మనిషిలాగే పళ్లు, పెదాలు.. చేప ఫొటోలు వైరల్‌

అచ్చు మనిషిలాగే పళ్లు, పెదాలు ఉన్న ఓ చేప ఫొటోలు ఇప్పుడు నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి.  మలేషియాలో ఈ చేపను గుర్తించిన కొంతమంది ఆ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.

  • Tv9 Telugu
  • Publish Date - 7:07 pm, Sat, 11 July 20
మనిషిలాగే పళ్లు, పెదాలు.. చేప ఫొటోలు వైరల్‌

అచ్చు మనిషిలాగే పళ్లు, పెదాలు ఉన్న ఓ చేప ఫొటోలు ఇప్పుడు నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి.  మలేషియాలో ఈ చేపను గుర్తించిన కొంతమంది ఆ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. అవి కాస్త వైరల్‌గా మారడంతో‌ నెటిజన్లు ఆశ్చర్యాన్ని వ్యక్తపరుస్తున్నారు. కొంతమంది ఆ ఫొటోకు కళ్లు, చేతులు, కాళ్లతో మార్ఫింగ్ చేస్తూ వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. కాగా ఈ చేప జాతిని ట్రిగ్గర్‌ ఫిష్ అని పిలుస్తున్నాయి. ఇవి దక్షిణ తూర్పు ఏసియన్ నీళ్లలో అరుదుగా కనిపిస్తుంటాయి. అయితే మనిషి పోలికలతో కూడిన జంతువుల ఫొటోలు గతంలో కూడా పలుమార్లు సోషల్ మీడియాలో హల్‌చల్ చేసిన విషయం తెలిసిందే.