ప్రపంచంలో రకరకాల వంటకాలు ఉన్నాయి. వీటిల్లో కొన్నిటింటి చాలా ఇష్టంగా తింటారు. అయితే కొన్ని వంటకాలు ప్రమాదకరమైనవిగా భావిస్తారు. వీటిని తినడం వలన ప్రాణాపాయం కూడా ఉంది. అయినప్పటికీ ప్రజలు వాటిని తినడానికి వెనుకాడరు. అటువంటి ప్రమాదకరమైన వంటకం థాయ్‌లాండ్, లావోస్‌లో ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది. అది అక్కడ ప్రసిద్ధ సాంప్రదాయ వంటల్లో ఒకటిగా పరిగణించబడుతుంది. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ వంటకం ప్రతి సంవత్సరం సుమారు 20 వేల మంది మరణానికి కారణమని తెలుస్తోంది.
ఈ వంటకం పేరు కోయి ప్లా సాంప్రదాయ థాయ్ వంటకం. లావోస్ , థాయిలాండ్‌లోని ఇసాన్ ప్రాంతానికి చెందిన ప్రజలు దీనిని పచ్చి చేపలు ముక్కలు, నిమ్మరసం, మూలికలు, సుగంధ ద్రవ్యాలతో తయారు చేసే సలాడ్‌గా భావిస్తారు. ఆడిటీ సెంట్రల్ అనే వెబ్‌సైట్ ప్రకారం ఈ వంటకంలో సమస్యాత్మక పదార్ధం చేప. వాస్తవానికి, ఈ చేపలో నివసించే పరాన్నజీవులు ప్రజలను అనారోగ్యానికి గురిచేస్తాయి. ఆ తర్వాత అవి చనిపోతాయి. ఈ పరాన్నజీవులు ప్రాణాంతక కాలేయ క్యాన్సర్‌కు కారకాలుగా మారుతున్నాయి.
‘కోయి ప్లా’ వంటకాన్ని సాధారణంగా మెకాంగ్ బేసిన్‌లో కనిపించే మంచినీటి చేపలతో తయారు చేస్తారు. పచ్చి చేపలతో తయారు చేయడంతో వీటికి ఫ్లాట్‌వార్మ్ పరాన్నజీవులతో సంక్రమిస్తాయి, వీటిని లైవ్ ఫ్లూక్స్ అని పిలుస్తారు. ఈ పరాన్నజీవులు మానవులలో క్యాన్సర్, పిత్త వాహిక క్యాన్సర్‌కు కారకాలని గుర్తించారు. ఈ పరాన్నజీవులు వలన థాయిలాండ్‌లోనే దాదాపు 20 వేల మంది మరణిస్తున్నారు.
థాయ్‌లాండ్‌లోని ఖోన్ కేన్ విశ్వవిద్యాలయంలో కాలేయ శస్త్రవైద్యుడు నరోంగ్ ఖుంటికియో 2017లో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇది ఇక్కడ చాలా పెద్ద ఆరోగ్య సమస్య కాలేయ క్యాన్సర్.. అయితే ఈ విషయం గురించి ఎవరికీ తెలియదు. ఎందుకంటే వీరు చెట్టు నుంచి రాలే ఆకుల్లా మరణిస్తున్నారు. కోయి ప్లా ను తినడం వల్లే తన తల్లిదండ్రులిద్దరూ కాలేయ క్యాన్సర్‌తో చనిపోయారని డాక్టర్ నరోంగ్ చెప్పారు. అందువల్ల డాక్టర్ నరోంగ్ థాయ్‌లాండ్‌లోని గ్రామీణ ప్రాంతాల్లో నివసించే ప్రజలకు ఈ వంటకం గురించి హెచ్చరిస్తూనే ఉన్నారు. ఈ ప్రమాదకరమైన వంటకం గురించి.. తింటే కలిగే అనారోగ్యం గురించి చెబుతూ ప్రజలకు ఆరోగ్యం గురించి తెలియజేస్తూ.. కోయి ప్లాను తినకూడదని హెచ్చరిస్తునే ఉన్నాడు.
పిత్త వాహిక క్యాన్సర్‌కు సాంకేతికంగా కోయి ప్లా ఒక్కసారి తింటే సరిపోతుందని చెబుతున్నారు. అందుకనే దీనిని ‘సైలెంట్ కిల్లర్’ అంటారు. పిత్త వాహిక క్యాన్సర్ బారిన పడిన వారు ఇతర వ్యాధులతో పోలిస్తే శస్త్రచికిత్స లేకుండా జీవించే అవకాశాలు చాలా తక్కువని అంటున్నారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..