Viral Video: ఆక్టోపస్ వలలో చిక్కిన డేగ.. అటుగా వెళ్లిన జాలర్లు.. కట్ చేస్తే.. వైరల్ వీడియో

Redditలో మరోసారి షేర్ చేసిన ఈ వీడియో క్లిప్‌కి 45,000 కంటే ఎక్కువ అప్‌వోట్‌లు వచ్చాయి. అయితే, తొలుత మత్స్యకారులు జోక్యం చేసుకోవాడానికి కాస్త భయపడ్డారు. కానీ..

Viral Video: ఆక్టోపస్ వలలో చిక్కిన డేగ.. అటుగా వెళ్లిన జాలర్లు.. కట్ చేస్తే.. వైరల్ వీడియో
Viral Video Bald Eagle Vs Octopus

Updated on: Aug 03, 2022 | 11:56 AM

Octopus Viral Video: నెట్టింట్లో ప్రతిరోజూ ఎన్నో వీడియోలు సందడి చేస్తుంటాయి. అందులో కొన్ని మాత్రం నెటిజన్ల మనసులకు దగ్గరవుతాయి. దీంతో ఆ వీడియోలు నెట్టింట్లో తెగ వైరల్‌గా మారుతుంతాయి. ఇలాంటిదే ఓ వీడియో తాజాగా సోషల్ మీడియాలోకి వచ్చి చేరింది. ఈ వీడియోలో పెద్ద ఆక్టోపస్ బారిలో చిక్కుకున్న డేగను చూడొచ్చు. ఈ వీడియో పాతదే అయినా.. ప్రస్తుతం నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. 2019లో కెనడాలోని వాంకోవర్‌లో మత్స్యకారుల బృందం ఈ వీడియోను పంచుకుంది. ఆక్టోపస్ వలలో చిక్కుకున్న డేగ తన ప్రాణాలను కాపాడుకునేందుకు తీవ్రమైన ప్రయత్నాలు చేస్తుంది. చివరకు తన బలం సరిపోక చావు అంచులకు చేరుకుంటుంది. అయితే, ఇంతలో అటునుంచి వెళ్తోన్న మత్స్యకారులు డేగ అరుపులు విని, దగ్గరకు వెళ్లి చూశారు. ఇంకేముంది, డేగ చావుబతుకుల్లో ఉందని వారికి అర్థమైంది. దీంతో డేగను చావు నుంచి తప్పించేందుకు బరిలోకి దిగారు.

Redditలో మరోసారి షేర్ చేసిన ఈ వీడియో క్లిప్‌కి 45,000 కంటే ఎక్కువ అప్‌వోట్‌లు వచ్చాయి. అయితే, తొలుత మత్స్యకారులు జోక్యం చేసుకోవాడానికి కాస్త భయపడ్డారు. కానీ, చివరికి ధైర్యం చేసి బరిలోకి దిగారు. వారు ఒక కర్ర సహాయంతో రెండు జంతువులను తమ పడవ వద్దకు లాగారు. ఆక్టోపస్ కొరల్లో చిక్కుకున్న డేగను ఎట్టకేలకు విడిపించారు. దీంతో బతుకు జీవుడా అన్నట్లు ఆ డేగ, అక్కడి నుంచి ఒడ్డకు చేరుకుని, ఊపిరి పీల్చుకున్నట్లు వీడియోలో చూడొచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..