ఎంత దారుణం.. ఆరు కుక్కలను కట్టేసి గోనె సంచుల్లో కుక్కి.. అనుమానం వచ్చిన స్థానికులు అడ్డుకోవడంతో..

|

Aug 03, 2024 | 9:21 PM

అదే సమయంలో అటుగా వెళ్తున్న ఇద్దరు బాటసారులు సంచుల్లో కుక్కల శబ్దం విన్నారు. వారికి అనుమానం రావటంతో పాదచారులు బస్తాలు తెరవాలని ఒత్తిడి చేశారు.. గోనె సంచిని తెరిచి చూడగా అందులో ఆరు కుక్కలు ఉన్నాయి. ఇంతలో ఆలస్యం చేయకుండా బాటసారులు ఈ ఘటనను వీడియో తీయడంతో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఎంత దారుణం.. ఆరు కుక్కలను కట్టేసి గోనె సంచుల్లో కుక్కి.. అనుమానం వచ్చిన స్థానికులు అడ్డుకోవడంతో..
Tied Up Dogs
Follow us on

మధ్యప్రదేశ్‌లోని సత్నా జిల్లాలో ఓ షాకింగ్‌ ఘటన వెలుగులోకి వచ్చింది. ఆ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో కొంతమంది ఆరు కుక్కలను తాళ్లతో కట్టేసి గోనె సంచుల్లో ఉంచి ఆటోలో ఒక నది వంతెన వద్దకు తీసుకొచ్చారు. బస్తాలలో కట్టితెచ్చిన ఆ కుక్కలను నదిలో పడవేయబోతుండగా, కొందరు వ్యక్తులు వారిని అడ్డుకున్నారు. గోనె సంచుల్లోని కుక్కలను విడిపించి వదిలేశారు.సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. శుక్రవారం సాయంత్రం కొందరు వ్యక్తులు ఎలక్ట్రిక్‌ ఆటోలో ఒక వంతెన వద్దకు చేరుకున్నారు. కాళ్లు, నోరు కట్టేసి గోనె సంచుల్లో కుక్కిన పదికిపైగా కుక్కలను వంతెన పైనుంచి నదిలోని నీటిలో పడేసేందుకు ప్రయత్నించారు.

ఈ సంఘటన సాత్నా శివార్లలో జరిగింది. అక్కడ కొంతమంది వ్యక్తులు ఆరు కుక్కలను తాళ్లతో బంధించి గోనెసంచుల్లో కుక్కి బంధించారు. వాటిని ఈ-రిక్షాపై ఎక్కించి నదిలో విసిరే ప్రయత్నం చేశారు… అదే సమయంలో అటుగా వెళ్తున్న ఇద్దరు బాటసారులు సంచుల్లో కుక్కల శబ్దం విన్నారు. వారికి అనుమానం రావటంతో పాదచారులు బస్తాలు తెరవాలని ఒత్తిడి చేశారు.. గోనె సంచిని తెరిచి చూడగా అందులో ఆరు కుక్కలు ఉన్నాయి. ఇంతలో ఆలస్యం చేయకుండా బాటసారులు ఈ ఘటనను వీడియో తీయడంతో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇవి కూడా చదవండి

వీడియో వైరల్ కావడంతో విషయం పోలీసులకు చేరింది. అనంతరం పోలీసులు కేసు నమోదు చేసి నిందితులపై చర్యలు ప్రారంభించారు. వైరల్‌ అయిన వీడియో క్లిప్‌ ద్వారా నిందితులను గుర్తించారు. సిటీ కొత్వాలి ప్రాంతంలోని బజ్రహ తోలాలో నివసించే నందు బాసోర్, అతడి సహచరుడు ప్రదీప్ బాసోర్‌పై కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న నిందితులను అరెస్ట్‌ చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..