Viral Video: పర్యాటక బస్సును చుట్టుముట్టిన పులులు.. వీడియో చూస్తే ఖచ్చితంగా షాక్ అవ్వాల్సిందే.!

|

Jul 13, 2021 | 4:18 PM

పులిని చూస్తే అందరూ హడలిపోతారు. అది ఎరను చాలా తెలివిగా వేటాడగలడు. అడవికి రాజైన సింహానికి సైతం సమవుజ్జీగా నిలుస్తుంది...

Viral Video: పర్యాటక బస్సును చుట్టుముట్టిన పులులు.. వీడియో చూస్తే ఖచ్చితంగా షాక్ అవ్వాల్సిందే.!
Tigers
Follow us on

పులిని చూస్తే అందరూ హడలిపోతారు. అది ఎరను చాలా తెలివిగా వేటాడగలడు. అడవికి రాజైన సింహానికి సైతం సమవుజ్జీగా నిలుస్తుంది. పులి ఎదురుపడితే చాలు.. గుండె ఆగినంత పనవుతుంది. అలాంటిది ఒకేసారి మూడు పులులు దండయాత్రకు దిగితే.. ఇంకేమైనా ఉందా.! కథ కంచికి వెళ్ళినట్లే.! ఇక్కడ ఓ పర్యాటక బస్సుపై మూడు పులులు దాడి చేశాయి. వాటి మెరుపు దాడికి అందులో ఉన్న టూరిస్టులు భయపడిపోయారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

మనుషులు ఎప్పుడూ తమను తాము బలవంతులని అనుకుంటారు. కానీ జంతువుల ముందు అస్సలు కుదరదు. చాలా సందర్భాల్లో మనిషి జంతువుకు ఎర కావడం మనం చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా సింహం, పులి లాంటి క్రూర జంతువుల పేర్లు వింటేనే మనుషుల్లో ఒకింత భయం మొదలవుతుంది. వారి ముఖాముఖీ ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో ఈ వీడియోను చూడండి.

జంగిల్‌లోని ఓ ప్రదేశంలో పులులు సేద తీరుతున్నాయని.. టూరిస్టులతో నిండిన పర్యాటక బస్సు అక్కడ ఆగుతుంది. అయితే వారికి అనూహ్య పరిణామం ఎదురైంది. ఒకేసారి మూడు పులులు ఆ బస్సు మీదకు దాడికి దిగాయి. రెండు కాళ్లపై నిల్చుని టూరిస్టులను భయభ్రాంతులకు గురి చేశాయి. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది. కాగా, ఈ వీడియోను ఇండియన్ ఫారెస్ట్ ఆఫీసర్ సుశాంత్ నందా ట్విట్టర్‌లో షేర్ చేశారు. దీనిని చూసి నెటిజన్లు షాక్ అయ్యారు. ఇప్పటిదాకా ఈ వీడియోకు 27 వేలకు పైగా వ్యూస్ వచ్చాయి. లేట్ ఎందుకు మీరు కూడా ఓ లుక్కేయండి.!

Also Read:

ఈ ఫోటోలో చిరుత నక్కింది.. గుర్తించండి చూద్దాం.. చాలామంది ఫెయిల్ అయ్యారు!

కోళ్ల వెంటబడ్డ పాము.. గోరింక మెరుపు దాడి.. వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే.!

10 పరుగులిచ్చి 10 వికెట్లు.. అందులో ఓ హ్యాట్రిక్.. టెస్టుల్లో అరుదైన రికార్డు.. ఆ బౌలర్ ఎవరంటే.!

కళ్లను మాయ చేసే ఫోటో.. బల్లిని గుర్తించండి చూద్దాం.. అస్సలు ఫెయిల్ కాకూడదు.!