Tiger Eating Grass: పులి రాజు అలవాటు మార్చుకుంది.. గడ్డి తింటోంది.. అవును నిజం.. ఇది శ్రావణ మాసం ఎఫెక్ట్ అనుకుంటున్నారా..

అడవికి రాజు పులి.. దాని అలవాటు వేటాడటం.. అయితే ఈ పులి మాత్రం పచ్చి గడ్డి తింటోంది. పులి అలవాటు మార్చుకుందా..

Tiger Eating Grass: పులి రాజు అలవాటు మార్చుకుంది.. గడ్డి తింటోంది.. అవును నిజం.. ఇది శ్రావణ మాసం ఎఫెక్ట్ అనుకుంటున్నారా..
Tiger Eating Grass
Follow us

|

Updated on: Aug 20, 2021 | 10:18 AM

అడవికి రాజు పులి.. దాని అలవాటు వేటాడటం.. అయితే ఈ పులి మాత్రం పచ్చి గడ్డి తింటోంది. ఏంటి ఇది నిజం కాదని అనుకుంటున్నారా.. కాదండి బాబు ఇది పచ్చి నిజం. మీరు ఫోటోలో చూస్తున్న ఈ పులి గడ్డి నిజంగా తింటోంది. అయ్యో  పులి అలవాటు మార్చుకుందా.. ఏంటి..? అని ప్రశ్నిస్తున్నారా..? పులి రాజుపై అడవిలోని జంతువులకు భయం పోతుందని ఆందోళన చెదుతున్నారా…? అలాంటి డౌట్ పెట్టుకోకుండి. అదంటే ఆ అడవిలోని జంతువులకు చచ్చేంత భయం. అది కనిపిస్తే చాలు వణికిపోతాయి.. దాని నుంచి తప్పించుకునేందుకు పరుగులు పెడుతుంటాయి. నిజానికి పులి మాంసాహార జంతువు అది తన క్రూరత్వాన్ని అత్యంత క్రూరంగా ప్రదర్శిస్తుంది. అయితే పులి గడ్డి తినడం మీరు ఎప్పుడైనా చూశారా? అవును.. ఈ ఫోటో వెనుక పెద్ద కారణం ఉంది. దాని గురించి ఇక్కడ తెలుసుకుందాం..

ఈ ఫోటోను IFS అధికారి ప్రవీణ్ కస్వాన్ ట్విట్టర్‌లో షేర్ చేశారు. క్యాప్షన్‌లో అతను ఇలా వ్రాశారు. “పులికి కడుపు నొప్పి వచ్చినప్పుడు గడ్డి తింటుంది.” ఈ వైరల్ ఫోటోలో పులి గడ్డి తింటున్నట్లు మీరు చూడవచ్చు. ఆ తర్వాత ట్వీట్‌లో ప్రవీణ్ ఇలా వ్రాశారు. ‘అన్ని రకాల పులుల కొన్ని సమయాల్లో గడ్డి తింటాయి. వాటి జీర్ణవ్యవస్థను సరి చేసుకుంటాయి.

ఈ ఫోటో సోషల్ మీడియాలో షేర్ అయిన వెంటనే నెటిజనం తమ జ్ఞానాన్ని షేర్ చేసుకోవడం మొదలు పెట్టారు. ఒక యూజర్ అవును జంతులువులు ఇలా చేస్తాయని చెప్పారు. హస్కీ కుక్కలు కూడా గడ్డి తినడానికి కారణం ఇదే. కొంతమంది మాంసాహారులకు కడుపు నొప్పి వచ్చినప్పుడు. అవి గడ్డి తింటాయి. తద్వారా వాటి కడుపు ఫ్రెష్ అవుతుంది.

శ్రావణ మాసం కావడంతో పులి తన మాంసాన్ని వదిలి.. గడ్డి తింటోందని కామెంట్ చేశారు. అయితే పులులు కూడా గడ్డి తింటాయని తమకు తెలియదని చాలా మంది చెప్పారు. IFS ప్రవీణ్ కస్వాన్ తరచుగా అడవి ప్రపంచం గురించి ఆసక్తికరమైన సమాచారాన్ని సోషల్ మీడియాలో పంచుకుంటారని నేను మీకు చెప్తాను, ప్రజలు తెలుసుకోవడం చాలా ఆశ్చర్యానికి గురిచేస్తుంది. కొంతమంది తమ భాగస్వామ్య సమాచారాన్ని ఇష్టపడతారు, అందుకే వారి భాగస్వామ్య పోస్ట్‌లు , వీడియోలు చాలా వైరల్ అవుతాయి.

ఇవి కూడా చదవండి: తాలిబన్లకు ఆ ప్రదేశం అంటే వణుకు.. కనీసం కన్నువేయడానికి కూడా వణికిపోతుంటారు.. ఎందుకో తెలుసా..

నల్లబంగారం ఎలా తయారు చేస్తారు.. గుర్తిపు పత్రం నుండి మార్కెట్ వరకు ప్రతిదీ తెలుసుకోండి..

Success Story: అబద్దం కాదు.. ఇది నిజం.. ముత్యాల సాగుతో లక్షలు ఆర్జిస్తున్న రైతు సంజయ్.. ఎక్కడో తెలుసా..