Trending Video: జనావాసం లేని ఇంట్లో.. ఊహించని అతిథులు.. చూస్తే గుండెలు అదరాల్సిందే..
ఏదైనా కారణం వల్ల ఇంట్లో నివాసముండే పరిస్థితి లేకుండా పోతే.. కొన్నాళ్లకు ఆ ఇళ్లు పాడుబడిపోతుంది. చెట్లు పెరగడం, విష జీవులకు నిలయంగా మారుతుంది. మళ్లీ ఆ ఇంటిని ఆవాస్యయోగ్యంగా మార్చుకోవాలంటే శుభ్రం...

ఏదైనా కారణం వల్ల ఇంట్లో నివాసముండే పరిస్థితి లేకుండా పోతే.. కొన్నాళ్లకు ఆ ఇళ్లు పాడుబడిపోతుంది. చెట్లు పెరగడం, విష జీవులకు నిలయంగా మారుతుంది. మళ్లీ ఆ ఇంటిని ఆవాస్యయోగ్యంగా మార్చుకోవాలంటే శుభ్రం చేసుకుంటాం. అయితే.. ఓ ఇంట్లో ఎవరూ లేని ఇంట్లో కుప్పలు కుప్పలుగా విష జీవులు కనిపించడంతో ఆ యజమాని గండెలదిరిపోయాయి. సాధారణంగా భూమిపై చాలా రకాల జంతువులు ఉన్నాయి. వీటిలో కీటకాలు, పక్షులు అనేకం. వీటిలో సాధు జంతువులు కొన్నైతే.. ప్రమాదకరమైనవి మరి కొన్ని. ఈ జాబితాలో తేలు గురించి ముఖ్యంగా చెప్పుకోవాలి. పాముల మాదిరిగా అవి కూడా విషపూరితమైనవి. వీటి విషం మనుషులకు తీవ్ర హాని కలిగిస్తుంది. కొన్ని సార్లు ప్రాణాలు కూడా తీసేస్తుంది. సాధారణంగా ఒకే చోట 10-20 తేళ్లు కనిపించడం చాలా అరుదు. కానీ ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో లో మాత్రం వేల సంఖ్యలో తేళ్లు ఒకే చోట కనిపిస్తాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
వీడియోలో కనిపిస్తున్న దృశ్యం చూస్తే ఎవరికైనా ఒక్కసారిగా వణుకు పుడుతుంది. ఇరుకైన సందులో ఎన్ని తేళ్లు కనిపిస్తున్నాయో వీడియోలో చూడవచ్చు. గోడలపై కూడా తేళ్లు ఉన్నాయి. స్నేక్ ఐలాండ్ గురించి మీరు వినే ఉంటార. అక్కడ వేల సంఖ్యలో పాములు ఒకే దగ్గర ఉంటాయి. కానీ వేల సంఖ్యలో విషపూరితమైన తేళ్లు ఉండే ప్రదేశాన్ని మీరు ఎప్పుడూ చూసి ఉండరు. కానీ ఈ వీడియాలో మాత్రం చూడవచ్చు. ఒక్కసారి ఊహించుకోండి.. మనుషులు ప్రమాదవశాత్తు వాటి మధ్యకు వెళితే ఏం జరుగుతుందో..




Man finds thousands of scorpions in an abandoned house pic.twitter.com/Pv5DqxbFiu
— OddIy Terrifying (@OTerrifying) December 11, 2022
ఒళ్లు గగుర్పొడిచే ఈ వీడియో.. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ట్విట్టర్‌లో పోస్ట్ అయింది. కేవలం 15 సెకన్ల ఈ వీడియోను ఇప్పటి వరకు 8 మిలియన్లు వ్యూస్ వచ్చాయి. లక్షా 31 వేల మందికి పైగా లైక్ చేశారు. అంతే కాకుండా వీడియో చూస్తున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అంతే కాకుండా క్లిప్ చూసిన తర్వాత తమకు నచ్చినట్లుగా కామెంట్లు చేస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..