బరాత్‌లో చేసిన డ్యాన్స్‌తో సెలబ్రిటీ అయిన నవ వధువు..! భర్తను సర్ప్రైజ్‌ చేయడానికే అలా చేసిందట..

| Edited By: Surya Kala

Aug 19, 2021 | 10:54 AM

Telangana Bride Dance: తన పెళ్లి బరాత్‌లో చేసిన డ్యాన్స్ తనను సెలబ్రిటీ చేస్తుందని బహుశా ఆమె కూడా ఊహించలేదనుకుంటా. ఒకే ఒక్క డ్యాన్స్‌తో ఇప్పుడు ఆమె అందరికి తెలిసిపోయింది.

బరాత్‌లో చేసిన డ్యాన్స్‌తో సెలబ్రిటీ అయిన నవ వధువు..! భర్తను సర్ప్రైజ్‌ చేయడానికే అలా చేసిందట..
New Bride Is A Celebrity
Follow us on

Telangana Bride Dance: తన పెళ్లి బరాత్‌లో చేసిన డ్యాన్స్ తనను సెలబ్రిటీ చేస్తుందని బహుశా ఆమె కూడా ఊహించలేదనుకుంటా. ఒకే ఒక్క డ్యాన్స్‌తో ఇప్పుడు ఆమె అందరికి తెలిసిపోయింది. గత రెండు రోజులుగా నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తా’ అనే డీజే పాటకు యువతి చేసిన డ్యాన్స్ సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్న సంగతి అందరికి తెలిసిందే. అయితే వారు ఎవరు.. ఎక్కడి వారు.. అనే విషయాలు తెలుసుకోవడానికి సోషల్‌ మీడియాలో నెటిజన్లు తెగ కామెంట్స్ చేస్తున్నారు. అయితే తాజాగా వారి వివరాలు కూడా వెల్లడయ్యాయి.

తెలంగాణలోని అబ్బాయిది మంచిర్యాల జిల్లా రామకృష్ణపూర్ లోని బీజోన్ చెందిన అశోక్‌కు సాయిశ్రియతో ఇటీవల వివాహమైంది.‌‌ పెళ్లయిన అనంతరం నిర్వహించిన బరాత్‌లో వధువు సాయిశ్రియ తన భర్తకు డ్యాన్స్‌తో ఊహించని సర్‌ప్రైజ్‌ ఇచ్చిన విషయం తెలిసిందే.

Wedding Photo

తెలంగాణ జానపదం పాట ‘బుల్లెట్టు బండి’కు అద్భుతంగా డ్యాన్స్‌ చేయడంతో సోషల్‌ మీడియాలో ట్రెండయ్యారు. ఆ వీడియో నెట్టింట చక్కర్లు కొట్టింది. తెల్లారి తాము సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అయిన విషయం తెలుసుకుని ఆ నవ దంపతులు ఆశ్చర్యపోయారు. ఈ అంశంపై వారు స్పందించారు. ‘ఇంత స్పందన అస్సలు ఊహించలేదు. ఇలా జరగడం చాలా ఆనందంగా ఉంది’ అని తెలిపారు.

Wedding 1

అయితే సాయి శ్రియ మాట్లాడుతూ ఈ వీడియో ఇలా ట్రెండ్ అవుతుందని ఊహించలేదన్నారు. కేవలం బరాత్‌లో తన భర్తను సర్‌ప్రైజ్‌ చేసేందుకు మాత్రమే డ్యాన్స్ చేశానని చెప్పుకొచ్చింది. అయితే ఈ వీడియో వైరల్‌ అవడం ఆనందంగా ఉందన్నారు.  అచ్చమైన తెలంగాణ యాసలో ఉన్న ఈ పాట ఒక్క యూట్యూబ్‌లోనే కాదు బయట కూడా మార్మోగుతోంది. తెలంగాణలో పెళ్లి బరాత్ కానీ ఏ ఫంక్షన్‌ అయినా సరే జానపద పాటలు దద్దరిల్లాల్సిందే. ‘నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తా ’ అనే పాట యూట్యూబ్‌లో అత్యధిక వ్యూస్‌ పొందింది. రచయిత లక్ష్మణ్‌ సాహిత్యం అందించగా ప్రముఖ గాయని మోహన భోగరాజు పాడారు. ఎస్‌కే బాజి సంగీతం అందించారు. ఈ ఏడాది ఏప్రిల్‌ 7వ తేదీన యూట్యూబ్‌లో విడుదలైన పాట ఇప్పటివరకు మూడు కోట్లకు పైగా వ్యూస్‌ సొంతం చేసుకుంది.

AP Crime News: గుంటూరు జిల్లాలో బ్యాంకు ఉద్యోగి పేరిట మహిళకు టోకరా.. లక్ష రూపాయలు అపహరించిన దుండగుడు

Minister Peddireddy: శబరిమల అయ్యప్ప స్వామిని దర్శించుకున్న మంత్రి పెద్దిరెడ్డి.. ఆయనతో పాటు మరో ఎంపీ, ఎమ్మెల్యే

AP IIIT Notification Release: ఏపీ విద్యార్థులకు గుడ్ న్యూస్.. ట్రిపుల్ ఐటీ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల..