకంగా కొండ చిలువ పామును తినడం ప్రారంభించింది. కానీ, దానిని తిన్న కొంత సమయం తరువాత పులి ఆరోగ్యం క్షీణించడం ప్రారంభమైంది. అది తిన్న ఆహారాన్ని వెంటనే వాంతి చేసుకుంది. వాంతులు చేసుకున్న తర్వాత

Watch: ఆకలిమీదున్న పెద్ద పులి.. అమాంతం కొండచిలువను తినేసింది..! ఆ తర్వాత దాని అవస్థలు..
Tiger Eats Python
Jyothi Gadda
|

Updated on: Apr 20, 2025 | 8:34 PM

Share

పులులు, కొండచిలువలు రెండూ ప్రమాదకరమైన జీవులు. జంతువులు ఆకలిగా ఉన్నప్పుడు వేటాడటం చూడటం ఆనందంగా ఉంటుంది. కానీ కొన్నిసార్లు వాటి ఆహారం కూడా ప్రాణాంతకం కావచ్చు. దీనికి స్పష్టమైన ఉదాహరణ ఉత్తరప్రదేశ్‌లోని పిలిభిత్ టైగర్ రిజర్వ్‌లో జరిగిన సంఘటన. పిలిభిత్ టైగర్ రిజర్వ్‌లో ఆకలితో ఉన్న పులి ఒక కొండచిలువను తినేసింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

చాలా ఆకలిగా ఉన్న పులి ఎదురుగా కనిపించిన ఎరను వెంటనే తినేసింది..ఆకలి తీర్చుకునే ఆనందంతో ఆ పులి ఏకంగా కొండ చిలువ పామును తినడం ప్రారంభించింది. కానీ, దానిని తిన్న కొంత సమయం తరువాత పులి ఆరోగ్యం క్షీణించడం ప్రారంభమైంది. అది తిన్న ఆహారాన్ని వెంటనే వాంతి చేసుకుంది. వాంతులు చేసుకున్న తర్వాత కడుపు నొప్పి తగ్గకపోవడంతో పులి సమీపంలోని గడ్డిని తినేసింది. కొండచిలువను తిన్న తర్వాత పులి ఇబ్బందుల్లో పడే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇవి కూడా చదవండి

ఈ వీడియో @RISHABH79RAAZ అనే ట్విట్టర్ ఖాతాలో షేర్ చేయబడింది. వందలాది మంది దీనిని వీక్షించారు. కొండచిలువ తినేసిన తర్వాత పులి అస్వస్థతతో ఇబ్బంది పడుతున్న దృశ్యం గురించి చాలా మంది రకరకాలుగా వ్యాఖ్యానించారు .

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..