AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: అదేమో చిన్న కారు.. ఏకంగా 27 మంది కూర్చున్నారు.. నెటిజన్లను పరేషాన్ చేస్తున్న స్టన్నింగ్ వీడియో..!

Viral Video: సాధారణంగా 5 సీటర్ కారులో ఎంత మంది కూర్చుంటారు? డ్రైవర్ సహా వెనుక ముగ్గురు, ముందు ఒకరు కూర్చుంటారు. మహా అయితే, పెద్దలైతే ఒక్కరు,

Viral Video: అదేమో చిన్న కారు.. ఏకంగా 27 మంది కూర్చున్నారు.. నెటిజన్లను పరేషాన్ చేస్తున్న స్టన్నింగ్ వీడియో..!
Viral
Shiva Prajapati
|

Updated on: Sep 12, 2022 | 6:07 AM

Share

Viral Video: సాధారణంగా 5 సీటర్ కారులో ఎంత మంది కూర్చుంటారు? డ్రైవర్ సహా వెనుక ముగ్గురు, ముందు ఒకరు కూర్చుంటారు. మహా అయితే, పెద్దలైతే ఒక్కరు, పిల్లలు అయితే ఇంకో ముగ్గురిని కూర్చోబెట్టుకోవడానికి వీలు ఉంటుంది. కానీ, ఈ కారులో మాత్రం ఐదుగురు కాదు, ఏడుగురు కాదు.. ఏకంగా 27 మంది కూర్చున్నారు. అవునండీ బాబూ.. మీరు చదివేది నిజంగా నిజం. 27 మంది కారులో ప్రశాంతంగా కూర్చుని ప్రపంచ రికార్డ్ నెలకొల్పారు. గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్‌(GWR)లో చోటు దక్కించుకున్నారు. 27 మంది కారులో కూర్చున్న వీడియోను GWR అధికారిక ట్విట్టర్ అకౌంట్‌లో షేర్ చేశారు. ‘ఈ సాధారణ మినీ కూపర్‌లో ఎంత మంది కూర్చోగలరు?’ అని పోస్ట్‌కు క్యాప్షన్ కూడా పెట్టారు.

సెప్టెంబర్ 6న పోస్ట్ చేయబడిన ఈ వీడియో వాస్తవానికి 2014 నాటిది. ఈ రికార్డు యునైటెడ్ కింగ్‌డమ్‌లో 8 సంవత్సరాల క్రితం సెట్ చేశారు. అప్పట్లో ఈ రికార్డును సృష్టించేందుకు సిబ్బంది రకరకాల టెక్నిక్‌లను ఉపయోగించారు. సీట్లను సర్దుబాటు చేసి, ఒకరిపై మరొకరు కూర్చున్నారు. కారు వెనుక కంపార్ట్‌మెంట్‌లో కూర్చోవడానికి కూడా ప్రయత్నించారు. మూడు నిమిషాల నిడివి గల క్లిప్‌లో వ్యక్తులు ఒకరి తర్వాత మరొకరు మినీ కూపర్‌లో కూర్చోవడం మనం చూడొచ్చు. ఒక వ్యక్తి లోపలికి వెళ్లాక మరొకరు సరిపోయేలా ఖాళీని ఏర్పరిచారు. తమ శరీరాలను ప్లెక్సిబుల్‌గా మారుస్తూ కేవలం 5 సీటర్ల మినీ కూపర్‌లో ఏకంగా 27 మంది కూర్చున్నారు. ఈ వీడియోను GWR పోస్ట్ చేయగా.. తెగ వైరల్ అవుతోంది. నెటిజన్లు ఈ వీడియోను చూసి పరేషాన్ అవుతున్నారు. ఇంతమంది ఎలా కూర్చోగలిగారంటూ షాక్‌లోకి వెళుతున్నారు. సాధారణంగా 5 సీటర్స్ కారులో ఆరుగురు కూర్చోవడానికే నానా తంటాలు పడుతుంటాం.. అలాంటిది ఏకంగా 27 మంది ఎలా కూర్చున్నార్రా బాబూ అని బుర్ర పగిలేలా ఆలోచిస్తున్నారు. మరెందుకు ఇంకా ఆలస్యం.. ఈ షాకింగ్ వీడియోపై మీరూ ఓ లుక్కేసుకోండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

ఆయిల్ ఫ్రీ ఆమ్లెట్.. చుక్క నూనెలేకుండా టేస్టీటేస్టీగా చేసుకోండి
ఆయిల్ ఫ్రీ ఆమ్లెట్.. చుక్క నూనెలేకుండా టేస్టీటేస్టీగా చేసుకోండి
భారత గడ్డపై డారిల్ మిచెల్ అన్ స్టాపబుల్ రికార్డ్
భారత గడ్డపై డారిల్ మిచెల్ అన్ స్టాపబుల్ రికార్డ్
భద్రతా దళాలు-ఉగ్రవాదుల మధ్య భీకర ఎన్‌కౌంటర్!
భద్రతా దళాలు-ఉగ్రవాదుల మధ్య భీకర ఎన్‌కౌంటర్!
సిపిఐ శతాబ్ది ఉత్సవాలు.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రసంగం..
సిపిఐ శతాబ్ది ఉత్సవాలు.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రసంగం..
క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లించకపోతే మిమ్మల్ని అరెస్టు చేయవచ్చా?
క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లించకపోతే మిమ్మల్ని అరెస్టు చేయవచ్చా?
ఒకే రోజు ఏడు వాహనాలపై భక్తులను క‌టాక్షించ‌నున్న మలయప్ప స్వామి
ఒకే రోజు ఏడు వాహనాలపై భక్తులను క‌టాక్షించ‌నున్న మలయప్ప స్వామి
ఆటోలో అనుమానాస్పదంగా కనిపించిన నీలి రంగు పెట్టె..!
ఆటోలో అనుమానాస్పదంగా కనిపించిన నీలి రంగు పెట్టె..!
కదిలే కారులోకి దూసుకొచ్చిన అడవి మృగం..తల్లి ఒడిలోని చిన్నారి మృతి
కదిలే కారులోకి దూసుకొచ్చిన అడవి మృగం..తల్లి ఒడిలోని చిన్నారి మృతి
ఒకే బ్యాటర్ పై మూడు సార్లు అటాక్..హర్షిత్ హ్యాట్రిక్ రికార్డ్
ఒకే బ్యాటర్ పై మూడు సార్లు అటాక్..హర్షిత్ హ్యాట్రిక్ రికార్డ్
ఆలయానికి ఏ పండు తీసుకెళ్తే శుభ ప్రదం.? ఎలాంటి ఫలితం వస్తుందో..
ఆలయానికి ఏ పండు తీసుకెళ్తే శుభ ప్రదం.? ఎలాంటి ఫలితం వస్తుందో..