Viral Video: అక్కడ విమానంలోంచి చేపల వర్షం కురిపించారు..! నిజమేనండోయ్‌.. !!.. అమేజింగ్ వీడియో

|

Jun 29, 2022 | 3:01 PM

ఈ మధ్య ఎక్కువగా జంతువులకు సంబంధించిన వీడియోలు ట్రెండ్ అవుతున్నాయి. ఇందులో కొన్ని ఫన్నీగా ఉంటే, మరికొన్ని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. అయితే, తాజాగా చేపలకు సంబంధించిన ఓ వీడియో ఇంటర్‌నెట్‌లో తెగ వైరల్‌ అవుతోంది.

Viral Video: అక్కడ విమానంలోంచి చేపల వర్షం కురిపించారు..! నిజమేనండోయ్‌.. !!.. అమేజింగ్ వీడియో
Fish Being Dropped
Follow us on

Viral Video Today: సోషల్ మీడియాలో ప్రతి రోజూ అనేక రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. ఈ మధ్య ఎక్కువగా జంతువులకు సంబంధించిన వీడియోలు ట్రెండ్ అవుతున్నాయి. ఇందులో కొన్ని ఫన్నీగా ఉంటే, మరికొన్ని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. అయితే, తాజాగా చేపలకు సంబంధించిన ఓ వీడియో ఇంటర్‌నెట్‌లో తెగ వైరల్‌ అవుతోంది. ఈ వీడియో అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇంతకీ విషయం ఏంటంటే..

ఆకాశం నుంచి వానపడుతుంటుంది. కానీ చేపలు పడితే ఏం జరుగుతుంది? జనాలు ఎగబడి పోరు.. ఆ చేపలను పట్టుకొని తింటారు. అయితే ఇవి నిజంగా పడలేదు. కానీ, పడేలా చేశారు. ఉటా డివిజన్ ఆఫ్ వైల్డ్‌లైఫ్ రిసోర్సెస్ షేర్ చేసిన ఈ వీడియో ఇప్పుడు ఇంటర్‌ నెట్‌ని షేక్‌ చేస్తోంది. వీడియోను చూస్తే ఓ విమానంలో తీసుకు వచ్చిన చేపలను ఆ ప్లేన్‌ అడుగు భాగంలో ఉన్న రంధ్రం ద్వారా వాటిని సరస్సులోకి వదిలారు. ఆ సీన్‌ అందరినీ ఆకట్టుకుంటోంది. ఇందుకు సంబంధించిన వీడియోను షేర్ చేశారు. ఇది వైరల్ అయింది.

అయితే, ఇదంతా ఎందుకని అధికారులను వివరణ అడుగగా.. అమెరికాలోని ఉటా రాష్ట్రంలో అక్కడి వైల్డ్ లైఫ్ రిసోర్సెస్ కొండ ప్రాంతంలో ఉన్న చెరువులో వీటిని జార విడిచారు. కొండ ప్రాంతాల్లోని చెరువుల్లో చేపల పంపకానికి ఈ పద్ధతి సులభంగా ఉండటంతో అక్కడి అధికారులు కొన్నాళ్లుగా దీనిని అనుసరిస్తున్నారు. గతంలో పాల క్యాన్లలో చేపలను వేసి వాటిని గుర్రాల పైకి తరలించి చెరువులలో వేసేవాళ్లు. కానీ అదంతా చాలా సమయం తీసుకునే ప్రక్రియ కావడంతో విమానాలను ఆశ్రయిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఈ వీడియోను ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేయగా.. నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. వెరీ ఇంటరెస్టింగ్ అంటూ ఒకరు కామెంట్‌ చేయగా, వారు అలా ఎందుకు అలా చేస్తున్నారో అర్థం కావడం లేదంటూ మరికొందరు కామెంట్‌ చేశారు. మొత్తానికి వీడియో మాత్రం నెట్టింట చక్కర్లు కొడుతోంది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి