
ఏఐ వచ్చిన తర్వాత ఏది నిజమో ఏది అబద్దమో తెలియకుండా పోతుంది. రకరకాల వీడియోలు మనల్ని మిస్ లీడ్ చేస్తున్నాయి. తాజాగా 3 తలలు ఉన్న శ్వేతనాగు వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. దీన్ని చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. మాములుగా శ్వేతవర్ణంలో నాగుపామును మనం అరుదుగా చూస్తూ ఉంటాం. కానీ ఇక్కడ ఏకంగా 3 తలలతో ఓ శ్వేత వర్ణంలోని పాము పడగ విప్పి కనిపించింది. దీన్ని కొందరు వీడియోలు తీస్తున్నట్లు అందులో కనిపిస్తుంది
వీడియోలో ఒకే శరీరం.. మూడు వేర్వేరు తలలు ఉన్న పామును మీరు చూడవచ్చు. దానికి ప్రత్యేక పూజలు చేసినట్లుగా కూడా ఆ వీడియోలో ఉంది. ఇప్పుడు ఈ వైరల్ పాము వీడియోకు Three-Headed White Cobra అనే టైటిల్ పెట్టి నెట్టింట పోస్ట్ చేశారు. అయితే ఇది పక్కా ఫేక్ వీడియో అని మనకు ఇట్టే అర్థమయిపోతుంది. కొన్ని సందర్భాల్లో జన్యు లోపాల వల్ల రెండు తలల పాములు పుడతాయి. కానీ అలా జరగడం చాలా అరుదు. అలాంటి పాములు సాధారణంగా ఎక్కువ రోజులు బ్రతకవు. మూడు తలల పాము తారసపడినట్లు హిస్టరీలో కూడా ఎక్కడా నమోదు కాలేదు. మూడు తలల శ్వేతనాగం అనేది కేవలం పురాణాల్లో ఉన్న ప్రతీకాత్మక రూపం, నిజ జీవితంలో అసాధ్యం.
సామాన్య ప్రజలను మభ్యపెట్టి వ్యూస్ సంపాదించేందుకు.. ఇలాంటి డీప్ ఫేక్, ఏఐ వీడియోలను వైరల్ చేస్తున్నారు. కొంచెం తెలివి ఉన్నా ఇది ఫేక్ వీడియో.. ఎడిడెట్ అని గుర్తించవచ్చు.