British Empire: కోహినూర్ మాత్రమే కాదు.. మరో 4 విలవైన వస్తువులను కూడా ఎత్తుకెళ్లిన బ్రిటీషర్స్..
British Empire: క్వీన్ ఎలిజబెత్ II మృతితో బ్రిటీష్ సామ్రాజ్యం, వారి పాలన వ్యవస్థ మరోసారి ప్రధానాంశంగా మారింది. ముఖ్యంగా క్వీన్ ఎలిజబెత్ కిరీటంలోని కోహినూర్ వజ్రం..
British Empire: క్వీన్ ఎలిజబెత్ II మృతితో బ్రిటీష్ సామ్రాజ్యం, వారి పాలన వ్యవస్థ మరోసారి ప్రధానాంశంగా మారింది. ముఖ్యంగా క్వీన్ ఎలిజబెత్ కిరీటంలోని కోహినూర్ వజ్రం గురించిన ప్రస్తావన ట్రెండింగ్‌లో ఉంది. ట్విట్టర్‌లో సరికొత్త ట్రెండ్ సెట్ చేసింది. చాలా మంది నెటిజన్లు.. కోహినూర్ వజ్రాన్ని భారత్‌కు తిరిగి ఇవ్వాలిన ట్విట్టర్ వేదికగా యూకేని డిమాండ్ చేశారు. రాణి కిరీటంలో అమర్చబడిన విలువైన వజ్రం భారత్‌కి చెందినదని, తిరిగి ఇచ్చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు.. కోహినూర్ వజ్రం భారత్‌ది అని చాలా మంది విశ్వసిస్తుంటారు. అయితే, కోహినూర్ వజ్రం ప్రస్తావన నేపథ్యంలో.. బ్రిటీషర్ల పాలనలో ఇతర దేశాల నుంచి తీసుకెళ్లిన, దోచుకున్న అనేక విలువైన వస్తువుల ప్రస్తావన తెరపైకి వస్తోంది. కోహినూర్ వజ్రంతో పాటు.. ప్రపంచ వ్యాప్తంగా అత్యంత విలువైన 4 వస్తువులను కూడా బ్రిటీషర్లు దోచుకున్నట్లు చరిత్ర చెబుతోంది. మరి ఆ విలువైన వస్తువులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
1. గ్రేట్ స్టార్ ఆఫ్ ఆఫ్రికా డైమండ్..
క్వీన్ ఎలిజబెత్ అనేక విలువైన ఆస్తులలో ‘గ్రేట్ స్టార్ ఆఫ్ ఆఫ్రికా’ వజ్రం కూడా ఒకటి. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద వజ్రం. దీని బరువు 530 క్యారెట్లు. దీని విలువ సుమారు 400 మిలియన్ల అమెరికన్ డాలర్లుగా అంచనా వేయడం జరిగింది. ‘గ్రేట్ స్టార్ ఆఫ్ ఆఫ్రికా’ డైమండ్‌ను 1905లో దక్షిణాఫ్రికాలో బయటపడింది. ఆఫ్రికా నుండి దీనిని బ్రిటీషర్లు దోచుకెళ్లారు. చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం.. ఆ వజ్రాన్ని 1905లో తవ్వి ఎడ్వర్డ్ VIIకి సమర్పించారు. ఆ తరువాత ఆ వజ్రాన్ని బ్రిటీష్ ప్రభుత్వం దోచుకుంది. ప్రస్తుతం గ్రేట్ స్టార్ ఆఫ్ ఆఫ్రికా వజ్రం క్వీన్ స్కెప్టెర్‌లో ఉందని చెబుతున్నారు.
2. టిప్పు సుల్తాన్ ఉంగరం..
టిప్పు సుల్తాన్ ఉంగరాన్ని 1799లో బ్రిటీష్ వారు దోచుకున్నారు. బ్రిటీషర్లతో చేసిన యుద్ధంలో టిప్పు సుల్తాన్ ఓడిపోయిన తరువాత అతని మృతదేహం నుండి తీసుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. పలు అంతర్జాతీయ మీడియా నివేదికల ప్రకారం.. UKలో జరిగిన వేలంలో ఈ ఉంగరం దాదాపు 1,45,000 బ్రిటిష్ పౌండ్లకు గుర్తు తెలియని బిడ్డర్‌కు విక్రయించడం జరిగింది.
3. రోసెట్టా స్టోన్..
కోహినూర్‌ను తిరిగి భారతదేశానికి తీసుకురావాలనే పిలుపు నేపథ్యంలో.. ఈజిప్టు కార్యకర్తలు, పురావస్తు శాస్త్రవేత్తలు రోసెట్టా స్టోన్‌ను కూడా తిరిగి స్వదేశానికి అంటే ఈజిప్ట్‌కు తీసుకురావాలనుకుంటున్నారు. రోసెట్టా స్టోన్ ప్రస్తుతం బ్రిటిష్ మ్యూజియంలో ప్రదర్శనలో ఉంది. ఇది ఈజిప్ట్ నుంచి బ్రిటీషర్లు ఎత్తుకెళ్లినట్లు చెబుతున్నారు. పురావస్తు శాస్త్రవేత్తల ప్రకారం.. రోసెట్టా స్టోన్ నాటు బ్రిటన్ పాలకులు ఎత్తుకెళ్లారు. ఈ స్టోన్ క్రిస్తు పూర్వం 196 నాటిదని, 1800 సంవత్సరంలో ఫ్రాన్స్‌తో జరిగిన యుద్ధంలో బ్రిటన్ గెలిచిన తరువాత ఈ ప్రసిద్ధ రాయిని స్వాధీనం చేసుకున్నట్లు చరిత్రకారులు చెబుతున్నారు.
4. ఎల్గిన్ మార్బుల్స్..
చరిత్రలోని అనేక మీడియా నివేదికలు, ఆర్కైవ్‌ల ప్రకారం.. 1803లో, లార్డ్ ఎల్గిన్ గ్రీస్‌లోని పార్థినాన్ శిథిల గోడల నుండి అరుదైన రాళ్లను తీసి, వాటిని లండన్‌కు రవాణా చేశాడు. ఈ కారణంగానే ఆ విలువైన రాళ్లను ఎల్గిన్ మార్బుల్స్ అని పిలుస్తున్నారు. 1925 నుంచి గ్రీస్ తమ అమూల్యమైన మార్బుల్స్‌ని తిరిగి ఇవ్వాలని బ్రిటన్‌ను కోరుతోంది. అయితే, ఆ రాళ్లను బ్రిటీష్ మ్యూజియంలో ప్రదర్శనకు ఉన్నాయి.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..