Watch Video: వామ్మో.. నువ్‌ మనిషివేనా భయ్యా..! విపరీతమైన చలిలో చెమటలు పట్టించే వీడియో వైరల్‌..

|

Dec 05, 2023 | 12:13 PM

ఈ వ్యక్తి అద్భుతమైన ఫీట్‌ని కొందరు ప్రశంసించగా, చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అతను నిజంగా మానవుడేనా అనే సందేహం అందరిలోనూ వ్యక్తమవతుంది.? కానీ ఇది చాలా ప్రమాదకరమైన పని అని మరొక వినియోగదారు రాశారు. మూడవ వినియోగదారు అతని జంప్ అద్భుతంగా ఉందని, చాలా మంది వినియోగదారులు మనిషి ధైర్యాన్ని ప్రశంసించారు. అయితే చాలా మంది అతను చలిలో ఇలా తన ప్రాణాలను పణంగా పెట్టాడని ఆవేదనగా అంటున్నారు.

Watch Video: వామ్మో.. నువ్‌ మనిషివేనా భయ్యా..! విపరీతమైన చలిలో చెమటలు పట్టించే వీడియో వైరల్‌..
Ice Diving
Follow us on

సోషల్ మీడియా పుణ్యమా అని నిత్యం అనేక రకాల వీడియోలను వైరల్‌ అవుతున్నాయి. ఇంటర్‌నెట్‌లో ఫేమస్‌ కావాలని, రాత్రికి రాత్రే పాపులారిటీ సంపాదించుకోవాలనే లక్ష్యంతో కొందరు వ్యక్తులు ఎన్నో రకాల వింత చేష్టలు చేస్తుంటారు. అవన్నీ వీడియోలు తీసుకుని ఇంటర్‌నెట్‌లో వదులుతుంటారు. సోషల్‌ మీడియాలో వైరల్‌ కావాలనే మోజుతో ఎన్ని వింతలు చేస్తారో చెప్పడానికి ఈ వీడియో నిదర్శనం, అయితే ఈ వ్యక్తి ధైర్యం అన్ని హద్దులను దాటి మంచు కొండల్లోకి ఎక్కింది.

అసలే చలికాలం..ఈ సమయంలో చల్లటి నీళ్లను చేతితో తాకాలంటే కూడా ఒంట్లో వణుకు పుడుతుంది. కానీ, ఎముకలు కొరికే చలిలో కూడా మంచు కొండల మధ్య ఓ వ్యక్తి చేసిన ఫీట్లు అందరినీ షాక్‌ అయ్యేలా చేస్తుంది. అవును, మీరు నమ్మకపోతే ఈ వీడియో చూడండి. ఈ వీడియో చూసిన తర్వాత మీరు కూడా ఆందోళనలో పడతారు. అవును..నిజంగా అతను మనిషా? లేదా మరేదైననా అనే సందేహం వ్యక్తం చేస్తారు. ఎందుకంటే అలాంటి చల్లని వాతావరణంలో అతను కేవలం లోదుస్తులను మాత్రమే ధరించి ఉన్నాడు. అంతేకాదు, ఆ వ్యక్తి చేతిలో రెండు పెద్ద గొడ్డళ్లు పట్టుకుని ఉన్నాడు. ఎత్తైన మంచు కొండ మీదనుంచి బిగ్గరగా అరుస్తూ అతడు.. ఒక్కసారిగా కిందకు దూకేశాడు. మంచు పర్వతం క్రింద ఉన్న నీటి గుంటలో డైవ్ చేశాడు.

ఇవి కూడా చదవండి

బిల్డర్‌లా కనిపిస్తున్న ఆ వ్యక్తి ఎత్తైన మంచు పర్వతంపై నుండి దూకేస్తున్న వీడియో ట్విట్టర్‌లో వైరల్ అవుతోంది. 45 లక్షలకు పైగా నెటిజన్లు ఈ వీడియోను వీక్షించారు. దీనిపై నెటిజన్లు కూడా చాలా కామెంట్లు చేస్తున్నారు. ఈ వ్యక్తి అద్భుతమైన ఫీట్‌ని కొందరు ప్రశంసించగా, చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అతను నిజంగా మానవుడేనా అనే సందేహం అందరిలోనూ వ్యక్తమవతుంది.? కానీ ఇది చాలా ప్రమాదకరమైన పని అని మరొక వినియోగదారు రాశారు. మూడవ వినియోగదారు అతని జంప్ అద్భుతంగా ఉందని, చాలా మంది వినియోగదారులు మనిషి ధైర్యాన్ని ప్రశంసించారు. అయితే చాలా మంది అతను చలిలో ఇలా తన ప్రాణాలను పణంగా పెట్టాడని అంటున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..