Watch Video: తండ్రికి తగ్గ తనయుడు..! తల్లి వేసుకున్న మేకప్‌ని చూసి ఏం చేశాడో చూడండి.. వీడియో చూస్తే నవ్వాగదుగా..

Trending Video: మగువలకు మేకప్ అంటే ఎంతో ఇష్టం. అయితే కొందరు మరింత అందంగా కనిపించాలనే ఆశతో ఎక్కువగా మేకప్ చేసేకుంటారు. అలా చేయడం చర్మానికి మంచిది కాకపోగా కొన్ని సందర్భాలలో నవ్వుల పాలవుతుంటారు. అలాంటి వీడియోలు కూడా సోషల్ మీడియాలో అనేకం

Watch Video: తండ్రికి తగ్గ తనయుడు..! తల్లి వేసుకున్న మేకప్‌ని చూసి ఏం చేశాడో చూడండి.. వీడియో చూస్తే నవ్వాగదుగా..
Child Cries after watching Mother's Makeup

Updated on: Jun 02, 2023 | 11:58 AM

Trending Video: మగువలకు మేకప్ అంటే ఎంతో ఇష్టం. అయితే కొందరు మరింత అందంగా కనిపించాలనే ఆశతో ఎక్కువగా మేకప్ చేసేకుంటారు. అలా చేయడం చర్మానికి మంచిది కాకపోగా కొన్ని సందర్భాలలో నవ్వుల పాలవుతుంటారు. అలాంటి వీడియోలు కూడా సోషల్ మీడియాలో అనేకం కనిపిస్తుంటాయి. తాజాగా ఓ మహిళ చేసిన మేకప్‌ని చూసి నెటిజన్లు నవ్వుతున్నారు, కానీ ఆమె కొడుకు మాత్రం భయపడిపోయి గుక్కపట్టి ఏడుస్తున్నాడు. సాధారణంగా పుట్టిన పిల్లలే తల్లి స్పర్శతో అమ్మ ఎవరో గుర్తు పట్టేస్తారని చెబుతుంటారు. అలాంటిది ఈ చిన్నోడు తన తల్లని గుర్తుపట్టలేదంటేనే అర్థం చేసుకోవాలి, ఆమె ఎంతలా మేకప్ వేసుకుంది అనే విషయం. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది.

ఆ వీడియోలో ఓ మహిళ ఫుల్లుగా మేకప్ చేసుకుని కొడుకు దగ్గరకు వస్తుంది. గుర్తుపట్టలేనంగా మేకప్ చేసుకున్న ఆమెను చూసిన ఆ చిన్నోడు తల్లిని గుర్తుపట్టకపోగా.. తనేదో భూతం అన్నట్లుగా ఏడవడం మొదలు పెట్టాడు. ‘నేను మీ అమ్మను’ అన్నట్లు ఆమె ఆ చిన్నోడిని సముదాయించే ప్రయత్నం చేసినా చాలా సమయం పాటు ఫలితం లేదు.‘నువ్వు మా అమ్మ కాదు’ అంటూ నెట్టేశాడు. ఆ క్రమంలో ఆమె తన కొడుకును ఒడిలోకి తీసుకుంది. అప్పటికీ ఆ చిన్నోడు తన తల్లిని గుర్తు పట్టినట్లుగా లేడు.

ఇవి కూడా చదవండి


ఇక ఈ వీడియోను చూసిన నెటిజన్లు పిచ్చపిచ్చగా నవ్వేసుకుంటున్నారు. మేకప్ వేసుకోవాలి కానీ ఎక్కువైతే ఇలాంటివే జరుగుతాయని, తండ్రికి తగ్గ తనయుడు తల్లిని చూడగానే భయపడ్డాడు అంటూ రాసుకొస్తున్నారు. ఇంకొందరైతే.. ఎవరినైనా భయపెట్టగల మేకప్ మహిమ అని.. తనకు పెళ్లయ్యాక పుట్టబోయే కొడుకు ఇలాగే చేస్తాడేమోననే భయం పట్టుకుందని ఓ యువతి కామెంట్ చేసింది. ఇదిలా ఉండగా ఈ వీడియోకు ఇప్పటివరకు 12.31 లక్షలకు పైగా లైకులు, 2.42 కోట్ల వీక్షణలు వచ్చాయి.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..